Health

ఎర్ర రక్తకణాలు పెరగాలంటే ఏమి చేయాలి?

How To Fight Red Blood Cells Deficiency

రక్తంలో హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉండటం వల్ల మీకు అలసట, నీరసం ఉంటోంది. జుట్టు రాలడం, సరిగా నిద్రపట్టకపోవడం, మలబద్ధకం కూడా ఉండే అవకాశం ఉంది. హిమోగ్లోబిన్‌ పెరగడానికి ప్రొటీన్‌, ఐరన్‌, విటమిన్‌ సి అవసరం. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే…
బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక గుడ్డు, గ్లాస్‌ ఆరెంజ్‌ జ్యూస్‌ తీసుకోవాలి.
ఒక పూట తప్పనిసరిగా ఆకు కూర తినాలి.
రోజుకు 5 నల్ల ఖర్జూరాలు తీసుకోవాలి.
వారానికి రెండుసార్లు బోన్‌ సూప్‌ తాగాలి.
రోజువారి ఆహారంలో కందిపప్పు బదులుగా మైసూరు పప్పు (ఎర్రపప్పు) వాడాలి. ఇందులో ఐరన్‌ శాతం ఎక్కువ ఉంటుంది.
స్నాక్స్‌లో అటుకుల ఉప్మా లేదంటే అటుకుల మిక్చర్‌ లేదా అటుకులు, అరటిపండు, బెల్లం, పాలు కలుపుకొని తీసుకోవాలి.