ScienceAndTech

ఎయిర్‌టెల్ మొబైల్ యాప్ తక్షణమే అప్‌డేట్ చేసుకోండి

Security Loop Hole In Airtel Mobile App-Telugu SciTech News-12/07

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌కు చెందిన మొబైల్‌ యాప్‌లో తీవ్రమైన భద్రతా లోపం తలెత్తింది. అయితే సరైన సమయంలో దాన్ని గుర్తించి సరిచేయడంతో పెద్ద సంఖ్యలో యూజర్‌ డేటా లీక్ ముప్పు తప్పినట్టు ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. ఎయిర్‌టెల్‌ యాప్‌లోని అప్లికేషన్‌ ప్రొగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌(ఏపీఐ)లో ఈ భద్రతా లోపం తలెత్తినట్లు కంపెనీ తెలిపింది. ఈ లోపం ద్వారా హ్యాకర్లు కేవలం యూజర్ల ఫోన్‌ నంబర్ల ద్వారానే వారి వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునే ప్రమాదం ఉందని పేర్కొంది. యూజర్ల వ్యక్తిగత వివరాలైన పేరు, అడ్రస్‌, పుట్టినతేదీ, మొబైల్‌ ఐఎంఈఐ నంబరు, ఈమెయిల్‌ ఐడీ తదితర వివరాలను హ్యాకర్లు తెలుసుకునేవారని తెలిపింది. అదే జరిగితే 30కోట్ల మంది యూజర్ల డేటా ప్రమాదంలో పడేది. అయితే ఈ సమస్య తమ దృష్టికి వచ్చిన వెంటనే లోపాన్ని సరిచేసినట్లు స్పష్టం చేసింది. బెంగళూరుకు చెందిన సెక్యూరిటీ రీసర్చర్‌ ఇరాజ్ అహ్మద్‌ ఈ లోపాన్ని గుర్తించి ఎయిర్‌టెల్‌కు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే దాన్ని సరిచేసినట్లు ఎయిర్‌టెల్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఖాతాదారుల వ్యక్తిగత భద్రత తమకు చాలా ప్రాధాన్యమైన అంశమని తెలిపారు.