Agriculture

అమరావతిలో రైతుల ఆక్రందనలు-TNI ఫోకస్

Amaravathi Farmers Protest-Telugu Agricultural News-Special Focus

* రాజధాని గ్రామమైన మందడం శనివారం రణరంగాన్ని తలపించింది. గ్రామంలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు దాడి చేశారు. ర్యాలీని అడ్డుకునే ప్రయత్నంలో రైతులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మమ్మల్నే ఎదిరిస్తారా అంటూ పోలీసులు రైతులపై పిడిగుద్దులు కురిపించారు. మహిళలను జడలు పట్టుకుని లాగారు. వారిని ఈడ్చుకుంటూ వెళ్లి పోలీస్‌ వ్యాన్‌లో కుక్కారు. పోలీసులకు, రైతులకు జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. ఒక వృద్ధురాలి చేయి విరిగింది. ఆమెను 108 వాహనంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు
* అమరావతిమందడంలో పరిస్థితి ఉద్రిక్తంధర్నా శిబిరం నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన రైతులు
మందడం గ్రామ వీధుల్లో రైతుల కవాతుజై అమరావతి నినాదాలు చేస్తూ ర్యాలీఎక్కడికక్కడ ముళ్ల కంచెలు వేసిన పోలీసులుభారీగా పోలీసులు మోహరింపుఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులుపోలీసుల్ని నెట్టుకుంటూ ముందుకు సాగుతున్న రైతులు
* రాజధాని అమరావతి గ్రామాల్లో మరో నిండు ప్రాణం బలైంది వెలగపూడి గ్రామానికి చెందిన రైతు కూలీ నందిపాటి గోపాలరావు గుండెపోటుకు గురై శనివారం ఉదయం మృతి చెందారు గోపాలరావు రాజధాని నిర్మాణానికి అర ఎకరం భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు రాజధాని తరలిపోతున్న మనస్థాపం చెంది గుండెపోటుకు గురైన బంధువులు తెలిపారు మృతి చెందిన గోపాలరావు భౌతిక కాయాన్ని రైతు ప్రతినిధులు సందర్శించి నివాళులు అర్పించారు మృతుని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు
* రాజధాని అమరావతి అంశంపై ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్‌షాకు అఖిలభారత హిందూ మహాసభ ప్రతినిధులు లేఖ రాశారు. రాజధాని విషయంలో సీఎం జగన్‌ విపరీత పోకడలకు నాంది పలికారని లేఖలో పేర్కొన్నారు
* రాజధాని ప్రాంతంతోపాటు కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ప్రజాసంఘాలు, రాజకీయపక్షాలు ఆందోళనలు చేపట్టాయి.
* స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌ అన్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ అధ్యక్షతన మంగళగిరిలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ‘రాజధాని ఒకే చోట ఉండాలి, పరిపాలన అక్కడి నుంచే సాగాలి’ అనే తీర్మానానికి పార్టీ కట్టుబడి ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. ఏడు నెలల్లో ఇంతగా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. గతంలో ఓదార్పుయాత్ర, పాదయాత్ర చేపట్టిన జగన్.. ఇప్పుడు రైతులతో కనీసం మాట్లాడకపోవడం దారుణమన్నారు. పోలీసుల చర్యలతో రాజధానిలో యుద్ధ వాతావరణం నెలకొందన్నారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు వెళ్తున్న మహిళల్ని పోలీసులు దారుణంగా కొట్టారని, పోలీసులు రాజధాని గ్రామాల్లో రైతుల ఇళ్లకు వెళ్లి తాళాలు వేస్తున్నారని ఆరోపించారు.
* సీఎం జగన్‌ చెప్పినట్టు విని తప్పు చేసిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు. ఇష్టం వచ్చినట్లు 144 సెక్షన్‌ అమలు చేయవద్దని సుప్రీంకోర్టు చాలా స్పష్టం చెప్పిందన్నారు. 144 సెక్షన్‌ అడ్డం పెట్టుకుని తెదేపా నేతలను నిర్బంధించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అమరావతి జేఏసీ కార్యాలయానికి తాళం వేయడం సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. వైకాపా మినహా మిగిలిన అన్ని పార్టీలూ జేఏసీలో ఉన్నాయని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్నారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఉమా స్పష్టం చేశారు. సీబీఐ కోర్టులో జగన్‌ హాజరు అంశంపై ప్రజల దృష్టి మరల్చే క్రమంలోనే అమరావతిలో మహిళలపై పోలీసుల దాడి ఘటన జరిగిందని ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం అసమర్థత వల్లే కశ్మీర్‌ తరహా ఉద్రికత పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయన్నారు.
