DailyDose

వివేకా హత్యపై ముమ్మరంగా సాగుతున్న సిట్ దర్యాప్తు-నేరవార్తలు-12/12

Crime News Roundup Today-Viveka Murder Investigation By SIT-12/12

* వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి సిట్‌ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డిని సిట్‌ అధికారులు ప్రశ్నించారు. కడప పోలీసు శిక్షణ కేంద్రంలో విచారణ చేపట్టారు.

* బతికి ఉండగానే శిశువుని పాతి పెట్టిన ఓ కర్కశ తల్లి. సమాజ పోకడలు రోజు రోజుకు ఎటువైపు వెళ్తున్నాయో.. కొన్ని వార్తలు ప్రచురించడానికి సిగ్గుతో తల దించుకొనే స్థితి.. విశాఖ ఏజెన్సీ,పాడేరు డివిజన్..,మండలం వంతడపల్లి, పంచాయతీ వీసామామిడి, గ్రామంలో నిన్న జరిగిన సంఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేసింది.. గుట్టుచప్పుడు కాకుండా ఓ కసాయి తల్లి పండంటి బిడ్డకు జన్మనివ్వడమే కాకా ఆ బిడ్డను ఓ పొదలవైపు పాతి పెట్టడం జరిగింది.. సాయంత్రం ఓ వ్యక్తి మూత్ర విసర్జనకు అటువైపు వెళ్లగా ఎవరో చిన్న పిల్ల ఏడుపు శబ్దం వినిపించింది ఇది గమనించిన వ్యక్తి అక్కడకు వెళ్ళిచూడగా ఓ శిశువుని పాతి పెట్టినట్టు గమనించాడు ఈ విషయాన్ని స్థానిక ఆశ కార్యకర్తకు మరియు ఊరిలో ఉన్న అందరికి చెప్పి ఆ శిశువుని పాడేరు,ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ శిశువు మృతి చెందినది. చికిత్స చేసిన వైద్యులు స్పందిస్తూ ఆ శిశువుని కాలుతో మెడపైన,గుండెపైన తొక్కి హత్య చేశారని ఇక్కడకు వచ్చిన తర్వాత చికిత్స అందించిన ఫలితం లేకపోయిందని చెప్పారు. ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు జరుగకుండా ప్రతి ఒక్క మహిళ ఉండాలని వైద్యులు, ఆ ఊరు గ్రామస్తులు చెప్పుకొంటున్నారు.

* మిడుతూరు వాలేంటర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అనుచితంగా వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేసిన వాలేంటర్ మిడుతూరు మండలం కేంద్రంలో పనిచేస్తున్న హరిప్రసాద్ అనే వాలేంటర్ పై ఐ.టి యాక్ట్ కేసు నమోదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డ్ పై సోషల్ మీడియాలో అనుచిత మైన పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేసిన పోలీసులు హరిప్రసాద్ అనే వాలేంటర్ ను విచారిస్తున్నా మిడుతురు పోలీసులు

* కొనకమిట్ల మండలం., కొత్తపల్లి గ్రామ సమీపంలో గురువారం ఉదయం అటుగా అతివేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి ఎదురు గావస్తున్న కారును ఢీ కొనడం తో కారులో వున్నా నలుగురు వ్యక్తులు అక్కడికిఅక్కడే దుర్మరణం పాలైనారు.

* దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే తెలిపారు. నియమితులయ్యే విశ్రాంత న్యాయమూర్తి ఢిల్లీలోనే ఉండి ఈ కేసును దర్యాప్తు చేసేలా చూస్తామన్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ అనే ఇద్దరు న్యాయవాదులు గతంలోదాఖలు చేసిన పిల్‌పై సుప్రీం ఈ విచారణ చేపట్టింది. నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని.. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు. కేసులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీతో పాటు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌‌ను ప్రతివాదులుగా చేర్చారు. విచారణ కోసం మాజీ జస్టిస్‌ పి.వి.రెడ్డిని సంప్రదించామని కానీ.. అందుకు ఆయన నిరాకరించారని చీఫ్ జస్టిస్ తెలిపారు. విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు జరిపే అంశంపై ఏమనుకుంటున్నారో సలహాలు, సూచనలతో రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై పూర్తి అవగాహనతో ఉన్నామని … జరుగుతున్న అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చీఫ్ జస్టిస్ ప్రకటించారు. మరో వైపు తెలంగాణలో పర్యటించిన మానవ హక్కుల కమిషన్…, తాము సేకరించిన వివరాలన్నింటినీ… సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఎన్‌కౌంటర్‌కు గురైన నలుగురిలో ముగ్గురు మైనర్లన్న ప్రచారం జరుగుతోంది. దాంతో.. ఈ కేసు మరింత తీవ్ర తరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్‌కౌంటర్ విషయంలో ప్రజామోదం లభించినప్పటికీ..చట్టపరమైన ఆమోదం మాత్రం అంత తేలిగ్గా లభించే అవకాశం కనిపించడం లేదు

