DailyDose

ఆగ్రహ నిరసనల్లో అమరావతి-తాజావార్తలు-12/27

Protests Still On Rise In Amaravati-Telugu Breaking News Roundup Today-12/27

* ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా పదో రోజు రైతులు ఆందోళనబాట పట్టారు. వీరికి పలురాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, న్యాయవాదులు, విద్యార్థులు మద్దతు పలుకుతున్నారు. ఇవాళ రాజధాని అంశంపై రాష్ట్ర కేబినెట్‌ సమావేశం కానున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అమరావతికి వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
* రాజధానిలో గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, నిర్మాణాలపై రూపొందించిన నివేదికను.. మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ఉపసంఘం ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైంది.
* అధికార వికేంద్రీకరణ కాదు… అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని… ఎంపీ సుజనాచౌదరి వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంత రైతులు ఇచ్చిన వినతిపత్రాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సుజనా అందజేశారు. రాజకీయ విద్వేషాలతోనే సీఎం జగన్ రాజధాని తరలింపునకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్రపతికి వివరించినట్లు తెలిపారు.
* పెదకాకని గ్రామంలో మూడు రాజధానులు నిరసనగా ధర్నా చేపట్టిన ధూళిపాళ్ల నరేద్ర కుమార్ అరేస్ట్ చేసినా పోలీసులు
* అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీటింగ్..మీటింగ్ కి హాజరైన టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, సీపీఐ నాయకులు దోనెపూడి శంకర్, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు గద్దె తిరుపతిరావు,
* రాజధాని అమరావతి కోసం బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ మౌన దీక్ష.ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మౌన దీక్ష కు దిగిన కన్నా , పలువురు బిజేపి నేతలు.
*ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. అభివృద్ధి వికేంద్రీకరణపై జీఎన్‌ రావు కమిటీ అందజేసిన నివేదికలోని సూచలనపై కేబినెట్‌ సమావేశంలో సూత్రపాయంగా చర్చ జరిగింది.
*ఏపీ సీఎం జగన్‌పై సీనియర్‌ జర్నలిస్ట్‌ శేఖర్‌ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ నిర్ణయాలు తుగ్గక్‌ కంటే ఘోరంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. మూడు రాజధానులు.. తుగ్లక్‌ నిర్ణయం లాంటిదని ఎద్దేవా చేశారు. జగన్‌ సీఎం అయిన తర్వాత అమరావతి ప్రాజెక్ట్‌‌ను ఆపేశారన్నారు.
*మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ స్టేషన్ల ప్రకటనకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌‌ను విడుదల చేసింది. 5న పోలింగ్‌ స్టేషన్ల జాబితా డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌‌ విడుదల కానుంది.
*సీఏఏ, పౌరసత్వ సవరణ చట్టం 2019కి మద్దతుగా తిరుపతిలో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
*రాజధానికి విషయంలో మరో హై పవర్ కమిటీ వేయాలని నిరుణ్యం..3 వారాల్లో కమిటీ రిపోర్ట్ వచ్చేలా ప్రణాళిక
ఉద్యోగుల బదలాయింపు, కార్యాలయాల తరలింపు పై నివేదిక ఇవ్వనున్న హై పవర్ కమిటీఉద్యోగులు, మంత్రులు, ఐ ఏ ఎస్ అధికారులతో కమిటీరాజధాని పై ప్రతి ఒక్క మంత్రి సూచనలు అడిగిన జగన్..కొందరు మంత్రులు కమిటీ వేయాలని సూచన..కొందరు అవసరం లేదని మీ మాట మా మాట అన్న మంత్రులు.
*రాజధాని అమరావతి కోసం వెలగపూడిలో రైతులు చేస్తున్న దీక్ష ఉద్రిక్తంగా మారింది. 3 రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి… రైతులు, మహిళల ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఓ కారును చుట్టుముట్టిన మహిళలు… అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో సీఐ, ఎస్సైకి గాయాలయ్యాయి.మూడు రాజధానుల ప్రతిపాదనపై వెలగపూడిలో రైతుల దీక్ష ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు రిలే నిరాహార దీక్ష కొనసాగుతుండగా… రోడ్డుపై బైఠాయించి రైతులు, మహిళలను ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళన కారుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం త్యాగాలు చేస్తే… అవమానించేలా రాజధాని మారుస్తారా…? అని మండిపడుతున్నారు. కేవలం అసెంబ్లీని అమరావతిలో ఉంచితే లాభమేంటని… పూర్తిస్థాయి రాజధాని ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అందోళన చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఓ కారును చుట్టుముట్టిన మహిళలు… అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో సీఐ, ఎస్సైకి గాయాలయ్యాయి
*దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. చలి మంటలు కూడా చలిని అడ్డుకోలేకపోతున్నాయి. ఎముకలు కొరికే చలికి ఢిల్లీ వాసులు వణుకుతున్నారు. గత వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.
*పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో గత కొద్ది రోజుల నుంచి ఆందోళనలు కొనసాగుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఇవాళ మసీదుల్లో ప్రార్థనలు ముగిసిన అనంతరం సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్‌ వెల్లడించారు. యూపీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. యూపీలోని 75 జిల్లాలకు గానూ 21 జిల్లాల్లో పూర్తిస్థాయిలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశామన్నారు.
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గొల్లపూడిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రాజధానిని మార్చొద్దంటూ గొల్లపూడి-1 సెంటర్‌ వద్ద తెదేపా నేత దేవినేని ఉమ నిరసన చేపట్టారు. రైతులతోపాటు రహదారిపై ఉమ బైఠాయించారు. పోలీసులు దేవినేనితోపాటు పులువురు నేతలను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. దీంతో నిరసనకారులు పోలీసుల చర్యను నిరసిస్తూ ఆందోళనలను ఉద్ధృతం చేశారు.
*ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయంలో మంత్రి వర్గం భేటీ అయ్యింది. మూడు రాజధానుల అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఈ భేటీకి అంత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు సారథ్యంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి, నిర్ణయం తీసుకోవడమే ప్రధాన ఎజెండాగా మంత్రివర్గం సమావేశమైంది.
*తాజాగా పాకిస్థాన్ మిడతల దండు ఇండియాపై దండెత్తుతూ, గుజరాత్‌లో పంటలకు అపారమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. సమూహాలుగా వస్తున్న మిడతలు బనాస్ కాంఠా, మహసానా, కచ్, సాబర్ కాంఠా తదితర ప్రాంతాల్లో ఆవాలు, జీలకర్ర, బంగాళాదుంప, గోధుమ, జీలకర్ర, పత్తి తదితర పంటలను నాశనం చేస్తున్నాయి.
*ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మంత్రి వర్గ ఉప సంఘం శుక్రవారం భేటీ అయ్యింది. చంద్రబాబు పాలనలో అవినీతిపై మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఇచ్చింది. ఏసీబీ, విజిలెన్స్‌, నిపుణుల సహకారంతో నివేదికను సిద్ధం చేశారు. చంద్రబాబు పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని పనులు, ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిపై నివేదిక ఇచ్చినట్లు సమాచారం
*ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఎపి రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ కన్నా లక్ష్మీనారాయణ ఉద్దండరాయనిపాలెంలో రాజధాని కోసం ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో కొద్దిసేపు మౌన దీక్ష చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్రం నిధులిచ్చిందని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు
*విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. బ్యారేజీ వైపు వెళుతున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సరైన వివరాలు చెప్పని వాహనదారులను వెనక్కు పంపుతున్నారు. ప్రకాశం బ్యారేజ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అమరావతినుంచి రాజధానిని తరలించవద్దంటూ రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
*ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా పదో రోజు రైతులు ఆందోళనబాట పట్టారు. వీరికి పలురాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, న్యాయవాదులు, విద్యార్థులు మద్దతు పలుకుతున్నారు. ఇవాళ రాజధాని అంశంపై రాష్ట్ర కేబినెట్‌ సమావేశం కానున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అమరావతికి వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
*రాజధాని అమరావతి కోసం బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ మౌన దీక్ష ప్రారంభం.ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మౌన దీక్ష కు దిగిన కన్నా , పలువురు బిజేపి నేతలు.రాజధాని శంకుస్థాపన పవిత్ర మట్టి కి పూజలు చేసిన దీక్ష కు దిగిన కన్నా.గంట పాట కొనసాగనున్న మౌన దీక్ష.రాజధాని అమరావతి లోనే కొనసాగించాలని డిమాండ్.
*రాజధానిని అమరావతిలో కొనసాగించాలని, మూడు రాజధానుల ప్రకటనను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని రైతులకు మద్దతుగా గుంటూరులో శుక్రవారం మహాదర్నా నిర్వహిస్తున్నట్లు అమరావతి పరిరక్షణ కమిటీ పొలిటికల్‌ జేఏసీ ప్రకటించింది.
*దిల్లీలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఈ నెల చివరి నాటికి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి 1901 తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయి నమోదైన డిసెంబర్ నెలల్లో రెండో అతిశీతల నెలగా డిసెంబర్ రికార్డు సృష్టించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సుమారు 19.15 డిగ్రీల సెల్సియస్కు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది.
*రాజధాని అమరావతిలోని రైతుల ధర్నా ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మంత్రులు, సీఎం వెళ్లే మార్గంలో భారీగా పోలీసుల మోహరించారు. తుళ్లూరు మండలంలోని రాజధాని గ్రామాల్లో 700 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముగ్గురు డీఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు.
