DailyDose

ముషారఫ్‌కు మరణశిక్ష-నేరవార్తలు-12/17

Musharraf Given Death Penalty-Telugu Crime News-12/17

* పాకిస్థాన్‌లో పెషావర్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. పర్వేజ్‌ ముషారఫ్‌కు మరణశిక్ష విధించింది. ముషారఫ్‌ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే రాజ్యాంగాన్నికి వ్యతిరేంగా 2007నవంబర్‌3న దేశంలో ఎమర్జెనీ విధించినందుకు ఆయనపై 2013లో దేశద్రోహం కేసు నమోదైంది. దేశ ద్రోహం కేసులో ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ముషారఫ్‌ విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. మూడేళ్ల క్రితం పాకిస్థాన్ వదిలి దుబాయ్ వెళ్లిన ముషారఫ్ ప్రస్తుతం అక్కడే తల దాచుకున్నారు. అయితే ఆయన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. రెండు దశాబ్దాల క్రితం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న ముషారఫ్ సైనిక పాలన ద్వారా అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారు.

* నారాయణపేట జిల్లా మద్దూరు మండలానికి చెందిన ముగ్గురు వి ఆర్ ఓ లను, విధుల నుంచి తప్పించిన కలెక్టర్ వెంకట్రావు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించారన్న అభియోగంపై చర్య.

* బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావుపై ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. డబ్బుల కోసం ఓ కాంట్రాక్టర్‌ను బెదిరించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.హైదరాబాద్‌లోని మధురానగర్‌ కాలనీలోని ఓ స్థలానికి సంబంధించిన కేసులో అచ్యుతరావు కలగజేసుకొని కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విత్ డ్రా చేసుకోవాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

* గత నెలలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతానికి కారణమైనటువంటి నలుగురు నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయారు. అయితే అదే రోజు రాత్రి ఆ నలుగురి మృతదేహాలను ఖననం చేయాలని భావించినప్పటికీ కూడా కొన్ని కారణాలవలన అది వీలుపడలేదు. కాగా హై కోర్టు ఆదేశాల మేరకు మృతదేహాలను మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీకి భద్రపరిచారు. అయితే ఆ తరువాత వాటిని హైదరాబాద్ లోని గాంధీ మార్చురీకి తరలించారు. నిజానికి ఆ మృతదేహాలను ఈనెల 13 వరకే భద్రపరచాలి అని అనుకున్నప్పటికీ, ప్రస్తుతానికి ఆ కేసు విషయమై సుప్రీం కోర్టు విచారణ జరుగుతుంది. అయితే వాటిని భద్రపరచడానికి మరికొంత సమయం కావాలని ఆదేశాలు వచ్చాయి.

* పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న ప్రజల హక్కులను పరిరక్షించడంతోపాటు గౌరవించాలని భారత ప్రభుత్వానికి అమెరికా పిలుపు ఇచ్చింది. న్యూఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల దమనకాండ దరిమిలా దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలకు మద్దతు ఇస్తూ అమెరికా విదేశాంగ ప్రతినిధి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శాంతియుతంగా నిరసనలు తెలియచేసే ప్రజల హక్కును పరిరక్షించడంతోపాటు గౌరవించాలని ఆయన కోరారు. నిరసనకారులు కూడా హింసాకాండకు పాల్పడకూడదని ఆయన పిలుపునిచ్చారు.

* జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులకు, ఢిల్లీ పోలీసులకు ఆదివారం రాత్రి జరిగిన హింసాత్మక ఘర్షణలకు సంబంధించి నేర చరిత్రగల 10 మంది వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇప్పటివరకు విద్యార్థులెవరినీ అరెస్టు చేయలలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. అరెస్టు అయిన 10 మంది యూనివర్సిటీకి సమీపంలోని జామియా, ఓక్లా ప్రాంతాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఆదివారం జరిగిన హింసాకాండపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తుందని ఢిల్లీ పోలీసులు ఇదివరకే ప్రకటించినప్పటికీ పోలీసుల దమనకాండపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరపాలని జామియా వైస్ చాన్సలర్ నజ్మా అక్తర్ డిమాండు చేశారు.

* గ్యాస్‌లీక్ కావడంతో 14 మంది మృతి చెందిన సంఘటన చైనాలోని షిచూవన్ కోల్ ఇండస్ట్రీ గ్రూప్‌లోని షన్‌ముశ్ బొగ్గు గనిలో జరిగింది. గ్యాస్ లీక్ కావడంతో అక్కడ పని పనిచేస్తున్న 346 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైనలో వారిలో 14 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అస్వస్థతకు లోనయిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది

* జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు పడగవిప్పాయి. ఇన్నిరోజులుగా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ఒక్కసారిగా ఫ్యాక్షన్ రాజకీయాలు భగ్గుమనడంతో జిల్లా వాసులు అసలేం జరుగుతోందో తెలియక ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నేత సుబ్బారావు(45)ను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం నాడు మధ్యాహ్నం టీడీపీ నేత సుబ్బారావును కాపుకాసి ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపి.. అనంతరం బండరాయితో తలపై మోది పరారయ్యారు. రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చిన ప్రత్యర్థులు ఒక్కసారిగా ఆయనపైకి తెగబడి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం బెలూంగుహాల దగ్గర చోటుచేసుకుంది. సుబ్బారావు స్వస్థలం కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లె. ఈయన బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు అని తెలిసింది.

* కారులో అక్రమంగా తరలిస్తున్న 170 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు రంపచోడవరం ఎఎస్పీ వకుల్‌ జింధాల్‌ తెలిపారు. మంగళవారం ఉదయం జడ్డంగిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రంపచోడవరం ఎఎస్పీ వకుల్‌ జింధాల్‌ మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. రాజవొమ్మంగి సిఐ నాగ దుర్గారావు ఆధ్వర్యంలో జడ్డంగి ఎస్సై ఎం.మోహన్‌ కుమార్‌ మండలంలోని జడ్డంగి గ్రామ శివారు మడేరు వాగు సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 170 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి, వాహనాన్ని సీజ్‌ చేశామన్నారు. నిందితుల వద్ద నుండి ఎనిమిది వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

* క‌డ‌ప న‌గ‌రంలోని మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న ఓ మిల్లులో అర్ధ‌రాత్రి అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో సుమారు 60 ల‌క్ష‌ల మేర ప‌సుపు త‌గ‌ల‌బ‌డిపోయింది. ప‌సుపు పాలిష్ చేసే ఈ మిల్లులో అగ్నిప్ర‌మాదం జ‌రిగిన స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మంట‌ల్ని అదుపుచేశారు. దీంతో ప‌క్క గోదాముల్లో ఉన్న స‌రుకుకు మంట‌లు వ్యాపించ‌కుండా నిరోధించ‌గ‌లిగారు. విద్యుత్ షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే ఈ ప్ర‌మాదం జ‌రిగిఉండ‌వ‌చ్చ‌ని ఫైర్ అధికారులు భావిస్తున్నారు. మిల్లులో అగ్రిప్ర‌మాదం కార‌ణంగా భారీ ఎత్తున ప‌సుపు నిల్వ‌లు మంట‌ల్లో కాలి బూడిద‌య్యాయ‌ని త‌న‌కు ప్ర‌భుత్వం సాయం చేయాల‌ని మిల్లు నిర్వ‌హ‌కుడు ర‌మేష్ కోరుతున్నాడు.