Movies

పట్టు చీరల మధ్య పెళ్లి పుకార్లు

Kajal Speaks Of Her Wedding In Vijayawada

విజయవాడ అంటే తనకు చాలా ఇష్టమని నటి కాజల్‌ అగర్వాల్‌ అన్నారు. ఇక్కడి ప్రజలు నటిగా తననెంతో అభిమానిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని కాజల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత, సినీ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. పట్టు చీరలంటే చాలా ఇష్టమని చెప్పారు. తన పెళ్లిపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని, త్వరలోనే క్లారిటీ ఇస్తానని చెప్పారు. నటుడు కమల్‌ హాసన్‌తో కలిసి బహుభాషా చిత్రం ఇండియన్‌-2లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నానన్నారు. మరోవైపు ఒక వెబ్‌ సిరీస్‌లో కూడా నటిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఇతర భాషల్లో పలు సినిమాలతో బిజీగా ఉన్నట్లు కాజల్‌ తెలిపారు.