Sports

అదే కథ-సింధు ఓడిపోయింది

PV SIndhu Loses To Chinese Shuttler In First Round Of BWF Championship

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో పీవీ సింధుకు మరో షాక్ తగిలింది. మహిళల సింగిల్స్ గ్రూప్-ఏలో గురువారం జరిగిన చైనా షట్లర్ చెన్‌‌ యూఫైతో జరిగిన మ్యాచ్‌లో సింధు 20-22, 21-16, 21-12 తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో సింధు ఆరంభం నుంచి ఊహించినంతగా రాణించలేదు. తొలి సెట్‌లో ప్రత్యర్థికి గట్టిపోటీ ఇచ్చిన సింధు ఈ సెట్‌లో 22-20 పాయింట్లతో విజయం సాధించింది. కానీ, ఆ తర్వాతి సెట్‌లలో ప్రత్యర్థి ఏ మాత్రం గట్టిగా పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో చెన్ మ్యాచ్‌లో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ తర్వాతి రెండు సెట్లను చెన్ 21-16, 21-12 పాయింట్లతో దక్కించుకొని ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి సింధుకి వరుసగా రెండో ఓటమిని అందించింది. ఈ ఓటమితో సింధు దాదాపు టోర్నమెంట్‌ నుంచి నిష్ర్కమించే పరిస్థితి ఏర్పడింది. సింధుకు తొలి ఓటమిని అందించిన అకానె యమగూచి (జపాన్‌) చైనాకు చెందిన షట్లర్ హే బింగ్‌జ్యోతో జరిగే మ్యాచ్‌లో ఓటమిపాలైతేనే.. సింధు టోర్నమెంట్‌లో కొనసాగే అవకాశం ఉంది.