* మద్యం వల్ల శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా సంకల్పదీక్షను ప్రారంభించిన అనంతరం లక్ష్మణ్‌ మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఆదాయ వనరుగా మార్చిందన్నారు. మద్యం ద్వారానే ప్రభుత్వానికి రూ.20వేల కోట్ల ఆదాయం వస్తోందన్నారు. సామాజిక బాధ్యతగా సీఎం కేసీఆర్‌ మద్యాన్ని అరికట్టాలన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారన్నారు. ప్రతి అంశంపై ట్విట్టర్‌లో స్పందించే కేటీఆర్‌… అత్యాచారాలపై ఎందుకు స్పందించట్లేదు? అని ప్రశ్నించారు.

* ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 22 ఏళ్ల యువకుడు గ్యాంగ్ రేప్ కు గురయ్యాడు. నలుగురు వ్యక్తులు  గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతని అడ్రస్ ట్రేస్ చేసి మరీ అతనున్న చోటుకి వెళ్లారు. మీ ఫ్యాన్స్ అంటూ అతడిని నమ్మించి.. తమతో కాసేపు గడపాలని కోరారు. ఇదంతా నిజమే అనుకుని వెళ్లిన అతనికి ఊహించని షాక్ తగిలింది. బలవంతంగా అతన్ని కారులో ఎక్కించిన ఆ నలుగురు.. అతనిపై గ్యాంగ్‌ రేప్‌కి పాల్పడ్డారు. బాధితుడు ముంబై సెంట్రల్ సబర్బన్‌లోని కుర్లాలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఓ రెస్టారెంట్ దగ్గర సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కొంతకాలంగా అతన్ని ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న నలుగురు వ్యక్తులు ఆ సెల్ఫీ ఫోటోను చూశారు. వెంటనే నలుగురూ కలిసి ఆ రెస్టారెంట్ దగ్గరికి వచ్చి అతన్ని కలుసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మిమ్మల్ని చాలాకాలంగా ఫాలో అవుతున్నామని.. మీకు బిగ్ ఫ్యాన్స్ అని అతన్ని నమ్మించారు. తమతో కాసేపు గడపాలని కోరడంతో అతను సరేనన్నాడు. అలా 20 నిమిషాల పాటు ఐదుగురు రోడ్లపై చక్కర్లు కొట్టారు. ఓ హోటల్‌ దగ్గరికి చేరుకున్నాక.. నలుగురూ కలిసి బలవంతంగా అతన్ని ఓ కారులో ఎక్కించారు. అలా కదులుతున్న కారులో మూడు గంటల పాటు అతనిపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. సోమవారం(డిసెంబర్ 9,2019) ఉదయం రోడ్డు పక్కన అతడిని పడేసి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత తేరుకున్న బాధితుడు నేరుగా ఇంటికెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. తల్లిదండ్రుల సాయంతో కుర్లాలోని వినోబాబావే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనను గ్యాంగ్ రేప్ చేశారని ఆ యువకుడు చెప్పడంతో ముందు పోలీసులు కూడా షాక్ తిన్నారు. ఆ తర్వాత తేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. రేప్ చేయడమే కాదు.. యువకుడి నుంచి రూ.2వేలు నగదు కూడా లాక్కున్నారు. సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు.. కారు, టూవీలర్ నెంబర్ ప్లేట్ల ఆధారంగా నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు మైనర్ కావడంతో వదిలేశారు. మిగిలిన ముగ్గురిపై 377, 392(దొంగతనం) , 323 (లైంగిక దాడి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మెహుల్ పర్మర్(21), ఆసిఫ్ అలీ అన్సారీ(23), పియూష్ చౌహాన్(22) ఉన్నారు.  కాగా, నలుగురు ముఠా సభ్యుల గురించి పోలీసులకు కొంత సమాచారం తెలిసింది. ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు చూసి, అందంగా ఉన్న యువకుల్ని గుర్తించి, వారిని ట్రాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడుతున్నారని గుర్తించారు. యువకుడి గ్యాంగ్ రేప్ ఘటన సంచలనంగా మారింది. ఇకపై అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా జాగ్రత్తపడాల్సిన సమయం వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలామంది అబ్బాయిలు తమ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంటారు. వాటికి వచ్చే లైక్ లు, కామెంట్లు చూసుకుని మురిసిపోతుంటారు. అయితే.. ఇకపై కేర్ ఫుల్ గా ఉండాల్సిన సమయం వచ్చిందని పోలీసులు అంటున్నారు. మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు

* మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్‌ అధికారుల విచారణ కొనసాగుతోంది. మాజీ మంత్రి, భాజపా నాయకుడు ఆదినారాయణరెడ్డిని అధికారులు దాదాపు గంటపాటు ఇవాళ విచారించారు. ఆయనతో పాటు వైఎస్‌ వివేకానందరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. సిట్‌ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. ఈ కేసులో తన ప్రమేయం లేదని అన్నారు. ‘ హత్య కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో 30 ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ సవివరంగా సమాధానమిచ్చా. ఈ కేసులో నా తప్పు ఉంటే బహిరంగంగా ఉరితీయాలని చెప్పా. వివేకాను ఎవరు హత్య చేశారో అందిరి మనస్సాక్షికి తెలుసని చెప్పా. కావాలనే అందర్నీ ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలి. అప్పుడే నిజాలు వెల్లడవుతాయి’ అని ఆదినారాయణరెడ్డి చెప్పారు

* డేటింగ్ సైట్ రిజిస్ట్రేషన్ పేరిట 65 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.73 లక్షలు తీసుకొని మోసగించిన బాగోతం మహారాష్ట్రలోని నవీ ముంబయి నగరంలో వెలుగుచూసింది. స్నేహ అనే యువతి తాము డేటింగ్ కోసం ఎంపిక చేసుకున్న స్థలానికి బాలికలను పంపిస్తామని చెప్పి నవీ ముంబయిలోని ఖర్గార్ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడిని కలిసింది. రిజిస్ట్రేషన్, ఇతర ఖర్చుల పేరిట ఆ వృద్ధుడి నుంచి కొంత డబ్బులు తీసుకొని డేటింగ్ సౌకర్యం కల్పించలేదు. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వృద్ధుడు బెదిరించాడు. దీంతో బాలికలను డేటింగ్ కోసం పంపించాలని డిమాండు చేస్తున్నాడని దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని స్నేహ వృద్ధుడికి లీగల్ నోటీసు పంపించింది. దీంతో భయపడిన వృద్ధుడి నుంచి స్నేహ తన ముఠా సభ్యులతో కలిసి మొత్తం రూ.73 లక్షలను తీసుకుంది.

* పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భర్తను భార్య హత్య చేసింది. భర్త సత్యశర్మ ను గొంతు నులిమి చంపిన భార్య హేమ నాగమణి. భర్త వేధింపులు తాళలేక భర్తను హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. హేమ నాగమణి కాళ్ళకూరు లో నర్స్ గా పనిచేస్తుంది. భర్త సత్య శర్మ ఇంటిదగ్గర ఖాళీగా ఉంటాడు. భార్యపై అనుమానంతో వేధిస్తుంటాడు. ఈ సందర్భంగా భార్య భర్తల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. భర్త వేధింపులు తట్టుకోలేక సత్య శర్మ గొంతు నులిమి చంపింది నాగమణి. ఈ మధ్యనే భీమవరంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. భర్త చనిపోయాడు అని తెలిసిన తర్వాత పోలీసుల కు సమాచారం ఇచ్చింది నాగమణి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్షను అమలు చేసేందుకు ఎట్టకేలకు తలారి దొరికాడు. తీహార్ జైలులో తలారి లేకపోవడంతో ఉరి తీయడానికి ఏర్పాట్లు చేసేందుకు తలారిని పంపాలని జైలు అధికారులు ఉత్తర ప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టరు జనరల్ ను కోరారు. దీంతో మీరట్ జైలులో తలారీగా పనిచేస్తున్న పవన్ కుమార్ అనే వ్యక్తిని తీహార్ జైలుకు తాత్కాలికంగా బదలీ చేశారు. గతంలో సీరియల్ కిల్లర్ సురేందర్ కోలీని ఉరి తీసింది పవన్ కుమారే. ప్రొఫెషనల్ తలారిగా గుర్తింపు పొందాడు. ఏ మాత్రం నొప్పి తెలియకుండా దోషిని ఉరితీయడం, ఒక్క క్షణంలోపే ప్రాణం పోయేలా జాగ్రత్తలు తీసుకోవడంలో పవన్ అనుభవశాలి.

* తరచూ ఫోన్‌ మాట్లాడుతున్న భార్యను భర్త మందలించినందుకు అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ వరుణ్‌కాంత్‌రెడ్డి వివరాల ప్రకారం బౌద్ధనగర్‌ అంబర్‌నగర్‌కు చెందిన దొంతుల అనురాధ(40) గృహిణి, తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటంతో భర్త మనోహర్‌ వద్దని పలుమార్లు సర్ధిచెప్పాడు. దీంతో భార్యభర్తలిద్దరూ మధ్య చిన్న, చిన్న గోడవలు జరిగేవి. ఈనెల 10వ తేదీ మధ్యాహ్నాం ఫోన్‌లో మాట్లాడుతుండటంతో భర్త, భార్యపై కొప్పాడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన అనురాధ ఇంట్లో ఫొన్‌ వదిలి వెళ్లిపొయింది. అనురాధ కోసం పలుచోట్ల గాలించిన ఫలితం లేదు. తన భార్య అనురాధ కనిపించటం లేదని భర్త మనోహర్‌ బుధవారం చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు