Devotional

వారణాశిలో డ్రెస్ కోడ్

UP Govt To Impose Dress Code In Varanasi

1.ఇక నుండి కాశీలోనూ డ్రస్ కోడ్ – ఆద్యత్మిక వార్తలు 13/01
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసి నగరంలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో గర్భగుడిలోకి ప్రవేశించే భక్తుల కోసం ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టాలని కాశీ విద్వత్ పరిషత్ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం గర్భగుడిలోకి ప్రవేశించే పురుషులు భారతీయ హిందూ సంప్రదాయ వస్త్రధారణ అయిన ధోతీ,కుర్తా, మహిళలు చీరలు ధరించాలని కాశీ విద్వత్ పరిషత్ నిర్ణయించింది. కాశీ విశ్వనాథుడి దేవాలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి భక్తులకు ఉదయం 11 గంటల వరకే అనుమతించాలని నిర్ణయించారు. ఈ కొత్త డ్రెస్ కోడ్ నిబంధన అమలు చేసే తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ప్యాంటు, చొక్కాలు, జీన్స్ ధరించిన వ్యక్తులు దూరం నుంచి పూజలు చేయవచ్చు. కాని, వారిని ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతించరు.సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలోని దేవాలయం అభివృద్ధికి, సుందరీకరణకు ప్రత్యేకంగా ప్రాజెక్టు చేపట్టారు. 2019లో ప్రధాని మోదీ కాశీ ఆలయానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.కాశీకి ప్రపంచ గుర్తింపు ఇచ్చేలా గంగానదితో ఆలయాన్ని అనుసంధానం చేయనున్నారు.కాశీ విశ్వనాథ్, నవభౌరి, మానస జ్యోతిర్లింగ, నవదుర్గలతోపాటు ఇతర 108 దేవాలయాలను సందర్శించేందుకు వీలుగా పవిత్ర మార్గం నిర్మాణానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శ్రీకారం చుట్టారు.
2. ఇంద్రకీలాద్రిపై 30న శ్రీపంచమి వేడుకలు-మూలవిరాట్టుకు సరస్వతీ దేవి అలంకారం
ఇంద్రకీలాద్రిపై ఈనెల 30న శ్రీపంచమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు దుర్గగుడి ఈవో సురేష్బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూలవిరాట్టుకు సరస్వతీ దేవి అలంకారం చేయడంతోపాటు యాగశాలలో సరస్వతీ యాగాన్ని రుత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉదయం 7నుంచి సాయంత్రం 7గంటల వరకు అమ్మవారిని ఉచితంగా ముఖమండప దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దర్శనం చేసుకున్న విద్యార్థులకు ప్రసాదం, అమ్మవారి రక్ష కంకణం, ప్రసాదం, పెన్నును అందజేస్తారని తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా దేవస్థానం తరఫున అందించే పెన్నులను దాతలు ఎవరై విరాళంగా ఇవ్వదలిస్తే ఈనెల 28 సాయంత్రం 5గంటల లోపు సమాచారం కేంద్రం, ఈవో కార్యాలయంలో ఇచ్చి రసీదును పొందాలని కోరారు. దర్శనానికి వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక క్యూలైన్లు, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు.
3.15 నుంచి సుప్రభాత సేవ పునఃప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 15 నుంచి సుప్రభాత సేవ తిరిగి ప్రారంభం కానుంది. 16న ఉదయం ఆలయంలో గోదాదేవి పరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేట ఉత్సవం చేసేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది.
4.శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు దంపతులు, ఆలయ ప్రధానార్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవ ప్రారంభ పూజలు నిర్వహించారు.
