ScienceAndTech

డేటింగ్ వెబ్‌సైట్ మోసం-65 ఏళ్ల వృద్ధుడు ₹73లక్షలు పోగొట్టుకున్నాడు

65 Year Old Mumbai Grandpa Loses 73Lakhs On Dating Website Fraud-డేటింగ్ వెబ్‌సైట్ మొసంతో 65 ఏళ్ల వృద్ధుడు ₹73లక్షలు పోగొట్టుకున్నాడు

డేటింగ్ సైట్ రిజిస్ట్రేషన్ పేరిట 65 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.73 లక్షలు తీసుకొని మోసగించిన బాగోతం మహారాష్ట్రలోని నవీ ముంబయి నగరంలో వెలుగుచూసింది. స్నేహ అనే యువతి తాము డేటింగ్ కోసం ఎంపిక చేసుకున్న స్థలానికి బాలికలను పంపిస్తామని చెప్పి నవీ ముంబయిలోని ఖర్గార్ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడిని కలిసింది. రిజిస్ట్రేషన్, ఇతర ఖర్చుల పేరిట ఆ వృద్ధుడి నుంచి కొంత డబ్బులు తీసుకొని డేటింగ్ సౌకర్యం కల్పించలేదు. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వృద్ధుడు బెదిరించాడు. దీంతో బాలికలను డేటింగ్ కోసం పంపించాలని డిమాండు చేస్తున్నాడని దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని స్నేహ వృద్ధుడికి లీగల్ నోటీసు పంపించింది. దీంతో భయపడిన వృద్ధుడి నుంచి స్నేహ తన ముఠా సభ్యులతో కలిసి మొత్తం రూ.73 లక్షలను తీసుకుంది. డేటింగ్ పేరిట తాను మోసపోయానని గ్రహించిన వృద్ధుడి ఫిర్యాదు మేర ముంబై పోలీసులు దర్యాప్తు చేయగా, తీగ లాగితే డొంక కదిలినట్లు కోల్‌కతా కేంద్రంగా డేటింగ్ నకిలీ కాల్ సెంటరు బాగోతం బయటపడింది. స్నేహ అలియాస్ మహీదాస్(25), ప్రబీర్ సహా, అర్నబ్ రాయ్(26)లు కలిసి ముఠాగా ఏర్పడి డేటింగ్ పేరిట నవీముంబయి వృద్ధుడితోపాటు పలువురిని మోసగించినట్లు తేలింది. దీంతో నిందితులపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశామని ముంబయి పోలీసు అధికారి ప్రదీప్ తీదర్ చెప్పారు.