Movies

సాధారణత నేర్చుకోవాలి

Sonakshi Praises Salman For His Humility And Modesty

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌పై నటి సోనాక్షి సిన్హా ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే వీరిద్దరు ‘దబాంగ్‌’, ‘దబాంగ్‌ 2’ చిత్రాల్లో కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రం ‘దబాంగ్ 3’. ప్రభుదేవా దర్శకత్వం వహించారు. క్రిస్మస్‌ కానుగా డిసెంబర్‌ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సోనాక్షి ఓ ఆంగ్ల ప్రతికతో ముచ్చటించారు. స్టార్‌డమ్ ఉన్నా సరే సల్మాన్‌ చాలా సాధారణమైన వ్యక్తిగా ఉంటాడని ఆమె అన్నారు. అంతేకాకుండా మంచి కెరీర్‌ కావాలంటే సల్మాన్‌లో ఉన్న కొన్ని లక్షణాలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ఆమె సూచించారు.