ScienceAndTech

భారత నావిక దళంలో సరికొత్త ప్రయోగం

Indian Navy Success With Tejas Fighter Jet Landing

భారత నేవీ శనివారం మరో కీలక సాహస ప్రక్రియను పూర్తి చేసింది. తేజస్‌ లైట్‌ కంబాట్‌ యుద్ధవిమానం(ఎన్‌)ఎంకే 1ను అతిపెద్ద యుద్ధ వాహకనౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యపై విజయవంతంగా ల్యాండ్‌ చేసింది. అయితే ఇది భారత్‌ దేశీయంగా తయారు చేసిన తొలి ఎల్‌సీఏ కావడం విశేషం. భారత నేవీ కమోడర్ జైదీప్‌ మౌలాంకర్‌ ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా భారతీయ నేవీ అధికార ప్రతినిధి వివేక్‌ మద్వాల్‌ మాట్లాడుతూ.. ఈ ప్రయోగం ద్వారా తీర ఆధారిత యుద్ధ కార్యకలాపాలకు దేశీయంగా తయారు చేసిన సాంకేతికతలు ఉపయోగపడతాయని నిరూపితమైందన్నారు. అంతేకాకుండా భారత నేవీ కోసం ట్విన్‌ ఇంజన్‌ యుద్ధ విమానాలు తయారు చేసేందుకూ మార్గం సుగమం అయిందని ఆయన పేర్కొన్నారు.