5.నాగాలమ్మతల్లికి మొక్కులు తీర్చుకున్న భువనేశ్వరి
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఆదివారం చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో తమ కులదైవం నాగాలమ్మతల్లికి పూజలు నిర్వహించారు. వంశపారంపర్యంగా వస్తున్న సంప్రదాయం మేరకు అమ్మవారికి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో అత్త, మామలు ఖర్జూర నాయుడు, అమ్మణ్నమ్మ సమాధులకు నివాళులర్పించారు. గ్రామస్థులతో కొంత సమయం ముచ్చటించి తర్వాత హైదరాబాద్ వెళ్లారు.
6. పంచాంగము 13.01.2020
సంవత్సరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: హేమంత
మాసం: పౌష్య
పక్షం: కృష్ణ బహుళ
తిథి: తదియ రా.08:40 వరకు
తదుపరి చవితి
వారం: సోమవారం (ఇందు వాసరే)
నక్షత్రం: ఆశ్లేష ప.01:07 వరకు
తదుపరి మఘ
యోగం: ప్రీతి, ఆయుష్మాన్
కరణం: వణిజ
వర్జ్యం: రా.12:30 – 02:01
దుర్ముహూర్తం: 12:46 – 01:31
మరియు 03:01 – 03:45
రాహు కాలం: 08:12 – 09:36
గుళిక కాలం: 01:48 – 03:12
యమ గండం: 11:00 – 12:24
అభిజిత్ : 12:02 – 12:46
సూర్యోదయం: 06:48
సూర్యాస్తమయం: 06:00
వైదిక సూర్యోదయం: 06:52
వైదిక సూర్యాస్తమయం: 05:56
చంద్రోదయం: రా. *08:44*
చంద్రాస్తమయం: ఉ.08:57
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కర్కాటకం
దిశ శూల: తూర్పు
చంద్ర నివాసం: ఉత్తరం
సంకష్టహర చతుర్ధి
7. రాశిఫ – 13/01/2020
తిథి:
బహుళ తదియ రా.8.22 , కలియుగం-5121, శాలివాహన శకం-1941
నక్షత్రం:
ఆశ్రేష మ.12.43
వర్జ్యం:
రా.12.01 నుండి 1.31 వరకు
దుర్ముహూర్తం:
మ.12.24 నుండి 01.12 వరకు, తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు
రాహు కాలం:
ఉ.7.30 నుండి 9.00 వరకు తీవిశేషాలు: సంకష్టహర చతుర్థి
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంలో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుండును. ఆరోగ్యం గూర్చి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆత్మీయుల సహాయ సహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) అనారోగ్య బాధలు అధికమవుతాయి. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా నుండుట మంచిది. స్ర్తిలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) మానసికానందం లభిస్తుంది.కొన్ని పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభవృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) వ్యవసాయ రంగంలోనివారికి లాభదాయకంగా వుంటుంది. తొందరపాటువల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా నుండుట మంచిది. ఆకస్మిక భయము, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనమేర్పడుతుంది.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. వృధా ప్రయాణాలవల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా వుండుట మంచిది. అందరితో స్నేహంగా నుండుటకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా వుంటాయి.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. అజీర్ణ బాధలు అధికమగును. కీళ్లనొప్పుల బాధనుండి రక్షించుకోవడం అవసరం. మనోవిచారాన్ని కలిగివుంటారు.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) కళాకారులకు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాంయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. నూతన వస్తు, ఆభరణాలు సేకరిస్తారు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం వుంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు.ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
8. తిరుమల\|/సమాచారం* ****
_*ఓం న వేంకటేశాయ!!*_
• ఈరోజు సోమవారం,
*13.01.2020*
ఉదయం 5 గంటల
సమయానికి,
_తిరుమల: *13C°-24℃°*_
• నిన్న *75,927* మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో *03* కంపార్ట్మెంట్ లో
సర్వదర్శనం కోసం భక్తులు
వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
*03* గంటలు
పట్టవచ్చును,
నిన్న స్వామివారికి హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 2.53* కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
_*/ / గమనిక / /*_
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
_*ప్రత్యేక దర్శనాలు:*_
• జనవరి 21, 28వ తేదీల్లో
వృద్ధులు, దివ్యాంగులకు
శ్రీవారి ప్రత్యేక దర్శనం,
• జనవరి 22, 29వ తేదీల్లో
5 ఏళ్లలోపు చంటిపిల్లల
తల్లిదండ్రులకు ప్రత్యేక
దర్శనం.
