DailyDose

నల్లకుంట నడిరోడ్డుపై దారుణ హత్య-నేరవార్తలు-12/07

Man Murdered In Nallakunta-Telugu Crime News-12/07

* పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో డిసెంబర్ 3వ తేదీన జరిగిన హత్య కేసును చేదించిన తాళ్లపూడి పోలీసులు.కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వర్రెడ్డి మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం మద్యం మత్తులోనే ఈ హత్య జరిగినట్లు ఆయన తెలిపారు.మృతుడు, హంతకులు ముగ్గురు ప్రాణ స్నేహితులని, మద్యం మత్తులో మాటామాటా పెరిగి హత్యకు దారి తీసినట్లు ఆయన తెలిపారు.హంతకులలో ఒకరు మైనర్ కావడంతో ఏలూరు జువైనల్ కోర్టులో హాజరు పర్చనున్నట్లు ఆయన తెలిపారు.

* ప్రియాంక రెడ్డి పై దారుణ అకృత్యానికి పాల్పడిన నిందితులపై పోలీసులు తీసుకున్న చర్యలు యావత్ రాష్ట్ర దేశ ప్రజలు హరీష్ ఇస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణదాస్ మాట్లాడుతూ మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారికి పోలీసులు చర్యలు ఒక హెచ్చరికగా ఉంటాయన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తాను ఎన్కౌంటర్లో సమర్ధించ లేకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అనడానికి ఇది ఒక నిదర్శనంగా ఉంటుందన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో రక్షణ ఉండాలని సమాజంలో అత్యంత పవిత్రతతో చూసిన మహిళలపై వారు నిర్దాక్షిణ్యంగా చేసిన పని చాలా పాశవికమైన దని అన్నారు.

* దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై పలువురు మహిళలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. తమ బిడ్డ లాంటి దిశకు ఆత్మకు శాంతి చేకూరిందని బిజెపి మహిళా మోర్చా నాయకురాలు శారద మల్లేష్, అనిత మాట్లాడుతూ నిందితులకు ఉరిశిక్ష పడుతుందని భావించామని, అంతకు మించి న్యాయం జరిగిందని భావిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లాలాపేట లో వారు మాట్లాడుతూ మళ్లీ మహిళలపై ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలుపుతూ ఎన్కౌంటర్ జరిగిన సంఘటనను స్వాగతించారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని నెలల తరబడి సెక్యూరిటీ కల్పిస్తూ తిండి పెట్టడం ఎంతవరకు సబబనీ వారు ప్రశ్నించారు. ఇలాంటి వారికి ఇప్పుడు విధించిన శిక్ష సమంజసమైనదని పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. దిశ ఘటన తమను ఎంతో కలచివేసిందని ఈ విషయంలో దేశవ్యాప్తంగా దిశకు వచ్చిన సానుభూతి నేడు నేరం చేసిన వారు హతం అయ్యారని సంతోషం వ్యక్తం చేశారు. బైట్: శారద మల్లేష్(బిజెపి మహిళా మోర్చా నాయకురాలు) . బైట్: అనిత(బిజెపి మహిళా మోర్చా నాయకురాలు)

* దిశ అత్యాచారం ఆపై హత్య చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ అంబర్పేట్ చౌరస్తా లో టిఆర్ఎస్ నాయకులు యాసిన్ ఆధ్వర్యంలో ప్ల కార్డులను ప్రదర్శించారు. దిశ కుటుంబానికి దేశం యావత్తు మద్దతు ఉందని అన్నారు. ఎట్టకేలకు నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో ఢిల్లీ నిర్భయ నిందితులను ఎన్కౌంటర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, మహిళలు ఈ కార్యక్రమంలో లో పాల్గొన్నారు.

* ప”గో జిల్లా… చింతలపూడి మండలం వెంకటాపురం గ్రామంలో మహిళ దారుణ హత్య
? పాలేటి సత్యవతి అనే మహిళను రాడ్డుతో కొట్టి చంపిన అదే గ్రామానికి చెందిన గల్లా శ్రీను.
? 10 రోజులు నుండి మెంటల్ వ్యవహరిస్తున్న గల్లా శ్రీను
? 9 రోజుల క్రితమే తన ట్వ్శ్ స్తర్ చిత్య్ బండిని కాల్చివేశాడంటున్న గ్రామస్తులు.
? గత రాత్రి తన ఇంటి డాబా పైకి ఎక్కి అరుపులు కేకలు వేసిన గల్లా శ్రీను.
? ఈరోజు ఉదయం తన దగ్గరకు ఎవరైనా వస్తే చంపుతానని బెదిరింపులు.

* నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో బాయమ్మ గల్లి వీధిలో రమేష్(40) అనే వ్యక్తినీ హత్య చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో హత్య జరిగి నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. ఆస్తి తగాదాలు నేపథ్యం లోమృతుడి అన్న నే హత్య చేశా డని పోలీసులు తెలిపారు