Food

కాఫీ ఒక్కటే తాగితే ఏ ఇబ్బంది ఉండదు

కాఫీ - Drinking Only Coffee Doesn't Harm Your Heart-Telugu Food & Diet News

చాలామంది లేవగానే కాఫీ తాగకుండా ఉండరు. కొందరయితే రోజుకి మూడు నాలుగుకప్పులు కాఫీ కూడా తాగుతుంటారు. అయితే అందరూ అనుకున్నట్లుగా కాఫీ గుండె ఆరోగ్యానికి హానికరం కాదు అంటున్నారు క్వీన్‌ మేరీ విశ్వవిదాలయ నిపుణులు. ఏకంగా పది కప్పులపైగా కాఫీ తాగేవాళ్లలో కూడా రక్తనాళాలు బాగానే ఉన్నాయనీ కాబట్టి కాఫీ తాగడానికీ గుండెజబ్బులకీ సంబంధం లేదనీ అంటున్నారు. శరీర భాగాలన్నింటికీ ఆక్సిజన్‌నీ పోషకాలనీ రక్తంతోబాటుగా సరఫరా చేసే రక్తనాళాల గోడలు మందమై గట్టిగా అయిపోతే అవి రక్తాన్ని సరిగ్గా సరఫరా చేయలేవు. దాంతో హృద్రోగాలూ పక్షవాతం వంటివి వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వీళ్లు రోజుకి ఒక కప్పు/ మూడు కప్పులు/అంతకన్నా ఎక్కువ తాగేవాళ్లని ఎంపికచేసి వాళ్ల గుండెను స్కాన్‌ చేసి పరిశీలించారట. అందులో వీళ్లందరిలో పెద్దగా తేడా ఏమీ కనిపించలేదట. అయితే కాఫీతోబాటుగా ఆల్కహాల్‌, సిగరెట్‌ కాల్చేవాళ్లలో మాత్రం రక్తనాళాల గోడలు గట్టిగా అయిపోవడాన్ని గుర్తించారు. అంటే కేవలం కాఫీ ఒక్కదానివల్లా రక్తనాళాలు గట్టిగా అయిపోవడం అనేది జరగదని తేల్చి చెబుతున్నారు