DailyDose

ఆంధ్రుల రాజధాని అమరావతే-నేటి అసెంబ్లీ వార్తలు-12/13

Andhra Assembly News Roundup-Amaravati Is Capital Says Botsa-12/13

* ఏపీ రాజధాని మార్పుపై అనేక పుకార్లు షికారు చేశాయి. అయితే ప్రభుత్వం ఈ ఉహాగానాలకు చెక్ పెట్టింది. రాజధాని మార్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ అనేక సార్లు గందరగోళానికి గురి చేశారు. అయితే ఆయనే ఇప్పుడు రాజధానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతిని మార్చడం లేదంటూ లిఖితపూర్వకంగా బొత్స సమాధానం ఇచ్చారు. రాజధాని మార్చే ఉద్దేశం ఉందా? అని టీడీపీ ఎమ్మెల్సీ అన్న ప్రశ్నకు అలాంటి ఉద్దేశం లేదని మండలిలో ఆయన స్పష్టం చేశారు.   ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేసిన ‘సర్వే ఆఫ్‌ ఇండియా’ సంస్థ తన తప్పు దిద్దుకుంది. అమరావతిని గుర్తిస్తూ కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. ఇటీవల సర్వే ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన దేశ పటంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉంది కానీ, రాజధానిని గుర్తించలేదు. ఇది వివాదాస్పదంగా మారింది. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి సవరించిన మ్యాప్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నవంబర్ 22న దేశ పటంలో అమరావతిని చేర్చుతూ సర్వే ఆఫ్‌ ఇండియా కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది.   మరోవైపు రాజధానిపై ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీకి విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వం వహించారు. ఈ కమిటీ ప్రజల నుంచి పలు సూచనలు తీసుకుంది. నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

* అసెంబ్లీ ఆవరణలో మార్షల్స్‌పై టీడీపీ సభ్యులు దౌర్జన్యానికి దిగడాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తప్పుబట్టారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా ప్రవర్తించారన్నదానికి ఈ ఘటన నిదర్శమని తెలిపారు.  ప్రతిపక్ష నేత వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నించారు. టీడీపీ సభ్యుల దౌర్జన్యానికి సంబంధించిన వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాను సభలోకి ప్రవేశించాల్సిన గేటు అసలు అది కాదు. ఆయన గేటు నెంబర్‌ 2 నుంచి సభలోకి రావాల్సి ఉంది. కానీ అందరితో కలిసి ఆందోళన చేయాలని చంద్రబాబు చూశారు.  ప్రోటోకాల్‌ ప్రకారం సభ్యులను మాత్రమే లోనికి పంపేందుకు మార్షల్స్‌  ప్రయత్నించడం. కానీ చంద్రబాబు నాయుడు మార్షల్స్‌ను బాస్టడ్‌ అని దూషించడం దారుణం. లోకేశ్‌ చీఫ్‌ మార్షల్స్‌ను యూజ్‌లెస్‌ అంటూ తిట్టారు. ఉద్యోగుస్తులను అనరాని మాటలు అన్నార’ని తెలిపారు.

* గిల్లటం జోలపాడడం… ఈ తత్వాన్ని చంద్రబాబు గారు మానుకోవాలి-MLA అంబటి రాంబాబు.

* పక్క రాష్ట్రంలో ఇన్సిడెంట్ జరిగితే మన రాష్ట్రంలో చట్టం చేశారు మన ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి. ఇలా చేసే దమ్ము ఎవరికైనా ఉందా?- మంత్రి కురసాల కన్నబాబు

* ‘దిశ’ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. బిల్లుకు సంబంధించిన పూర్వాపరాలను సీఎం జగన్ అసెంబ్లీలో వివరించారు.

* ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేయాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ వద్ద టీడీపీ ధర్నా చేపట్టింది. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. రోజూ ఏదో ఒక సమస్యపై టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ నరేగా పథకానికి టీడీపీ హయాంలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అన్నివిధాల అభివృద్ది జరిగిందన్నారు. కేంద్రం నిధులు విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వం వాటాకు సంబంధించిన ఉపాధి హామీ పథకం నిధులను పక్కదోవ పట్టిస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. రూ. 2500 కోట్ల ఉపాధిహామీ నిధులను కేంద్రం మూడు జీవోలద్వారా విడుదల చేసిందని టీడీపీ నేతలు తెలిపారు. ఆ నిధులను దారి మళ్లించి నవరత్న పథపకాలకు జగన్ ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. వెంటనే ఆ నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫైర్ స్టేషన్ వద్ద నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. అలాగే ఉపాధి హామీ పథకం నిధులు దారి మళ్లింపు అంశంపై సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతామని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

* ప్రివిలేజ్ మోషన్ కాపీని స్పీకర్ కు ఇచ్చిన తెదేపా సభ్యులు.

