Health

కలరా ఉండలు వాసన చూడకండి

Dont Smell Napthalene Balls-Telugu Health News-12/06

నాఫ్తలీన్‌ గోళీలు తెలుసుగా! పురుగు పట్టకుండా బీరువాల్లో, అల్మారాలో వేస్తుంటాం. కొంతమంది వీటిని అదేపనిగా వాసన చూస్తుంటారు. మీరూ అలా చేస్తుంటే కాస్త జాగ్రత్త. నాఫ్తలీన్‌ గోళీ సువాసన పంచినా ప్రాథమికంగా కీటకనాశిని అని గుర్తుంచుకోవాలి. దీనిలోని పారాడైక్లోరోబెంజీన్‌ రక్తకణాలు, మూత్రపిండాలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే వీటి వాసన అతిగా పీల్చకూడదు. పిల్లలకు దూరంగా ఉంచాలి. ఉన్నాయి కదాని బీరువాల్లో మోతాదుకు మించి వేయొద్ధు పట్టుచీరలకు అదికూడా మోతాదు మించకుండా వాడాలి. సింథటిక్‌ వస్త్రాలకు వీటి అవసరం ఉండనే ఉండదు.