Sports

ఆ ఒక్కటీ చేయకు

Will Ganguly Do That To Tests

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టు ఫార్మాట్‌పై ఇప్పటికే పలువురు దిగ్గజాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఏ నిర్ణయం తీసుకుంటాడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు నుంచి సానుకూల స్పందన వస్తే అందుకు ఐసీసీ కూడా మరో అడుగు ముందుకేసే అవకాశం ఉంది. బీసీసీఐ అధ్యక్షునిగా గంగూలీ నియమించబడ్డ తర్వాత తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు నాలుగు రోజుల టెస్టుపై కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాడేమో అని సగటు అభిమాని మదిలో ప్రశ్నలు తలెత్తున్న నేపథ్యంలో ఇండియన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(ఐసీఏ) తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ క్రమంలోనే సదురు బాడీ సభ్యులు గంగూలీకి ముందుగానే తమ విన్నపాన్ని తెలియజేశారు. ఐసీసీ ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టుకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని గంగూలీని కోరారు.