WorldWonders

ముంబయిలో దారుణం-కదిలే కారులో 22 ఏళ్ల యువకుడు గ్యాంగ్‌రేప్

22 Year Old Gang Raped In Mumbai-Telugu WorldWonders-ముంబయిలో దారుణం-కదిలే కారులో 22 ఏళ్ల యువకుడు గ్యాంగ్‌రేప్

ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 22 ఏళ్ల యువకుడు గ్యాంగ్ రేప్ కు గురయ్యాడు. నలుగురు వ్యక్తులు  గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతని అడ్రస్ ట్రేస్ చేసి మరీ అతనున్న చోటుకి వెళ్లారు. మీ ఫ్యాన్స్ అంటూ అతడిని నమ్మించి.. తమతో కాసేపు గడపాలని కోరారు. ఇదంతా నిజమే అనుకుని వెళ్లిన అతనికి ఊహించని షాక్ తగిలింది. బలవంతంగా అతన్ని కారులో ఎక్కించిన ఆ నలుగురు.. అతనిపై గ్యాంగ్‌ రేప్‌కి పాల్పడ్డారు. బాధితుడు ముంబై సెంట్రల్ సబర్బన్‌లోని కుర్లాలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఓ రెస్టారెంట్ దగ్గర సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కొంతకాలంగా అతన్ని ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న నలుగురు వ్యక్తులు ఆ సెల్ఫీ ఫోటోను చూశారు. వెంటనే నలుగురూ కలిసి ఆ రెస్టారెంట్ దగ్గరికి వచ్చి అతన్ని కలుసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మిమ్మల్ని చాలాకాలంగా ఫాలో అవుతున్నామని.. మీకు బిగ్ ఫ్యాన్స్ అని అతన్ని నమ్మించారు. తమతో కాసేపు గడపాలని కోరడంతో అతను సరేనన్నాడు. అలా 20 నిమిషాల పాటు ఐదుగురు రోడ్లపై చక్కర్లు కొట్టారు. ఓ హోటల్‌ దగ్గరికి చేరుకున్నాక.. నలుగురూ కలిసి బలవంతంగా అతన్ని ఓ కారులో ఎక్కించారు. అలా కదులుతున్న కారులో మూడు గంటల పాటు అతనిపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. సోమవారం(డిసెంబర్ 9,2019) ఉదయం రోడ్డు పక్కన అతడిని పడేసి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత తేరుకున్న బాధితుడు నేరుగా ఇంటికెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. తల్లిదండ్రుల సాయంతో కుర్లాలోని వినోబాబావే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనను గ్యాంగ్ రేప్ చేశారని ఆ యువకుడు చెప్పడంతో ముందు పోలీసులు కూడా షాక్ తిన్నారు. ఆ తర్వాత తేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. రేప్ చేయడమే కాదు.. యువకుడి నుంచి రూ.2వేలు నగదు కూడా లాక్కున్నారు. సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు.. కారు, టూవీలర్ నెంబర్ ప్లేట్ల ఆధారంగా నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు మైనర్ కావడంతో వదిలేశారు. మిగిలిన ముగ్గురిపై 377, 392(దొంగతనం) , 323 (లైంగిక దాడి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మెహుల్ పర్మర్(21), ఆసిఫ్ అలీ అన్సారీ(23), పియూష్ చౌహాన్(22) ఉన్నారు. కాగా, నలుగురు ముఠా సభ్యుల గురించి పోలీసులకు కొంత సమాచారం తెలిసింది. ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు చూసి, అందంగా ఉన్న యువకుల్ని గుర్తించి, వారిని ట్రాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడుతున్నారని గుర్తించారు. యువకుడి గ్యాంగ్ రేప్ ఘటన సంచలనంగా మారింది. ఇకపై అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా జాగ్రత్తపడాల్సిన సమయం వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలామంది అబ్బాయిలు తమ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంటారు. వాటికి వచ్చే లైక్ లు, కామెంట్లు చూసుకుని మురిసిపోతుంటారు. అయితే.. ఇకపై కేర్ ఫుల్ గా ఉండాల్సిన సమయం వచ్చిందని పోలీసులు అంటున్నారు. మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.