DailyDose

కడప కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం-నేరవార్తలు-12/09

Farmer Attempts Suicide At Kadapa Collectorate-Telugu Crime News Roundup Today-12/09

* కుప్పం ప్రాంతంలో ఏనుగుల బీభత్సం కొనసాగుతోంది. శాంతిపురం మండలం కర్నాటక సరిహద్దుల్లోని బెల్లకోగిళ గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తోంది. ఏనుగుల గీంకారాలతో గ్రామాలు దద్దరిల్లుతున్నాయి. పంట పోలాలను నాశనం చేస్తున్నాయి. కర్నాటక‌ నుండి వచ్చిన సుమారు ఏడు ఏనుగుల గుంపు.. వరుస దాడులతో శాంతిపురం, గుడుపల్లి మండలాల ప్రజలు, రైతులు బిక్కు బిక్కుమంటున్నారు.

* చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వెల్లంపల్లి ఎస్టీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. కృష్ణయ్య(50), మరదలు చెంచమ్మ(48), మనవడు గౌతమ్‌(4)తో కలిసి కట్టెల కోసం పంటపొలాల్లోకి వెళ్లగా ఈ ప్రమాదం  జరిగింది. స్థానికుల సమాచారంతో డీఎస్పీ నాగేంద్రుడు,  గ్రామీణ ఎస్సై తిమోతీ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్‌కు చెందిన దుర్గయ్య, లింగమ్మ దంపతులు ఈ రోజు ప్రజావాణిలో జేసీ డెవిడ్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కొడుకులు, కోడళ్ల నుంచి తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. 70 సంవత్సరాల వయస్సున్న ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పంపకాల్లో భాగంగా వారసులకు ఆస్తులు పంచి ఇవ్వగా, తమ వద్ద ఎకరం పొలం, 500 చదరపు గజాఉన్న ఇంటిని ఉంచుకున్నారు. ఈ క్రమంలో కుమారులు, కోడళ్లు వృద్దులను కొట్టి, బూతులు తిడుతూ ఇంటి నుంచి వెళ్లగొడ్డారు. దీనిపై డోర్నకల్ పోలీస్‌స్టేషన్‌లో, ఊరిలోని పెద్దమనుషుల వద్ద విన్నవించుకున్నా తమ సమస్య ఎవరూ పరిష్కరించడం లేదని దంపతులు వాపోయారు. పెద్దమనుషులు చెప్పినట్లు కొడుకులకు రూ.3 లక్షలు ఇచ్చినా తమను ఇంటిలో ఉండనివ్వకుండా ఆ ఇళ్లును కూల్చివేశారని మొరపెట్టుకున్నారు. వృద్ద దంపతుల ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని జేసీ డెవిడ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

* దిశ హత్యకు కారణం విచ్చలవిడి మద్యం అమ్మకాలేనని వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని అన్నారు. ఏపీ అసెంబ్లీలో మహిళల భద్రతపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల భద్రతపై చర్చను అడ్డుకోవడం బాధాకరమన్నారు. మహిళల భద్రత టీడీపీ సభ్యులకు అవసరం లేదా అని ప్రశ్నించారు. మహిళల భద్రతపై మాట్లాడుతుంటే అడ్డు తగులుతారా అని అన్నారు. సమాజంలో మహిళలు అభద్రతకు లోనవుతున్నారన్నారు. మహిళల భద్రతపై చర్చిస్తే టీడీపీ నేతల జాతకాలు బయటపడతాయన్నారు. అందుకే సభను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారన్నారు. ఉల్లిధరలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బయటికెళితే ఏమవుతుందోనని మహిళలు భయపడుతున్నారన్నారు. మద్యం నియంత్రణతో ఆడపిల్లలు నిర్భయంగా తిరగగలుగుతున్నారన్నారు. 40ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి కొడుకు చిత్తగా ఓడిపోయాడన్నారు. చంద్రబాబుకు ఆడపిల్లలు ఉండి ఉంటే ఆడవాళ్ల సమస్య అర్థమయ్యేదన్నారు.

* క్రికెట్‌ స్టేడియంలోకి అనుకోని అతిథి రావడంతో కాసేపు రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. 2019-20 రంజీ ట్రోఫీ సీజన్‌ విజయవాడలో సోమవారం ఉదయం ప్రారంభమైంది. గ్రూప్‌-ఏలో భాగంగా ఆంధ్ర – విదర్భ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో విదర్భ జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. అయితే మ్యాచ్‌ ప్రారంభమైన కాసేపటికే స్టేడియంలో పాము ప్రత్యక్షమైంది. దీంతో ఫీల్డింగ్‌లో ఉన్న ఆటగాళ్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో మ్యాచ్‌ను కాసేపు అంపైర్లు ఆపేశారు. పామును స్టేడియం నుంచి బయటకు పంపించిన తర్వాత తిరిగి మ్యాచ్‌ను ప్రారంభించారు అంపైర్లు. స్టేడియంలో పాము ప్రత్యక్షమైన దృశ్యాలను బీసీసీఐ డొమెస్టిక్‌ తన అధికారిక ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేసింది.

* దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై హైకోర్టు విచారణ… పోలీసులు నిందితుల పై జరిపిన ఎన్ కౌంటర్ బూటకపు ఎన్ కౌంటర్ అంటూ హైకోర్టు లో పిటిషన్ లేఖ ధాఖలు.. హైకోర్టు ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో భద్ర పరచిన పోలీసులు… హైకోర్టు ఆదేశాల మేరకు నిందితుల పొస్తమార్టం మొత్తం వీడియో రికార్డ్ చేసిన పోలీసులు.. నిందితుల పోస్టుమార్టం, ఫోరెన్సిక్ రిపోర్ట్, వీడియో గ్రఫీ మొత్తం మహబూబ్ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ కు సమర్పించిన పోలీసులు.. పోలీసులు సమర్పించిన పోస్టుమార్టం, ఫోరెన్సిక్ రిపోర్ట్, వీడియో గ్రఫీ ని హైకోర్టు కు సమర్పించిన మహబూబ్ నగర్ జిల్లా మేజిస్ట్రేట్… మరోవైపు మృతదేహాలను అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్… మృతదేహాల అప్పగింత పై నేడు తుది నిర్ణయం తెలపనున్న హైకోర్టు… దిశ ఎన్ కౌంటర్ పై సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో 7 గురు సభ్యులతో సిట్ ఏర్పాటు.

* ఏర్పేడు (మ) వెల్లంపల్లి ఎస్టి కాలనీలో విషాదం. విద్యుత్ ఘాతంతో ముగ్గురు మృతి. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. అటవీ ప్రాంతంలో కట్టెలు తీసుకుని వస్తుండగా ప్రమాదం.

* అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మీడియాపై నియంత్రిత్వ పోకడలు చీఫ్ మార్షల్ ఆదేశాల అంటూ జైల్లో ఖైదీలు మాదిరిగా మీడియా ప్రతినిధులను నిలబెట్టిన భద్రతా సిబ్బంది.. మీడియా పాయింట్ నుంచి అసెంబ్లీ వైపు వెళ్ళనియకుండా అడ్డుకుంటున్న భద్రతా సిబ్బంది.. మరో మార్గంలో చుట్టూ తిరిగి రావాలని మార్షల్ అదేశాలంటూ మీడియా ప్రతినిధులతో వాగ్వివాదానికి దిగిన సిబ్బంది.. చీఫ్ మార్షల్.. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి రావటంతో సద్దుమనిగిన వివాదం.. ఐఎండీపీఆర్ డీడీ చొరవతో అడ్డుపెట్టిన భారీ ఖేడు అడ్డు తీసి దారి వదిలిన వైనం.. అసెంబ్లీ భద్రత సిబ్బంది వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మీడియా ప్రతినిధులు.. ఎస్పీ తో మాట్లాడి మీడియా ప్రతినిధులకు ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇచ్చిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

* కర్నూల్ లో ఏసీబీ అధికారుల దాడులు – నోటు పుచ్చుకుంటూ.. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయిన కర్నూలు సబ్ రిజస్ట్రార్ మహబూబ్ అలీ – ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా ఐదు వేల రూపాయలు తీసుకుంటుండగా.. వలపన్ని మహబూబ్ అలీ ని పట్టుకున్న ఏసీబీ అధికారులు.

* కడప కలెక్టరేట్ కార్యాలయంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య కు యత్నించిన వెంకటరమణ అనే వ్యక్తి… పోలీస్ లు సకాలం లో స్పందించడం తో తప్పిన ప్రమాదం… గేదెల డైరీ కోసం 5 మంది సభ్యులకు మంజూరు అయిన 28 లక్షల 75 వేల చెక్కు అకౌంట్ లో జమ చేయలేదని ఆవేదన వ్యక్తం… కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయితీ సుందరయ్యే వసిగా గుర్తింపు.

* హైకోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల వాగ్వాదం.. ఎన్కౌంటర్ లకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదుల పై నిరసన వ్యక్తం చేసిన పలువురు న్యాయవాదులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల మధ్య వాగ్వాదం.. తమకు పిటీషన్ వేసే హక్కు ఉందన్న పిటీషనర్ తరపు న్యాయవాదులు.

* రాష్ట్రపతి భవన్ వైపు ర్యాలీగా సాగుతున్న దిల్లీ జవహర్​లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్​యూ) విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. పెంచిన హాస్టల్ ఫీజును తగ్గించేందుకు రామ్​నాథ్​ కోవింద్ జోక్యం చేసుకోవాలన్న డిమాండ్​తో రాష్ట్రపతి భవన్​ వైపు బయలుదేరారు విద్యార్థులు. అయితే మార్గమధ్యంలోని భికాజీ కామా ప్లేస్ మెట్రో స్టేషన్​ వద్ద పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. బారికేడ్లు దాటేందుకు యత్నించిన విద్యార్థులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జీ చేశారు.  అంతకుముందు ర్యాలీ సందర్భంగా దిల్లీ పోలీసులు వెనక్కి వెళ్లిపోవాలని, అందరికీ ఉచిత విద్య అందాలన్న విద్యార్థుల నినాదాలతో రాష్ట్రపతి భవన్​కు వెళ్లే మార్గం హోరెత్తిపోయింది.

* ‘దిశ’ హత్యాచారం కేసులో నిందితులైన నలుగురు యువకులను ఎన్‌కౌంటర్ చేయడంపై హైదరాబాద్ నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తోపాటు నలుగురు పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని ‘నేను సైతం’ స్వచ్ఛందసంస్థ అధ్యక్షుడు డి ప్రవీణ్ కుమార్ ఉప్పల్ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో కోరారు. దిశ కేసులో నలుగురు నిందితులను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపిన ఘటనపై సజ్జనార్ తోపాటు మరో నలుగురు పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.కాగా ప్రవీణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై రాచకొండ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు