DailyDose

కియాను ప్రారంభించిన సీఎం జగన్‌-వాణిజ్యం-12/05

YS Jagan Launches KIA-Telugu Business News-12/05

* పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్‌ గ్రాండ్‌ సెర్మనీ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కియా మోటర్స్‌ ప్లాంట్‌ను సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కియా మోటర్స్‌ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కియా మోటార్స్‌ బాటలోలో మరికొన్ని కంపెనీలు ఏపీకి వస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తంచేశారు. ‘పెనుకొండలో కియా ఫ్యాక్టరీని ప్రారంభించటం సంతోషంగా ఉంది. కియా కార్ల పరిశ్రమ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఏర్పాటు కావటం శుభపరిణామం. కియా యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఏపీలో ఇంత పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేసినందుకు కియా సంస్థ ను అభినందిస్తున్నా’ అని అన్నారు. అంతకుముందు పరిశ్రమలోని అన్ని విభాగాలను సీఎం పరిశీలించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కియా ఫ్యాక్టరీ డాక్యుమెంటరీ చిత్రాన్ని జగన్‌ వీక్షించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో ఏపీలో కియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన దక్షిణ కొరియా సంస్థ కియా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రూ.13500 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కార్ల పరిశ్రమ ఏర్పాటు చేశారు.
* ఆర్‌బీఐ కీలకమైన పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను నేడు ప్రకటించింది. ఈ ద్వైమాసికానికి వడ్డీరేట్లలో ఎటువంటి మార్పులు చేయకూడదని నిర్ణయించింది. దీంతో రెపోరేటు ప్రస్తుతం ఉన్న 5.15శాతం వద్దే కొనసాగనుంది. మరోవైపు రివర్స్‌ రెపోరేటు 4.90శాతం వద్ద, బ్యాంక్‌ రేటు 5.40శాతం వద్ద కొనసాగుతాయి. ఆర్‌బీఐ నిర్ణయం మర్కెట్‌ అంచనాలకు ప్రతికూలంగా ఉండటంతో వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి.
* కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ రుణదాతలకు తనఖా షేర్ల విషయం లో తక్షణ ఊరట కల్పించేందుకు సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) నిరాకరించింది.
* చైనా కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ కంపెనీ స్కైవర్త్‌ ఎకరాల్లో ఏర్పాటు చేయను న్న తయారీ యూనిట్‌లో రెండో దశలో మరిన్ని పెట్టుబడులు రానున్నాయి.
* పాత పన్ను బకాయిల సత్వ ర క్లియరెన్స్‌ కోసమే కేంద్ర ప్రభుత్వం సబ్‌కా విశ్వాస్‌ (లెగసీ డిస్ప్యూట్‌ రిసొల్యూషన్‌) స్కీమ్‌ఎస్‌వీఎల్‌డీఆర్‌ఎస్‌)ను ప్రవేశపెట్టిందని హైదరాబాద్‌ జోన్‌ సెంట్రల్‌ జీఎ్‌సటీ అండ్‌ కస్టమ్స్‌ చీఫ్‌ కమిషనర్‌ వాసా శేషగిరిరావు అన్నారు.
* తప్పనిసరి హాల్‌మార్కింగ్‌తో స్వర్ణాభరాల వ్యాపార ముఖచిత్రం మారనుందని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ చైర్మన్‌ ఎంపీ అహ్మద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. హాల్‌మార్కింగ్‌తో వినియోగదారులకు తాము కొనుగోలు చేసే నగల స్వచ్ఛతపై విశ్వాసం ఏర్పడుతుందన్నారు.
* ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) జనవరి నుంచి వరకు అంతర్జాతీయ సదస్సు (గ్లోబల్‌ సమిట్‌)ను ఢిల్లీలో నిర్వహించనుంది. ఈ సదస్సును ప్రారంభించమని ప్రధాని నరేంద్ర మోదీని కోరామని మంది విదేశీ ప్రతినిధులతో సహా మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారని ఐసీఏఐ జాతీయ ప్రెసిడెంట్‌ బల్వీందర్‌ సింగ్‌ తెలిపారు.
* గాయత్రీ ప్రాజెక్ట్స్‌ అనుబంధ సంస్థ గాయత్రీ ఎనర్జీ వెంచర్స్‌ (జీఈవీపీఎల్‌).. సెంబ్‌కార్ప్‌ ఎనర్జీ ఇండియా (ఎస్‌ఈఐఎల్‌)లోని శాతానికి సమానమైన కోట్ల షేర్లను సెంబ్‌కార్ప్‌ యుటిలిటీస్‌ పీటీఈకి విక్రయించనుంది.
* పాలసీదారులు క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లిస్తే సేవా రుసుములో రాయితీ కల్పించనున్నట్లు ఎల్‌ఐసీ తెలిపింది. ఎల్‌ఐసీ సంస్థలో పాలసీ తీసుకున్న బీమాదారులు తమ పాలసీ ప్రీమియందానిని ముందుగా చెల్లించడంపాలసీపై పొందిన రుణానికిగాను వాయిదారుణ వడ్లీలను క్రెడిట్‌ కార్డు ద్వారా ఎలకా్ట్రనిక్‌ పరివర్తన విధానంలో చెల్లిస్తున్నారు.
* దేశంలో వేగవంతంగా అభివృద్ధి చెం దిన విమానయాన సంస్థ గో-ఎయిర్‌ మరో కొత్త సర్వీసులను ప్రస్తుత శీతాకాలంలో విడు దల చేస్తున్నట్టు ప్రకటించారు.