DailyDose

LG మాజీ చైర్మన్ మృతి-వాణిజ్యం-12/14

LG Ex Chairman Passed Away-Telugu Business News Roundup-12/14

* దక్షిణ కోరియాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఎల్జీ గ్రూప్‌ మాజీ చైర్మన్‌ కూ చా క్యుంగ్‌ (94)మరణించారు. కూ చా క్యుంగ్‌ శనివారం ఉదయం 10గంటలకు మరణించారని ఎల్జీ ప్రకటించింది.1925లో కూ చా క్యుంగ్‌ జన్మించారు. ఎల్జీ వ్యవస్థాపకుడు, కూ చా క్యుంగ్‌ తండ్రి కూ ఇన్‌ హ్వోమ్‌ నుంచి వారసత్వంగా ఎల్జీ సంస్థ బాధ్యతలు తీసుకున్నారు. ఎల్జీ గ్రూప్‌కు 25సంవత్సరాలు కూ తన సేవలను అందించాడు. కూ రిటైర్‌మెంట్‌ తర్వాత పెద్ద కుమారుడు మిస్టర్ కూ బాన్ మూ సంస్థకు చైర్మన్‌గా వ్యవహరించారు. విశిష్ట సేవలను అందించిన కూ బాన్ మూ గత మే నెలలో మరణించారు. ప్రస్తుతం ఎల్జీ గ్రూప్‌ చైర్మన్‌గా మిస్టర్ కూ క్వాంగ్ మో వ్యవహరిస్తున్నారు. కూ చా క్యుంగ్‌ రిటైర్‌మెంట్‌ తర్వాత గ్రామీణ వాతావరణంలో గడిపారు. పుట్టగొడుగుల పై కూ పరిశోధన చేశారు.

* డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎమ్‌ మరోసారి నిధులు సమీకరించింది. పేటీఎమ్‌ మాతృసంస్థ, వన్‌97 కమ్యూనికేషన్స్‌ రూ.4,724 కోట్లు(66 కోట్ల డాలర్లు) సమీకరించిందని, చైనా అన్‌లైన్‌ దిగ్గజం అలీబాబాకు చెందిన అలీపేతో పాటు టి రొవె ప్రైస్‌ నిర్వహణలోని ఫండ్స్, సాఫ్ట్‌ బ్యాంక్‌కు చెందిన ఎస్‌వీఎఫ్‌ పాంథర్‌(కేమ్యాన్‌) ఈ పెట్టుబడులు పెట్టాయని తెలిసింది. ఈ వివరాలను బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫార్మ్‌ టోఫ్లర్‌ పేర్కొంది. అయితే, ఈ అంశంపై పేటీఎమ్‌ స్పందించలేదు.

* యువత కలలు సాకారం చేసుకునే దిశగా వెళ్తే గొప్ప విజయాలు సాధిస్తారని దిగ్గర సంస్థ టెక్‌ మహేంద్ర సీఈవో సీపీ గుర్నానీ అన్నారు. ఆంధ్రా విశ్వ కళా పరిషత్‌ను సందర్శించిన ఆయన ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలోని సీఎమ్‌ఎస్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంజినీరింగ్‌లో చేర్చే ముందు కళాశాలలో విద్యానాణ్యతను పరిగణలోకి తీసుకోవలన్నారు.

* దేశంలో అత్యధికంగా ఉపయోగించే 21 రకాల ముఖ్యమైన ఔషధాల ధరలు త్వరలో పెరగనున్నాయి. మందుల ధరలను నియంత్రించే నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అధారిటీ (ఎన్‌పీపీఏ), ఈ మందుల ధరలను 50 శాతం వరకు పెంచటానికి అనుమతినిచ్చింది. ధరలు పెరగనున్న ఔషధాలలో యాంటీబయోటిక్స్, ఎలర్జీ నివారణ మందులు, మలేరియా నివారణమందులు, బిసీజీ వాక్సిన్‌, విటమిన్‌ సి వంటివి ఉన్నాయి.