*రాజధాని తరలింపు ప్రతిపాదనలతో అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్న వేళ….కేబినెట్‌ భేటీ ప్రాధాన్యసంతరించుకొంది. రాజధానిపై ప్రభుత్వం తీసుకొనే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై సిఫార్సులు చేసిన జీఎన్ రావు కమిటీ నివేదికపై కేబినెట్‌ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. కమిటీ చేసిన సిఫార్సుల మేరకు మూడు రాజధానుల అంశాన్ని మంత్రి మండలి చర్చించి నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్ ప్లాట్ల అంశంపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
*ఖాళీగా ఉన్న 36 ఆహార భద్రత ఇన్స్పెక్టర్లు, అధికారులు, గెజిటెడ్ స్థాయిలో ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 6, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పోస్టులను రెండు నెలల్లో భర్తీ చేయాలంటూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కు గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ విద్యుత్తు కేంద్రం (కేటీపీఎస్) ఏడో దశ కర్మాగారంలో సుదీర్ఘ కాలం ఉత్పత్తి నిలిపివేతతో జెన్కోకు భారీ నష్టం వాటిల్లుతోంది. జెన్కో యాజమాన్యంలో కేటీపీఎస్ 12వ యూనిట్గా పేర్కొనే ఏడో దశ కర్మాగారం ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 800 మెగావాట్లు.
*నెలాఖరులో పదవీ విరమణ పొందుతున్న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి స్థానంలో కొత్త సీఎస్ పదవి కోసం కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వారు ఉన్నతస్థాయి ప్రముఖులను కలిసి అభ్యర్థిస్తున్నట్లు తెలిసింది.
*పాత పది జిల్లాలు మినహా కొత్త జిల్లాల్లో మత్స్య సహకార సంఘాల ఏర్పాటు, ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ఈ మేరకు గ్రామాల్లో అయిదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకున్న సొసైటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
*పశ్చిమ మధ్య రైల్వే పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున రెండు రైళ్లను రద్దు చేసినట్లు సీనియర్ మండల వాణిజ్య అధికారి నరేంద్రవర్మ గురువారం తెలిపారు. విజయవాడ నుంచి హుబ్లీ వెళ్లే రైలు (నం.56501) జనవరి 2 నుంచి 4వ తేదీ వరకు, హుబ్లీ నుంచి విజయవాడ వచ్చే రైలు(నం.56502) వచ్చేనెల ఒకటి నుంచి 3వ తేదీ వరకు రద్దు చేసినట్లు తెలిపారు.
*గీత కార్మికులకు అండగా నిలుస్తున్న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్లను వచ్చే నెల 4న జలవిహార్లో సన్మానిస్తున్నట్లు తెలంగాణ గౌడ సంఘం, గౌడ హాస్టలు నేతలు తెలిపారు. గురువారం హైదరాబాద్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ను కలిసి, ఆయన చేతులమీదుగా సన్మాన కార్యక్రమ ఆహ్వాన పత్రికలను విడుదల చేయించారు.
*పశువుల్లో గాలికుంటు వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం జనవరి 16వ తేదీ నుంచి ఎఫ్ఎండీ(గాలికుంటు వ్యాధి) టీకాల కార్యక్రమం మొదలుకానుంది. రాష్ట్రంలోని పాల జాతి పశువుల్లో ఈ వ్యాధిని ఇప్పటికే పూర్తిస్థాయిలో నిర్మూలించినా, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి మరో అయిదేళ్ల పాటు వ్యాక్సినేషన్ను అమలు చేయనున్నారు.
*సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ జనవరి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 4,940 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇ.యాదగిరి తెలిపారు.
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి 8న రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ఆటోల బంద్ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్స్ సంఘాల జేఏసీ నేతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను హిమాయత్నగర్లోని సత్యనారాయణరెడ్డి భవన్లో నిర్వహించిన జేఏసీ సమావేశంలో ఆవిష్కరించారు.
*ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజులు, ఉపకారవేతనాల విడుదల కోసం శనివారం కళాశాలల బంద్ను నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం నగరలోఓని సీఆర్ భవనంలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు.
*రైలు ప్రయాణికులకు ఎక్కువగా శుభవార్తలు చెప్పే భారతీయ రైల్వే… త్వరలో ఓ షాకింగ్ న్యూస్ చెప్పబోతోంది. ప్రభుత్వం రైలు టికెట్ల ధరల్ని పెంచే ఆలోచనలో ఉందన్న వార్తలొస్తున్నాయి. రైల్వేస్ బోర్డ్ ఛైర్మన్ వీకే యాదవ్ ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించకపోయినా… అలాంటి చర్యలు ఉండబోతున్నట్టు సూచనప్రాయంగా చెప్పారు. భారతీయ రైల్వే ‘హేతుబద్ధీకరణ’ గురించి ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారాయన. అయితే సరుకు రవాణా ఛార్జీలు మాత్రం పెరగవని చెప్పారు. “రైలు టికెట్లు, సరుకు రవాణా ఛార్జీలను హేతుబద్ధీకరించబోతున్నాం. ఇప్పటికే సరుకు రవాణా ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సరుకు రవాణా ఛార్జీలు పెంచే ఆలోచన అయితే లేదు. లాజిస్టిక్ కాస్ట్ తగ్గించేందుకు సరుకు రవాణా ఛార్జీలను హేతుబద్ధీకరించాల్సిందే” అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ వీకే యాదవ్ అన్నారు.