* చంద్రబాబు నాయుడుకి సుదీర్ఘమైన 40 ఏళ్ల అనుభవం ఉందని వాళ్ల పార్టీ ప్రచారం చేస్తోందని కన్నబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఉద్యోగులను బాస్టర్డ్ అని తిట్టడం వీడియోలోనే కనిపిస్తోందని.. సాధారణ ఉద్యోగుల మీద అనుచిత భాషను చంద్రబాబు వాడారు. ఉద్యోగులు అంటే ఎంత చులకన భావన ఉందో.. ఉద్యోగులకు ఎంత గౌరవం ఇస్తారనటానికి ఇదే సాక్ష్యమని కన్నబాబు మండిపడ్డారు. మాజీ సీఎం చంద్రబాబు బాస్టర్డ్‌ అన్నారా? లేదా? వాళ్ల తనయుడు లోకేశ్‌ ఉద్యోగులను యూజ్‌లెస్‌ ఫెలోస్‌ అని తిట్టారా? లేదా? అసలు ఆ గేటులోంచి చంద్రబాబు ఎందుకు రావాల్సి అవసరం ఏముంది? శాసనసభలోకి రావటానికి చంద్రబాబుకు ప్రత్యేకమైన గేటు ఉంది. ఆ గేటులో నుంచి ఎందుకు రాలేదని మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. ఒకవేళ సెక్యూరిటీ వాళ్లు నియంత్రిస్తే ఉదయం 9.15గంటలకు సభలోకి ఎలా వచ్చారని కన్నబాబు ప్రవ్నించారు. అంటే ఉద్దేశపూర్వకంగా కావాలని రెచ్చగొట్టడానికి ప్రతిపక్షనేత ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోందని కన్నబాబు అన్నారు. ఒక సీనియర్ నాయకుడుగా కొడుకు లోకేశ్‌కు నేర్పించేది ఇదా అని కన్నబాబు ప్రశ్నించారు. ఈ పద్ధతా నేర్పించడం ఏంటని.. దగ్గరుండి మార్షల్స్‌ను ఎలా కొట్టాలి… గేట్‌ను ఎలా తోయాలి… ఎవరిని ఎలా తిట్టాలి అనే భాష నేర్పిస్తారా అని కన్నబాబు ప్రశ్నలు సంధించారు. సభలో లేని సభ్యులు గురించి ఎందుకు మాట్లాడారు అని టీడీపీ సభ్యులు అంటున్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి గురించి ఎన్నిసార్లు, ఎన్నిరకాలుగా మాట్లాడారని కన్నబాబు గుర్తు చేశారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని కన్నబాబు సూచించారు. ఈ రాష్ట్రంలో ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీశారు. దీనిపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు క్షమాపణ చెబితే గౌరవం ఉంటుందన్నారు. మాలాంటి జూనియర్‌ సభ్యులు వాడితే పర్వాలేదు. 40 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే నుంచి వివిధ హోదాల్లో చంద్రబాబు పనిచేశారు. మూడు సార్లు సీఎంగా పనిచేశారు. గత శాసనసభలో సస్పెన్ష్‌ చేసి బయటకు తోసేశారు. రోజాగారు, చెవిరెడ్డి భాస్కరెడ్డి ఏం జరిగిందో చెప్పారని కన్నబాబు అన్నారు. ఆనాడు ప్రతిపక్షనేతైన వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి మైక్‌ ఇవ్వకుండా ఎన్నో రకాలుగా అవమానాలపాలు చేశారో ఆరోజు రాష్ట్రమంతా చూసింది కాబట్టే ఈరకమైన తీర్పు వచ్చిందన్నారు. సభా గౌరవాన్ని, సభ్యుల గౌరవన్నా నిలబెట్టే విధంగా వ్యవహరించాలన్నారు. బాస్టర్డ్స్‌ అని ఉద్యోగులను తిట్టడం వారి మనోభావాలను దెబ్బతీస్తోందని కన్నబాబు అన్నారు. ఉద్యోగులను చాలా చులకనగా ప్రతిపక్షనేత మాట్లాడారని ఆవేదనను వారు బయటకు చెప్పుకోలేరన్నిరు. చిన్నచిన్న