* ఏపీ రాజధానిపై రైతులు చేస్తున్న ఆందోళన చూస్తుంటే చాలా బాధగా ఉందని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రైతులు, మహిళలు దుర్గమ్మ గుడికి వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. రాజధాని గ్రామాల్లోని దేవాలయాల్లో పూజలు చేసుకోవడం తప్పా అని నిలదీశారు.రాజధాని గ్రామాల్లో ర్యాలీలకు అనుమతి లేదంటున్నారు మరి వైకాపా ర్యాలీకి అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు‘‘కులాలేంటని రైతులను పోలీసులు అడగమేంటి”ప్రాంతీయ, కుల విద్వేషాలు తీసుకొచ్చి పరిపాలన చేయాలుకోవడం మంచిది కాదు.అమరావతి రైతులకు 13 జిల్లాల ప్రజలు మద్దతు ఇవ్వాలి.13 జిల్లాల ప్రజలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. అమరావతి రైతుల అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం అని సుజనా చౌదరి అన్నారు.
*రక్షక భటులే భక్షక భటులయితే సామాన్యుడు ఎవరికి చెప్పుకుంటాడని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ప్రశ్నించారు. పశువుల కన్నా హీనంగా మాహిళలను ఈడ్చి పారేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌కి విశాఖలో ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఆయన విశాఖ కోసం ర్యాలీ చేశారని… తాము అమరావతి కోసం ర్యాలీ చేస్తున్నామన్నారు. హోం మినిస్టర్, మహిళా కమిషన్ చైర్ పర్శన్‌లు గన్ కన్నా ముందే తమ జగనన్న వస్తారన్నారని.. మహిళల గోడు మీ జగనన్నకి కనపడటం లేదా? అని ప్రశ్నించారు. వైసీపీలో ఒకరేమో పెయిడ్ ఆర్టిస్టులు అంటారని.. మరొకరు పెయిడ్ ఆర్టిసులు కాదు రైతులకు క్షమాపణ చెప్పాలి
*గుంటూరుజిల్లా జైల్ నుండి రాజధాని రైతుల విడుదలమీడియా పై దాడి కేసులో 16 రైతుల విడుదలఈ రోజు బెయిల్ పై విడుదల అయిన రైతులుఇంకా జైల్ లో ఉన్న ముగ్గురు రాజధాని రైతులుజైలు నుం విడుదల అయిన రైతులకు స్వాగతం పలికిన ఎంపీ గల్లా జయదేవ్, ఇతర టీడీపి నేతలు
*అమరావతి రాజధాని కోసం రైతులు పోరాడుతోన్న నేపథ్యంలో మందడంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మందడానికి వెళ్లిన సినీ నిర్మాత అశ్వనీదత్ రైతులకు సంఘీభావం తెలిపారు. తమ ఆందోళనల గురించి అశ్వనీదత్‌కు రైతులు వివరించి చెప్పారు. రాజధాని కోసం తాము భూములు ఇచ్చిన విషయాన్ని, ప్రభుత్వం మారగానే అమరావతి చుట్టూ జరుగుతోన్న పరిణామాలను అశ్వనీదత్‌కు తెలిపారు.మందడంలో రైతుల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ రైతులు ఆందోళనలను విరమించకుండా నిరసనలను కొనసాగిస్తున్నారు. ప్రైవేటు స్థలంలో కూర్చొని రైతులు నిరసన తెలుపుతున్నారు. ఈ సమయంలో అశ్వనీదత్ వారిని కలవడం గమనార్హం. మందడంలో రైతులు ఓ చోట టెంటు వేసుకుని దీక్షకు దిగిన ప్రాంతానికి వెళ్లి ఆయన చర్చించారు.
*పోలీసుల దాడిలో మరో మహిళకు గాయాలు
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మందడంలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వారిపై ఇవాళ ఉదయం జరిగిన పోలీసుల దాడిలో ఓ మహిళకు చేయి విరిగిన సంగతి తెలిసిందే. కాగా, కొద్దిసేపటి క్రితం జరిగిన మరో దాడిలో ఎర్రమనేని శ్రీలక్ష్మి అనే మహిళకు గాయాలయ్యాయి. ఆమెను 108 వాహనంలో ఆయుష్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కడుపులో కొట్టారని సదరు మహిళ చెబుతున్నారు.
* అమరావతిలోని వెలగపూడిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల చేపట్టిన చినకాకాని రహదారి దిగ్బంధం కేసులో ఉన్నారంటూ పోలీసులు ఇంట్లోకి వచ్చారు. దీంతో ఆగ్రహించిన మహిళలు పోలీసులను అడ్డుకున్నారు. వారెంట్‌ లేకుండా ఇళ్లల్లోకి ఎందుకు వస్తున్నారంటూ నిలదీశారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
* తుళ్లూరులో ఒంటిపై పెట్రోల్ పోసుకుని జానీ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జానీని పోలీసులు మంగళగిరి పీఎస్‌కు తరలించారు. తన మామ ఆసిఫ్‌ అరెస్ట్‌తో కలత చెందిన జానీ ఈ ఘటను పాల్పడ్డాడు. ఉదయం తుళ్లూరులో జానీ మామఆర్మీ మాజీ ఉద్యోగి ఆసిఫ్‌ను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై దాడి కేసులో ఆసిఫ్‌ అరెస్టైయ్యాడు.