*_తిరుప్పావై_*
_ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం తొలగి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది._
*ttd Toll free #18004254141*
తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం
కోసం క్రింద లింకు ద్వారా చేరండి
https://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ
9. చత్రలో ఈ రోజుజనవరి 13*-రాకేశ్ శర్మ
1610 : గెలీలియో బృహస్పతి నాలుగవ ఉపగ్రహమైన కాలిస్టో ను కనుకొన్నాడు
1879 : ‘లయన్స్‌క్లబ్’ స్థాపకుడు మెల్విన్‌జోన్స్‌జననం.
1888 : వాషింగ్టన్ నగరంలో నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ స్థాపించబడింది.
1919 : ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి డా.మర్రి చెన్నారెడ్డి జననం.
1930: వాల్ట్ డిస్నీ సృష్టించిన కార్టూన్ పాత్ర ‘మిక్కీ మౌస్‌’ కామిక్‌ స్ట్రిప్‌ తొలిసారి ఓ పత్రికలో ప్రచురితమైంది.
1938 : శాస్త్రసాంకేతిక విషయాలను చర్చి పెద్దలు అంగీకరించని కాలంలో డార్విన్‌ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతానికి చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ఆమోదం లభించింది.
1948 : గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టాడు. హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ కలకత్తాలో ఈదీక్షకు పూనుకున్నాడు.
1949 : భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ జననం.
1977 : ఆంగ్ల సినీనటుడు ఒర్లాండో బ్లూమ్ జననం.
1983 : భాతీయ సినిమా నటుడు ఇమ్రాన్ ఖాన్ జననం.
10. ఆలయ గర్భగుడిలోకి ప్రవేశానికి డ్రెస్ కోడ్-కాశీ విద్వత్ పరిషత్ నిర్ణయం
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసి నగరంలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో గర్భగుడిలోకి ప్రవేశించే భక్తుల కోసం ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టాలని కాశీ విద్వత్ పరిషత్ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం గర్భగుడిలోకి ప్రవేశించే పురుషులు భారతీయ హిందూ సంప్రదాయ వస్త్రధారణ అయిన ధోతీ,కుర్తా, మహిళలు చీరలు ధరించాలని కాశీ విద్వత్ పరిషత్ నిర్ణయించింది. కాశీ విశ్వనాథుడి దేవాలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి భక్తులకు ఉదయం 11 గంటల వరకే అనుమతించాలని నిర్ణయించారు. ఈ కొత్త డ్రెస్ కోడ్ నిబంధన అమలు చేసే తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ప్యాంటు, చొక్కాలు, జీన్స్ ధరించిన వ్యక్తులు దూరం నుంచి పూజలు చేయవచ్చు. కాని, వారిని ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతించరు.సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలోని దేవాలయం అభివృద్ధికి, సుందరీకరణకు ప్రత్యేకంగా ప్రాజెక్టు చేపట్టారు. 2019లో ప్రధాని మోదీ కాశీ ఆలయానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.కాశీకి ప్రపంచ గుర్తింపు ఇచ్చేలా గంగానదితో ఆలయాన్ని అనుసంధానం చేయనున్నారు.కాశీ విశ్వనాథ్, నవభౌరి, మానస జ్యోతిర్లింగ, నవదుర్గలతోపాటు ఇతర 108 దేవాలయాలను సందర్శించేందుకు వీలుగా పవిత్ర మార్గం నిర్మాణానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శ్రీకారం చుట్టారు.
