NRI-NRT

ఫ్లోరిడాలో నాట్స్ అష్టావధానం

NATS Florida Arranges Ashtavadhanam With Parvateeswara Sharma-ఫ్లోరిడాలో నాట్స్ అష్టావధానం

నాట్స్ ఆధ్వర్యంలో ఫ్లోరిడా రాష్ట్రంలోని టెంపాలో అష్టావధానాన్ని కార్యక్రమాన్ని “శతావధానిచే అవధానం” అనే శీర్షికతో స్థానిక అయ్యప్పస్వామి ఆలయంలో నిర్వహించారు. డాక్టర్ రాంభట్ల పార్వతీశ్వర శర్మ అష్టావధానం చేశారు. స్థానిక ప్రముఖులు, తెలుగు భాషా ప్రేమికులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. సమస్య: భాస్కర్ సోమంచి , దత్తపది: శారద మంగిపూడి, వర్ణన: డా. వెంకట శ్రీనివాస్ పులి, నిషిద్ధాక్షరి: బ్రహ్మానంద శర్మ మొదిలి, న్యస్తాక్షరి: మూర్తి మధిర ఛందోభాషణం: రామకృష్ణ ఉడుత, అప్రస్తుత ప్రసంగం: ఆచార్య శివకుమార్ పంగులూరి, ఆశువు: రాఘవేంద్ర ద్రోణంరాజు, చి. రిషిత్ వడ్లమాని, శిరీష దొడ్డపనేని, ఆచార్య సుబ్బారావు దూర్వాసుల తదితరులు అవధానాన్ని ఆసక్తికరంగా రక్తికట్టించడంలో తోడ్పాడ్డారు. అవధాని ఆచార్య రాంభట్ల పార్వతీశ్వర శర్మ తెలుగు రాష్ట్రాల్లో 55 అవధానాలు చెయ్యగా, ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర అమెరికా పర్యటనలో తన అవధాన షష్టిపూర్తి చేసుకుని, టాంపాలో తన 62వ అవధానం అద్భుతంగా పూర్తి చేశారు. నాట్స్ టెంపా సమన్వయకర్త రాజేశ్ కాండ్రు సమన్వయంతో ఏర్పాటైన ఈ అవధాన కార్యక్రమం ఆద్యంతం తెలుగు భాషా మాధుర్యాన్ని పంచింది. నాట్స్ కు భాష, సేవ రెండు రెండు కళ్లలాంటివని ఈ సందర్భంగా నాట్స్ ఛైర్మన్ శ్రీనివాస్‌ గుత్తికొండ గుర్తు చేశారు. మూర్తి మధిర,నాట్స్‌బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీ ప్రశాంత్ పిన్నమనేని సుధీర్ మిక్కిలినేని, శ్రీనివాస్ మల్లాది, శ్రీనివాస్ అచ్చి, జగధీశ్ తౌటం, ప్రసాద్ ఆరికట్ల, శ్రీధర్ గౌరవెల్లి, సురేష్ బొజ్జ, శిరీషా దొడ్డపనేని,సుధా బిందు బండ, అయ్యప్ప స్వామి ఆలయ వైస్ ప్రెసిడెంట్ రమా కామిశెట్టి , జాయింట్ ట్రెజరర్ రాజా పంపాటి తదితరులు పార్వతీశ్వర శర్మను సన్మానించారు. పద్మజ అన్నంరాజు, దీప పంగులూరి, భావన వడ్లమాని, సంధ్య కాండ్రులు తేనీటి విందు ఏర్పాటు చేశారు.