Movies

చెరిపేశా

What happened to RK tattoo of Deepika

బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనె ప్ర‌స్తుతం `ఛ‌ప్పాక్` సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉంది. ఇందులో దీపికాను నిశితంగా గ‌మ‌నించిన కొంద‌రు మీడియా వ‌ర్గీయులు ఓ విష‌యాన్ని ప‌సిగ‌ట్టారు. ఈ అమ్మ‌డు ర‌ణ‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకోవ‌డానికి ముందు ర‌ణ‌భీర్ క‌పూర్‌తో ప్రేమాయ‌ణం న‌డిపింది. అత‌ని పేరు సూచించేలా ఆర్‌కే అనే అక్ష‌రాల‌ను త‌న మెడ‌పై ప‌చ్చ‌బొట్టు వేయించుకుంది. ఇప్పుడు ఆ ఆక్ష‌రాల‌ను క‌నిపించ‌డం లేదు. మ‌రి ఈ అక్ష‌రాల‌ను పర్మినెంట్‌గా తీసేయించిందా? లేక మేక‌ప్‌తో క‌వ‌ర్ చేసుకుందా? అని తెలియ‌డం లేదు. దీపికా న‌టించిన ఛ‌ప్పాక్ జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో దీపికా యాసిడ్ బాధితురాలిగా న‌టించారు. మేఘ‌నా గుల్జార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.