Business

ఒత్తిడిలో షేర్ మార్కెట్

Indian Share Markets In Deep Distress

అమ్మకాల ఒత్తిడి.. విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, వడ్డీరేట్లపై ఆర్‌బీఐ నిర్ణయాలు తదితర కారణాలతో దేశీయ మార్కెట్లు సోమవారం లాభనష్టాల్లో ఊగిసలాడాయి. ఈ ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 70 పాయింట్ల వరకు కోల్పోయింది. అయితే ఆ తర్వాత కాస్త తేరుకున్నా.. దిగ్గజ షేర్లలో అమ్మకాలు మార్కెట్‌ను ఒత్తిడిలోకి నెట్టేశాయి.

ఇలా రోజంతా తీవ్ర ఒడుదొడుకుల్లో సాగిన సూచీలు చివరకు స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ స్వల్పంగా 42 పాయింట్ల లాభంతో 40,487 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 11,937 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.09గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో యాక్సిస్‌ బ్యాంక్‌, భారత్‌ పెట్రోలియం, అదానీ పోర్ట్స్‌, మారుతి సుజుకీ షేర్లు లాభపడగా.. టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, సిప్లా, ఎల్‌అండ్‌టీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ షేర్లు నష్టపోయాయి.