Business

భారతదేశంలో పతాక స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం

Retail Inflation In India Is All Time High-Telugu Business News

ఆహార పదార్థాల ధరలు ఆకాశన్నంటుతుండటంతో నవంబరు నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబరులో 5.54శాతంగా నమోదైంది. అక్టోబరులో ఇది 4.62గా ఉండగా గత ఏడాది ఇదే నెలలో 2.33శాతంగా ఉంది. మరోవైపు అక్టోబరులో పారిశ్రామిక ఉత్పత్తి 3.8శాతం పడిపోయింది. మైనింగ్‌, తయారీరంగాల్లో ఆశించిన మేర వృద్ధి లేకపోవడంతో పారిశ్రామిక ఉత్పత్తి క్షీణించింది. కేంద్ర గణాంక కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 10.01శాతంగా నమోదైంది. అక్టోబరులో ఇది 7.89శాతంగా ఉండగా గత ఏడాది ఇదే నెలలో (-)2.61శాతంగా ఉంది. ఆర్‌బీఐ నిర్దేశించుకున్న 4శాతం ద్రవ్యోల్బణ లక్ష్యం స్థాయిని ఇది అధిగమించింది.