Fashion

హైలైటర్ వినియోగంలో స్వల్ప మార్పులు చేసుకుంటే…

Some tips while applying highlighter-Telugu Fashiont tips and tricks

మేకప్‌లో భాగంగా చెక్కిళ్లను మెరిపించేందుకు హైలైటర్‌ వాడుతాం. అయితే చెక్కిళ్లతో పాటు కళ్లు, పెదవులు, ముక్కును కూడా హైలైటర్‌తో మరింత అందంగా కనిపించేలా చేయొచ్చు. అదెలాగో చూద్దాం…

పెదవులు: ఐ షాడో బ్రష్‌ మీద కొద్దిగా హైలైటర్‌ అద్దుకొని పై పెదవి అంచు మీద ఒక గీతలా గీసుకోవాలి. దీంతో పెదవులు మెరుస్తూ, సరికొత్తగా కనిపిస్తాయి.
ముక్కు: చిన్న బ్రష్‌తో మ్యాటిఫయింగ్‌ పౌడర్‌, హైలైటర్‌ను ముక్కు వెంబడి రాసుకోవాలి. దీంతో ముక్కు చిన్నగా, అందంగా కనిపిస్తుంది. అయితే పగటి వేళ అయితే ఫేస్‌మేకప్‌లో హైలైటర్‌ పూర్తిగా కలిసిపోయేలా చూసుకోవాలి. దాంతో మేకప్‌ లుక్‌ సహజంగా ఉంటుంది.
ఐ షాడో, ఐ లైనర్‌: మేకప్‌ బ్రష్‌ మీద కొద్దిగా ఫిక్సింగ్‌ స్ర్పే చల్లి, ఆ బ్రష్‌ను పౌడర్‌ హైలైటర్‌లో అద్దితే ఐ లైనర్‌ రెడీ. దీంతో కనుపాపలను అందంగా మలుచుకోవచ్చు. అయితే ఎక్కువ కాకుండా జాగ్రత్తపడాలి.
కళ్లు: కళ్ల లోపలి అంచుల వెంబడి హైలైటర్‌ అప్లై చేస్తే కళ్లు కొత్తగా, కాంతిమంతంగా కనిపిస్తాయి. లేదా వాటర్‌లైన్‌, హైలైటర్‌ పెన్సిల్‌ రెండూ ఉపయోగించినా కళ్ల లుక్‌ మారిపోతుంది.
బాడీ లోషన్‌: కొద్దిగా బాడీ లోషన్‌ తీసుకొని అందులో పొడి రూపంలో ఉన్న హైలైటర్‌ వేసి చక్కగా కలిపితే బాడీ హైలైటర్‌ సిద్ధమవుతుంది. ఇది రాసుకుంటే చర్మం తాజాగా, కాంతిమంతంగా మారుతుంది.