Politics

చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఎసరు!

YS Jagan's Strategy To Grab Opposition Status Of TDP

ప్రతిపక్ష హోదా అనేది తక్కువేమీ కాదు. ప్రోటోకాల్ పరంగా చాలా ప్రివిలేజెస్ ఉంటాయి. దటీజ్ డీ పొజిషన్. ప్రభుత్వం కోల్పోయిన మర్యాదకరమైన సంఖ్యలో సీట్లు తెచ్చుకుని ప్రతిపక్షంలో కూర్చోవడం కూడా ముఖ్యమే. కనీసం పదిశాతం సీట్లు తెచ్చుకుని ప్రతిపక్షంగా గుర్తింపు దక్కించుకుంటేనే అధికారిక ప్రతిపక్షం. అంతకు తగ్గితే జస్ట్ ప్రతిపక్షం. 1994-99 పిరియడ్ కావచ్చు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా PJR హయాంలో 294 స్థానాలకు కేవలం 26 మాత్రమే గెలుచుకుని ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఇదే చంద్రబాబునాయుడు అసెంబ్లీలో పదేపదే దీన్ని ప్రస్తావించేవారు. కానీ చరిత్రలో తను కూడా అదే పరాభవాన్ని చవిచూడాల్సి వస్తుందని అప్పట్లో కలలో కూడా అనుకోలేదేమో! బహుశా అవును ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీకి ఆ ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చేయాలని జగన్ సంకల్పం. అదీ సమీపించింది. నిజానికి దీనివల్ల చంద్రబాబుకు అదనపు నష్టం ఏమీ లేదు. జగన్ కు వచ్చిన అదనపు లాభం లేదు. కాకపొతే ఈగో. రాజకీయంగా చంద్రబాబును మరింత వెనక్కి నేట్టేయడం చివరకు ఆ ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా పోయిందని అవకాశం వచ్చిన ప్రతిసారి చెప్పిపోడవడం మొన్నటి తరంలో తన ఎమ్మెల్యేలను కొనేసినందుకు ప్రతీకారం తీర్చుకోవడం వంటి చిన్నచిన్న సంతోషాలు. ఇప్పటికే కట్టుజారిపోతున్న టీడీపీ మరింత జరిపోతుందనే ఆందోళన చంద్రబాబుది. ప్రోటోకాల్ పరంగా కూడా చంద్రబాబు కొన్ని ప్రివిజిలేన్స్ కోల్పోవాల్సి ఉంటుంది. చంద్రబాబు గెలిచిన సీట్లు 23. ఆ సీట్లలో ఆల్ రెడీ వంశీ వెళ్ళిపోయాడు. సో…మిగిలింది 22. ఇప్పుడు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దలి గిరి టీడీపీ వీడిపోనున్నాడని తెదేపా వారే చెప్పుకుంటున్నారు. తను కొద్దిరోజులుగా చంద్రబాబుకు దూరంగా ఉంటున్నాడు కాబట్టి బహుశా తను కూడా వంశీ లాగా ఇండిపెండెంట్ సభ్యుడిగా కొనసాగాలేమో. సో..తెదేపాకి మిగిలింది 21. ఎలాగూ విశాఖలో ముగ్గురు సభ్యులు టీడీపీని వీడటానికి రెడీ అయిపోతున్నారు. ఆ సంకేతాలు కూడా ఇస్తున్నారు. వాళ్ళను పార్టీలో ఇంకా కాపాడుకోవడం చంద్రబాబు వల్ల అయ్యే సీస్ కనిపించడం లేదు. వాళ్ళు గనుక పార్టీ వీడితే ఇక తెదేపాకి మిగిలేది పద్దెనిమిది. బోతా బోటీ ప్రతిపక్ష నేత హోదా మిగలాలంటే అవసరమైన సంఖ్యా అదే. ఈ స్థితిలో ఏ ప్రకాశం జిల్లా నుంచో ఒక్కోరోనో ఇద్దరినో లాగితే చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా గల్లంతు ఖాయం .ఎలాగు ప్రకాశం జిల్లాలో టీడీపీ వాళ్ళు జగన్ తో టచ్ లో ఉన్నారు. కేసులు విచారణ దర్యాప్తు చికాకులు గట్రా మెల్లిమెల్లిగా చూసుకోవచ్చు కాని ముందయితే ఆ హోదాకు కత్తెర పెట్టేద్దామనే దూకుడు కనిపిస్తున్నది జగన్ లో. ప్రస్తుతం నిజానికి ఇలా వచ్చే వాళ్ళను అధికారికంగా స్వతంత్రులుగా పరిగణించడం కష్టం. వైకాపాలో అధికారికంగా చేరాలంటే మూడింట రెండొంతులు మంది వైకాపాలోకి మారాల్సి ఉంటుంది. అది జగన్ కు కొంచెం కష్టం. సో ఇక్కడ స్పీకర్ నిర్ణయం కీలకం అవుతుంది. తెదేపాకి దూరమైనా సరే రికార్డుల్లో అధికారికంగా తెదేపా సభ్యులుగానే ఉంటారు కాబట్టి చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాకు భంగం వాటిల్లకపోవచ్చనేది పాయింటే.