Politics

నాకు ఏ వ్యాపారం లేదు. తెదేపాను వీడను.

Karanam Balaram Says He Will Be With TDP On Facebook

తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం స్పష్టం చేశారు. బెదిరిస్తే పార్టీ మారడానికి తమకు రాళ్ల వ్యాపారం, ఇసుక వ్యాపారం లేదని ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. పార్టీ మారాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రకాశం జిల్లాకు చెందిన తెదేపా ఎమ్మెల్యేలు కొందరు వైకాపాలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కరణం బలరాం పేస్‌బుక్‌ వేదికగా స్పందించారు.