DailyDose

అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్-వాణిజ్యం

అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్-వాణిజ్యం-Amazon Great India Sale Is Here-Telugu Business News

* బిగ్‌‌సీ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా స్క్రాచ్‌‌ అండ్ విన్ ఆఫర్‌‌‌‌ ప్రకటించింది. బిగ్‌‌సీలో మొబైల్ కొనుగోళ్లపై రూ.12 కోట్ల విలువైన బహుమతులతో పాటు 5 కోట్ల క్యాష్ పాయింట్లు గెలుచుకునే అవకాశం ఉందని సంస్థ ఫౌండర్, సీఎండీ యం బాలు చౌదరి చెప్పారు. ఈ ఆఫర్‌‌‌‌కు కస్టమర్ల నుంచి విశేష స్పందన వస్తోందని పేర్కొన్నారు. బిగ్‌‌సీలో మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన కస్టమర్లకు స్క్రాచ్‌‌ అండ్ విన్ ద్వారా ఫ్రిజ్‌‌లు, వాషింగ్ మెషిన్లు, ఎల్‌‌ఈడీ టీవీలు, ల్యాప్‌‌టాప్‌‌లు, ఓవెన్లు, ట్రాలీ సూట్‌‌కేసులు, మిక్సర్, రైస్‌‌ కుక్కర్ వంటి ఎన్నో గిఫ్ట్‌‌లు పొందవచ్చని చెప్పారు. మొబైల్ యాప్‌‌ను కూడా బిగ్‌‌సీ లాంచ్ చేసింది. ఒక మొబైల్ రిటైల్ సంస్థ యాప్‌‌ను ప్రవేశపెట్టడం దేశంలోనే తొలిసారి అని బాలు చౌదరి చెప్పారు. తమ బిగ్‌‌సీ యాప్‌‌లో కానీ, వెబ్‌‌సైట్‌‌లో కానీ మొబైల్ ఆర్డర్ చేస్తే, ఆర్డర్ చేసిన 90 నిమిషాల వ్యవధిలో డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు.
* ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు. ఇక అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు ఈ సేల్‌ 12 గంటల ముందుగానే.. అంటే.. జనవరి 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచే అందుబాటులోకి రానుంది.ఈ సేల్‌లో నో కాస్ట్‌ ఈఎంఐ విధానంలోనూ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలో మొబైల్‌ ఫోన్లపై ఈ సేల్‌లో 40 శాతం వరకు, ఎలక్ట్రానిక్స్‌పై 60 శాతం వరకు, అమెజాన్‌ డివైస్‌లపై 45 శాతం వరకు డిస్కౌంట్లను అందివ్వనున్నారు. అలాగే నూతన కస్టమర్లకు ఉచిత డెలివరీ సదుపాయం కూడా అందివ్వనున్నారు.
* శాంసంగ్‌ తన నూతన స్మార్ట్‌ ఫోన్‌ గెలాక్సీ ఎస్‌10 లైట్‌ను భారత్‌లో ఈ నెల 23వ తేదీన విడుదల చేయనుంది. ఇందులో.. 6.7 ఇంచుల డిస్‌ప్లే, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, 32 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌, బ్లూటూత్‌ ఎస్‌ పెన్‌, స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌, 48 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరా.. తదితర ఫీచర్లను ఏర్పాటు చేశారు. కాగా ఈ ఫోన్‌ ధర రూ.35వేల వరకు ఉంటుందని తెలిసింది.
*చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ రియల్మీ బడ్జెట్ ధరలో మరో ఫోన్ను తీసుకొచ్చింది. రియల్మీ 5కు కొనసాగింపుగా తక్కువ ధరలో 5i పేరిట మరో కొత్త మొబైల్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
*ఆరోగ్య బీమా సంస్థ అపోలో మ్యూనిచ్ పేరు ఇకపై హెచ్డీఎఫ్సీ ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్గా మారనుంది. ఈ మార్పు గురువారం నుంచి అమల్లోకి రానుంది. అపోలో మ్యూనిచ్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలో అపోలో హాస్పిటల్ గ్రూపునకు ఉన్న 50.08 శాతం వాటాను హెచ్డీఎఫ్సీ రూ.1485.14 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 5 శాతానికి తగ్గే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇది 11 ఏళ్ల కనిష్ఠ స్థాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2020-21) మాత్రం వృద్ధి రేటు 5.8 శాతానికి పుంజుకోవచ్చని వెల్లడించింది.
*త్వరలో సరైన పరిష్కారం జరగకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మురుగప్ప గ్రూప్ అధిపతి ఎమ్వీ మురుగప్పన్ కుమార్తె వల్లి అరుణాచలం హెచ్చరించారు. కేవలం మహిళను అనే కారణంతోనే కంపెనీ బోర్డులో తనకు, తండ్రి సోదరులు, వారి కుమారులు సభ్యత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు.
* ఒక గృహానికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది యజమానులుంటే, ఐటీఆర్-1 (సహజ్) లేదా ఐటీఆర్-4ను (సుగమ్) వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆదాయపు పన్ను విభాగం గురువారం వెల్లడించింది.
*ప్రయాణికుల వాహనాలతో (పీవీ) పాటు 100కు పైగా బీఎస్-6 మోడళ్లను ఈ నెలలోనే విపణిలోకి తీసుకొస్తామని టాటా మోటార్స్ గురువారం వెల్లడించింది. వచ్చే నెలలో జరగబోయే వాహన ప్రదర్శనలో 4 అంతర్జాతీయ ఆవిష్కరణలు, 14 వాణిజ్య, 12 ప్రయాణికుల వాహనాలను ప్రదర్శిస్తామని తెలిపింది. ‘2020 జనవరి నుంచి 100 ప్రధాన మోడళ్లలో 1,000 వేరియంట్ల బీఎస్-6 వాహనాలను పరిచయం చేయబోతున్నామ’ని టాటా మోటార్స్ అధ్యక్షుడు రాజేంద్ర పెట్కర్ వెల్లడించారు.
*విద్యుత్తు స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) ఇ-కేవీయూ 100ను రూ.9 లక్షల్లోపే ఈ సంవత్సరం ఏప్రిల్-జూన్లో ఆవిష్కరిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా వెల్లడించారు.