Devotional

తంజావూరు కళ్యాణ శివుడి ఆలయం తెలుసా?

Thanjavur Kalyana Sundara Siva Temple Makes Your Wedding Immediate

తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాలోని కుట్టాలమ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో కావేరీ నదీ తీరాన పార్వతీ పరమేశ్వరుల ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రత్యేక ఏంటంటే, పార్వతీ దేవి చేయిపట్టుకుని పరమేశ్వరుడు పాణిగ్రహణం చేస్తున్నట్లు విగ్రహం ఉంటుంది. ఈ ఆలయాన్ని ఆదిదంపతులకు వివాహం జరిగిన పవిత్ర స్థలంగా భక్తులు భావిస్తారు. ఇక్కడున్న పరమేశ్వరుడు కళ్యాణసుందరమూర్తిగా పార్వతీదేవి కోకిలాంబాళ్‌గా ప్రసిద్ధికెక్కారు. ఈ మూర్తులను మొక్కి కోరికలు కోరిన వారికి వెంటనే పెళ్ళిళ్ళు అయిపోతాయని నమ్మకం. పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతుంటే, యువతీయువకులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు. ఆదిదంపతులను పుష్పమాలలతో అలంకరించి పూజిస్తే వెంటనే పెళ్ళిళ్లు జరుగుతాయని నమ్ముతారు. ఈ ఆలయంలో మరోప్రత్యేకత కూడా ఉంది. నవగ్రహాలలో ఒకరైన రాహువు లింగరూపంలో ఉంటుంది. రాహువు పీడితులుగా ఉన్నవారు ఇక్కడకు వచ్చి పూజలు చేస్తుంటారు.