ఉద్యోగులు.. కచ్చితంగా చంద్రబాబు క్షమాపణ చెప్పాలని కన్నబాబు కోరారు. క్షమాపణ చెప్పటం చంద్రబాబు గౌరవాన్ని పెంచుతుంది అనేది అర్థం చేసుకోవాలని కన్నబాబు సూచించారు. ఎక్కడబడితే అక్కడ ఏదిపడితే అది మాట్లాడితే కుదరదు అనేది వాళ్లు అర్థం చేసుకోవాలని కన్నబాబు అన్నారు. శాసనసభ ఆవరణలో ఒక నియమావళి ఉంటుంది. గతంలో వాళ్ల స్పీకర్‌లు ఇచ్చిన డైరెక్షన్స్‌ కూడా ఉన్నాయి. వాటిని అమలుచేసే విధంగా శిక్షణాతరగతులు చంద్రబాబు నిర్వహిస్తారు. కాబట్టి ఉన్న కొద్ది మంది శాసనసభ్యులకు శిక్షణ పెట్టుకుంటే మంచిదని సలహా ఇస్తున్నానని కన్నబాబు అన్నారు. దయచేసి చంద్రబాబు క్షమాపణలు చెప్పేలా స్పీకర్‌ ఆదేశాలు ఇవ్వాలని కన్నబాబు కోరారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. లోకేశ్‌ గారి గురించి ఇక్కడెందుకు మాట్లాడుతున్నారని టీడీపీ సభ్యులు అనటంపై కన్నబాబు స్పందిస్తూ.. ఇక్కడ మాట్లాడాలని నాకు సరదా కాదు. ఇప్పుడు వేసిన సినిమాలో లోకేశ్‌ కూడా ఉన్నారు. ఒక మార్షల్‌ పీక పట్టుకొని నెట్టేస్తున్నారు. యూజ్‌లెస్‌ ఫెలోస్ అని లోకేశ్‌ తిట్టారు. తర్వాత చంద్రబాబు బాస్టర్డ్‌ అని తిట్టారు. ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు స్పీకర్‌ ఇవ్వాలని కురసాల కన్నబాబు కోరారు. ఓడిపోయిప్పుడు ఫ్రస్టేషన్‌ ఉంటుంది ఎవ్వరూ కాదనరు. 2050 దాకా తరతరాలుగా సీఎం ఉంటారని పబ్లిక్‌ మీటింగ్‌, పార్టీ మీటింగ్‌లలో మాట్లాడినట్లు ఉన్నారు. దయచేసి అన్నమాటలను విత్‌డ్రా చేసుకొని క్షమాపణలు చెప్తే అయిపోతుంది అని కన్నబాబు అన్నరు. బాస్టర్డ్‌ అనే ఆంగ్ల పదానికి తెలుగు అర్థం తీయించండని స్పీకర్‌ను కన్నబాబు కోరారు. బాస్టర్డ్‌ అనే మాట వాడటం ఏంటి? అర్థం అయినా తెప్పించి ప్రతిపక్ష నాయకులకు ఇవ్వండన్నారు. గత ఐదురోజుల నుంచి ఫ్రస్టేషన్‌లో టీడీపీ సభ్యులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు.

* దిశ చట్టం మహిళలకు ఒక ‘శ్రీరామ రక్ష’ ఇందుకు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు మంత్రి శ్రీమతి తానేటి వనిత మహిళల భద్రత కోసం రూపొందించిన దిశ చట్టంపై సభలో చర్చ: సభలో మంత్రి శ్రీమతి తానేటి వనిత ప్రసంగం: శాసనసభ: – మహిళల భద్రత కోసం కొత్త చట్టం తీసుకువచ్చిన గౌరవ ముఖ్యమంత్రికి మొత్తం మహిళల తరపున ధన్యవాదాలు – రాష్ట్రంలోనూ, దేశంలోనూ మహిళలపై రోజూ అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ చాలా వరకు బయటకు రావడం లేదు – మహిళల పక్షాన ఎంతో మానవత్వంతో ఆలోచించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ఈ చట్టం చేశారు – మహిళలను దేవతలుగా భావించే ఈ గడ్డపై నిత్యం ఎన్నో దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి భయం కలిగిస్తోంది – విశాఖ జిల్లా మాడుగుల మండలం వాకపల్లిలో శ్రీదేవి అనే గిరిజన మహిళపై అత్యాచారం జరిగింది

*