11. శ‌బ‌రిమ‌ల వివాదం.. 17న సుప్రీం లాయ‌ర్ల స‌మావేశం
శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌స్వామి ఆల‌యంలోకి మ‌హిళ‌ల ప్ర‌వేశం అంశంపై సుప్రీంకోర్టు ఓ ప్ర‌త్యేక స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ది. శ‌బ‌రిమ‌ల తీర్పును స‌మీక్షించాల‌ని వేసిన పిటిష‌న్ల‌పై ఇవాళ సుప్రీం వాద‌న‌లు విన్న‌ది. అయితే రివ్యూ పిటిష‌న్ల‌ను స‌మీక్షించ‌డంలేద‌ని, గ‌త ధ‌ర్మాసనం వేసిన ఏడు ప్ర‌శ్న‌ల గురించి వాద‌న‌లు జ‌ర‌ప‌నున్న‌ట్లు చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. 9 మంది స‌భ్యుల ధ‌ర్మాసనం ఇవాళ ఈ కేసును విచారించింది. వివిధ పిటిష‌న్ల త‌ర‌పున వాదిస్తున్న లాయ‌ర్లు అంతా ఈనెల 17వ తేదీన ప్ర‌త్యేకంగా స‌మావేశం కావాల‌ని సుప్రీం ఆదేశించింది. శ‌బ‌రిమ‌ల‌లో మ‌హిళ‌ల ప్ర‌వేశం, ఇత‌ర మ‌తాల అంశాల గురించి ఆ స‌మావేశంలో కోర్టు కొన్ని ప్ర‌శ్న‌ల‌ను క్రోడీక‌రించ‌నున్న‌ది. సుప్రీం ధ‌ర్మాస‌నంలో బోబ్డేతో పాటు జ‌స్టిస్ ఆర్ భానుమ‌తి, జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్‌, జ‌స్టిస్ ఎల్ నాగేశ్వ‌ర‌రావు, జ‌స్టిస్ ఎం శాంత‌న‌గౌదార్‌, జ‌స్టిస్ ఎస్ అబ్దుల్ న‌జీర్‌, జ‌స్టిస్ ఆర్ఎస్ రాయ్ ది, జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్‌, జ‌స్టిస్ సూర్య‌కాంత్ ఉన్నారు. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి అన్ని వ‌య‌సుల మ‌హిళ‌లు ప్ర‌వేశించ‌వ‌చ్చు అని ఇటీవ‌ల సుప్రీం తీర్పునిచ్చిన విష‌యం తెలిసిందే.
12. మేడారంలో ‘మహా’ జాతరకు ముందే జనం
ఆదివాసీ గిరిజన దైవాలైన మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. మేడారం మహాజాతరకు ముందే జనసంద్రమైంది. సుమారు లక్ష మంది భక్తులు అమ్మవార్ల దర్శనానికి తరలిరావడంతో గద్దెల ప్రాంగణంతోపాటు జాతర పరిసరాలు రద్దీగా మారాయి. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం తల్లుల గద్దెల వద్దకు చేరుకొని గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవార్ల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తు బెల్లం, చీరె సారెలను, ఒడివాల బియ్యం, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్ల దర్శనంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు క్యూలైన్లలను ఏర్పాటు చేశారు. అదనపు హుండీల ఏర్పాటు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో కానుకలు సమర్పించేందుకు దేవాదాయ శాఖ అధికారులతో పాటు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ ఆలం రామ్మూర్తి, ఈఓ రాజేంద్రం కలిసి అదనపు హుండీలను ఏర్పాటు చేశారు. సమ్మక్క గద్దెపై 10 హుండీలను, సారలమ్మ గద్దెపై 10 హుండీలను, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలపై ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు.
