Movies

నేడు రఘువరన్ జయంతి

Today is raghuvaran's birth anniversary-remembering the legendary actor

రఘువరన్ (డిసెంబర్ 11, 1948 – మార్చి 19, 2008) దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. ప్రతినాయక పాత్రలు పోషించి మెప్పించాడు. దాదాపు 150 సినిమాల్లో నటించాడు. ఇందులో తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ చిత్రాలున్నాయి. రఘువరన్ కేరళ రాష్ట్రం, పాలక్కాడ్ జిల్లాకు చెందిన కోలెంగూడె అనే ప్రాంతమునందు జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు వేలాయుధన్ మరియు కస్తూరి. తెలుగు నటి రోహిణితో ఆయనకు వివాహం జరిగింది. వారికి సాయి రిషివరన్ అనే కొడుకు ఉన్నాడు. అయితే వారు తరువాత విడాకులు తీసుకున్నారు.

*** మరణం
చిత్రరంగంలో బాగా విజయవంతమైనా ఆయన మాదకద్రవ్యాలకు, మద్యానికి బానిస కావడంతో జీవితం ఒడిదుడుకులకు గురైంది. రఘువరన్ మార్చి 19, 2008 న చెన్నైలో గాఢ నిద్రలో ఉండగానే గుండెపోటుతో మరణించాడు. దీర్ఘకాలం మద్యం సేవించడం వలన ఆయన కాలేయం కూడా దెబ్బతిన్నది. చనిపోవడానికి కొద్దిరోజులకు ముందు ఆయన నిద్రలో ఉండగా చనిపోయే సన్నివేశంలో నటించడం యాదృచ్ఛికంగా జరిగింది.

*** కెరీర్
శివ, పసివాడి ప్రాణం, బాషా మొదలైన సినిమాలలో ఆయన పాత్రలు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.

*** నటించిన తెలుగు సినిమాలు
శివాజీ (2007) …. Dr. Cheziyan
ఎవడైతే నాకేంటి (2007) …. Bala Gangadhar
మాస్ (2004) …. Satya
జాని (2003)
బాబీ (2002) …. K.R.
రన్ (2002) …. Siva’s brother-in-law
ఆజాద్ (2000) …. Deva/CBI Officer Vishwanath/Harkat Ul Ansari
ప్రియురాలు పిలిచింది (2000) …. Sowmya’s Boss
ఒకే ఒక్కడు (1999)
అనగనగా ఒక అమ్మాయి (1999)
ఆహా (1997)
అనగనగా ఒక రోజు (1997)
అరుణాచలం (1997) …. Viswanath
సుస్వాగతం (1997) …. Dr.Chandrasekhar
రక్షకుడు (1996) …. Raghu/Raghavan
ముత్తు (1995) …. Devaan
బాషా(1995) – Anthony
ప్రేమికుడు (1994) …. Malli
కిల్లర్ (1992)
అంజలి (1990) …. శేఖర్
వ్యూహం (1990) …. Tony Leous
లంకేశ్వరుడు (1989)
రుద్రనేత్రుడు (1989) …. Q
శివ (1989)
కాంచన సీత (1988)
జేబుదొంగ (1987)
పసివాడి ప్రాణం (1987) …. Venu
న్యాయానికి సంకెళ్ళు (1987)
చైతన్య (1986) …. Kalicharan
మిస్టర్ భరత్ (1986) …. Michael