Sports

నాకు అంత తీరిక లేదు-గంగూలీ

Ganguly Respnds To Avenging Ravi Shastri

గత విభేదాలను దృష్టిలో పెట్టుకొని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రిపై కక్షపూరితంగా వ్యవహరిస్తామనడంలో అర్థం లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నారు. అవన్నీ వదంతులేనని పేర్కొన్నారు. పదవీకాలంలో చేసిన ప్రదర్శనల ఆధారంగానే వ్యక్తుల పనితీరు అంచనా వేస్తారని స్పష్టం చేశారు. 2016లో అనిల్‌కుంబ్లేను కోచ్‌గా ఎంపిక చేయడంలో దాదా కీలక పాత్ర పోషించారు. అప్పుడు ఇంటర్వ్యూకు హాజరైన శాస్త్రికి ఈ పదవి దక్కలేదు. దీంతో గంగూలీ వల్లే తనకు పదవి దక్కలేదని శాస్త్రి విమర్శించారు. దాదా సైతం ప్రతివిమర్శలు చేశారు.