13. అంతర్జాలంలో అభిషేకం-టిక్కెట్‌ల జారీపై వివాదం-ఏ ఖాతాలోకి పైకం జమ అవుతుందో తెలియని వైనం
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అంతర్జాల సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఆ ఫలాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. శ్రీరామ నవమి, ముక్కోటి ఉత్సవాల వేళ ఈ సేవలు తాత్కాలికంగా పని చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం చోటు చేసుకున్న అభిషేకం టిక్కెట్ల వివాదం అలజడి రేపింది. హైదరాబాద్‌కు చెందిన భక్తులు మూడు టిక్కెట్‌లను అంతర్జాలంలో తీసుకుని ఇక్కడకు రావడంతో రామాలయం అధికారులు కంగు తిన్నారు. ఆ టిక్కెట్‌లు ఎలా జారీ అయ్యాయో తెలియక అయోమయానికి గురయ్యారు. ఒక్కో టిక్కెట్‌ ధర రూ.1100 ఉండగా ఇతర పన్నుల కింద సుమారు రూ.35 చెల్లించి ఆ భక్తులు వీటిని పొందారు. తర్జన భర్జన తర్వాత వారిని అభిషేకానికి పంపినప్పటికీ ఏదో తెలియని గందరగోళం ఉందనే ప్రచారం సాగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-యాప్‌లో దేవాలయాల పూజల టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చని ఆలయ వర్గాలు అంటున్నాయి. ఎలాంటి పూజలు ఎప్పుడు ఉంటాయన్నది అందులో పూర్తిస్థాయిలో అనుసంధానం చేయలేదు. రాముడికి అభిషేకం ఆదివారం మాత్రమే ఉన్నప్పటికీ ఆ యాప్‌లో దీనిపై స్పష్టత లేదని తెలిసింది. అభిషేకానికి 40 టిక్కెట్‌లకు అవకాశం ఉంది. ఆ యాప్‌లో ఎన్ని విక్రయించారో తెలియకపోతే ఉన్న మొత్తం ఇక్కడే అమ్మేస్తారు. అప్పుడు గందరగోళం తప్పదు. గదులనూ, నిత్య కల్యాణం టిక్కెట్‌లను ఇటీవల అంతర్జాలం ద్వారా తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇలా వచ్చే డబ్బులు ఏ ఖాతాలో జమ అవుతున్నాయో తెలియడం లేదు. వాటిని తనిఖీ చేయకపోతే మాయాజాలానికి ఆస్కారం ఉంది. యాప్‌ ద్వారా ఇప్పటి వరకు ఎంత నగదు వచ్చిందో చెప్పాలని అడుగుతున్నారు.
14. సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయడం ద్వారా సకలసంపదలతో పాటు దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తాయి. మకర సంక్రమణ సమయంలో తిలా తర్పణలు విడిచి గుమ్మడి పండ్లను దానం ఇస్తే విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని పండితులు చెప్తున్నారు.ఈ ఫలం వల్ల పెద్దలు తరిస్తారని, సంక్రాంతి రోజున పితృదేవతారాధన చేయడం వల్ల వారి శుభాశీస్సులతో వర్ధిల్లుతారని విశ్వాసం. అంతేగాకుండా… మకర సంక్రాంతి పుణ్యదినాన దానధర్మాలు చేయడం ద్వారా జన్మజన్మల దారిద్య్ర బాధలు తొలగిపోతాయి.ఈ మూడు రోజుల పండగలలో మొదటి రోజు భోగి పండగ. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చేది భోగి. దక్షిణాయనానికి, ధనుర్మాసానికి చివరి రోజు ఈ రోజు. 14 జనవరి 2020 మంగళవారం భోగి పండగ ,15 జనవరి 2020 బుధవారం మకర సంక్రాంతి ,16 జనవరి 2020 గురువారం కనుమ పండగ. మకరరాశి ప్రవేశం ఎప్పుడంటే? మకర సంక్రమణం శ్రీ వికారినామ సంవత్సరం పుష్యమాసం బహుళ పక్షమి సోమవారం అనగా 14/15 జనవరి 2020 తెల్లవారి… అనగా 14/15 జనవరి 2020 తెల్లవారితే బుధవారం అనగా పుబ్బ నక్షత్రం, శోభన యోగం, తైతుల కరణం సమయంలో రాత్రి 2:08 నిమిషాలకు జగద్రక్షకుడైన శ్రీ సూర్యభగవానుడు ఉత్తరాషాఢ నక్షత్ర రెండవ పాదంలో మకరరాశి ప్రవేశంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమగును. మకర ప్రవేశం రాత్రి సమయం అయినందున మరుసటిరోజైన 15 జనవరి 2020 బుధవారం రోజు మకర సంక్రాంతి పర్వదినం సూర్యోదయం నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావున తేదీ 15 మంగళవారం రోజు అందరూ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలి. జనవరి 14 తేదీ మంగళవారం రోజు పంచాంగ ప్రకారం భోగి పండగ అవుతుంది.
