Health

లింఫోపినియా పరీక్ష చేయించుకోండి

Lymphopenia Test Is Mandatory For Your Blood Quality

లింఫోసైట్‌ రక్త కణాలు తగ్గడం.. రాబోయే అనారోగ్యానికి సూచిక కావొచ్చని డెన్మార్మ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. భవిష్యత్‌లో ముప్పు పొంచి ఉన్న రోగులను గుర్తించడానికి ఆ ఆవిష్కరణ వీలు కల్పిస్తుందని వారు చెప్పారు. లింఫోసైట్‌ రక్త కణాలు తగ్గితే లింఫోపినియా వస్తుంది. సాధారణ రక్త పరీక్షల్లో ఇది బయటపడుతుంటుంది. అయితే భవిష్యత్‌లో తలెత్తే అనారోగ్యానికి వీటి సంఖ్య సూచిక అవుతుందన్న విషయం ఇప్పటివరకూ తెలియదు. అందువల్ల సదరు రోగులను తదుపరి రోగ నిర్ధారణ పరీక్షల కోసం పంపడంలేదని పరిశోధకులు తెలిపారు. లింఫోసైట్‌ సంఖ్య తగ్గడం వల్ల ఏదో ఒక కారణంతో చనిపోయే ముప్పు 1.6 రెట్లు ఎక్కువని; క్యాన్సర్‌, హృద్రోగాలు, శ్వాసకోశ సమస్యలు, ఇన్ఫెక్షన్లలతో మరణించే ముప్పు 1.5 నుంచి 2.8 రెట్లు ఎక్కువని పరిశోధనలో పాల్గొన్న స్టిగ్‌ బోజెసెన్‌ చెప్పారు. వృద్ధాప్యం కారణంగా లింఫోసైట్లు తగ్గిపోతుంటాయన్నారు. లింఫోపినియా ఉన్నవారిలో రోగ నిరోధక సామర్థ్యం తక్కువగా ఉంటుందని, అందువల్ల ప్రమాదకర వ్యాధులను తట్టుకొనే శక్తి వారిలో ఉండదని చెప్పారు.