15. దేవాదాయశాఖ ఆధ్వ‌ర్యంలో భ‌క్తులంద‌రికీ బంగారం: మం త్రి స‌త్య‌వ‌తి
మేడారం సమ్మక్క- సారాలమ్మ జాతర పనులను రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పర్యవేక్షించారు. ఇవాళ మంత్రి మేడారం వెళ్తూ.. గట్టమ్మ దేవాలయం వద్ద ఆగి పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ స్టాళ్ల ఏర్పాటు, నీటి వసతి, మరుగుదొడ్లు నిర్మాణాలను పరిశీలించారు. పనుల పర్యవేక్షణ అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వ‌హించి ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడారు. మేడారం జాతర కి భక్తులు అనేకం వస్తున్నార‌న్నారు. ఈనేపథ్యంలో పనుల పర్యవేక్షణ చేశామని తెలిపారు. జంపన్న వాగు ఇసుక లెవెల మైంటైన్ చేయడానికి చేస్తున్న పనులు పరిశీలించామ‌న్నారు. భక్తులకు సరిపోయే విధంగా మరుగుదొడ్లు ఉండాలనే దానిపైనే ప్రత్యేక శ్రద్ద పెట్టి పర్యవేక్షిస్తున్నామ‌న్నారు. పనులు పూర్తి అయిన తరువాత నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే ఎంతటి వారిపైన అయినా చర్యలు తీసుకుంటామ‌ని మంత్రి స‌త్య‌వ‌తి చెప్పారు. పనుల తీరును పోలీసులు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలన్నారు. జాతర సందర్భంగా ఇక్కడి స్థానికులను ఇబ్బంది పెట్టొద్దు అని అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యలో భక్తులందరికీ బంగారం ఇచ్చే కొత్త సంప్రదాయం ఈ ఏడాది నుంచి ప్రారంభించాల‌నుకుంటున్న మంత్రి తెలిపారు. గుడిలో పందిళ్ళు కొత్తవి వేయాల‌ని, ప్రతి రోజు తోరణాలు కొత్తవి కట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి చెప్పారు. గుడి ముందు రోడ్లు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి . జంపన్న వాగు స్తంభాలు కూడా అలకరించాలి. ప్లాస్టిక్ ఫ్రీ అనేది మాటల్లో కాకుండా చేతల్లో చూపాలి. మరుగదొడ్లు వెంటనే అందుబాటులో కి తేవాలి. మరుగదొడ్ల నిర్వహణ వారం రోజులు సరిపోదు..వెంటనే 15 రోజులకు పెంచాలని చెప్పాము. గుడికి వచ్చే రోడ్లన్నిటిపై ముగ్గులు వేయించాలి. సంక్రాంతి తరవాత అధికారులంతా మేడారంలోనే బస చేయాలి. ప్లాస్టిక్ ఫ్రీ జాతర ప్రచారం చేయాలి..ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్న నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు మంత్రి స‌త్య‌వ‌తి తెలిపారు.