Business

సచివాలయం తరలింపుకు ఖజానాకు పడే చిల్లు లెక్క ఇది

The cost of shifting AP secretariat from Amaravathi to Vizag

రాజధాని నిర్మాణ ఖర్చు వంకతో సచివాలయం మార్చడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా…!!

హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైటు లో జనవరి 11 వతేదీ వార్త (అనువాదం)

పరిపాలనా విభాగాన్ని అమరావతి నుండి విశాఖపట్నంకు మార్చడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై-పవర్ కమిటీ కొత్త రాజధానికి వెళ్లడానికి దాదాపు నాలుగు లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రోత్సాహకాలను అందించాలని సూచించింది.

శుక్రవారం విజయవాడలో జరిగిన కమిటీ సమావేశంలో చర్చించిన ముసాయిదా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, ఉద్యోగులందరికీ వారు మారడానికి ముందే విశాఖపట్నం వద్ద 200 చదరపు గజాల ఇంటి స్థలాలను నామమాత్రపు రేటుకు కేటాయించారు.

అనుమతి పొందిన డిజైన్లతో కొత్త ఇళ్ల నిర్మాణానికి, రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ డ్యూటీ చెల్లించకుండా మినహాయింపు ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్రత్యేక గృహనిర్మాణ భత్యం (హెచ్‌బిఎ) ఇవ్వబడుతుంది.

ఇళ్ళు నిర్మించే వరకు, ప్రభుత్వం ఉద్యోగులకు నివాస సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుంది: బాచిలర్లకు అద్దె రహిత వసతి లభిస్తుంది మరియు కుటుంబాలు ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లలో నెలకు 4,000 రూపాయల సబ్సిడీ అద్దెకు వసతి కల్పిస్తారు. ఉన్నత అధికారులకు మూడు పడకగదిల ఫ్లాట్లలో 6,000 రూపాయల చొప్పున వసతి కల్పిస్తారు. ఉద్యోగులకు క్లాస్ IV ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ .50 వేల నుండి గెజిటెడ్ ఉద్యోగులకు గరిష్టంగా లక్ష రూపాయల వరకు షిఫ్టింగ్ భత్యం ఇవ్వబడుతుంది.

మరో మూడేళ్లపాటు ఉద్యోగులకు ఐదు రోజుల వారపు సదుపాయాన్ని కొనసాగించాలని సిఫారసు చేయగా, విశాఖపట్నంలో సబ్సిడీ రవాణా సదుపాయాన్ని కొనసాగించాలని హై-పవర్ కమిటీ ప్రతిపాదించగా, 9విశాఖపట్నం నుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీలలో 50 శాతం రాయితీని వారి స్వస్తలానికి విస్తరించింది.
—— వార్త ఇంతవరకు——

Estimated COST ANALYSIS
ఎంత ఖర్చు అవుతుందో షుమారు అంచనా వేద్దాం.
మొత్తం ఎంప్లయీస్. 4 లక్షల మంది.

1) ఒక్కొక్కరికి 200 గజాల ప్లాటు
గవర్నమెంటు రేటు వైజాగ్ లో గజం 21,000 కంటే తక్కువ ఎక్కడా లేదు.
అంటే 4,00,000x 200x 21,000 = 168000,00,00,000.
అంటే 168000 కోట్లలుతుంది. ఇదెలా సాధ్యం?
ఒకవేళ ఎంత దూరంగా ఇచ్చినా రూ. 5,000 కంటే తక్కువ ఎక్కడా వుండదు.
పోనీ గజం 5,000 తీసుకుంటే
4,00,000x 200x 5000= 40000,00,00,000 అంటే 40,000 కోట్లు అన్నమాట.

*2) ఒక్కొక్కరికి 25 లక్షల గృహ నిర్మాణ భత్యం. *
4,00,000 x 25,00,000 = 100000,00,00,000 అంటే 1 లక్ష కోట్లు
అలవెన్సు అంటే జీతంలో భాగంగా అని భావించాలి కనుక.

3) ఇళ్ళు పూర్తి అయ్యేవరకు ఎంప్లాయీల అద్దె భారం ఎలా పడుతుందో చూద్దాం.
4 లక్షల మందిలో షుమారుగా 50,000 ఒంటరి వాళ్ళు, 2,50,000 మంది 2 బెడ్ అర్హత వాళ్ళు , 1,00,000 మంది 3 బెడ్ అర్హత వాళ్ళు వున్నారు అనుకుందాం. నిర్మాణ వ్యవధి 12 నెలలు అనుకుంటే
A. ఒంటరి వాళ్ళు— ఫ్రీ అంటే అద్దె మొత్తం గవర్నమెంటు వారే భరించాలి.
50,000 x 12 x 3,000 (అతి తక్కువ అద్దె అనుకుంటే)
180,00,00,000 = 180 కోట్లు
B. 2 బెడ్ వాళ్ళు. 2.5 లక్షల మంది. వీరు షుమారు 10,000 అద్దె ఇంటిలో వుంటే 4000 వాళ్ళు , 6000 గవర్నమెంటు భరించాల్సి వుంటుంది.
2,50,000 x 12 x 6,000 = 1800,00,00,000 అంటే 1800 కోట్లు
C. ఇంక 3 బెడ్ అర్హత వున్న వారు షుమారు 15,000 అద్దె లో వుంటారనుకుందాం, అపుడు 6,000 వాళ్ళు, 9,000 గవర్నమెంటు వారు భరించాల్సి వుంటుంది.
1,00,000 x 12 x 9000 = 1080,00,00,000 = 1,080 కోట్లు
వెరశి మొత్తం గవర్నమెంటు భరించావలసింది 180+ 1800 + 1080 = 3,060 కోట్లు

4) షిఫ్టింగు భత్యం 50,000 లేదా. 1 లక్ష
ఏ కేటగిరీ వాళ్ళెంతమందో తెలియదు కనుక సగటు గా 75,000 అనుకుంటే
4,00,000 x 75,000 = 3000,00,00,000 = 3000 కోట్లు

మొత్తం ఉద్యోగులకు ఇవ్వజూపుతున్న కనీస మొత్తం: ఒక లక్షా నలభై ఆరు వేల ఎనభై కోట్ల రూపాయలు!!

అసలు ఇది ఎలా సాధ్యం.
ఉద్యోగులకు ఇచ్చేవే ఇంత వుంటే మిగతా ఖర్చు ఎంత వుంటుంది.
ఇదంతా మన వద్ద tax రూపంలో వసూలు చేసిందే గదా.
ఇలా tax payers money ని వృధాగా ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం.

ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టు లక్ష కోట్లతో అమరావతి నిర్మిస్తే కొన్ని లక్షల మందికి శాశ్వతంగా ఉపాధి కల్పన జరుగుతుంది. ప్రతి ఏటా రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇప్పటికే అభివృద్ది చెందిన విశాఖ కాకుండా మరో నగరాన్ని సృష్టించిన సగర్వ చరిత్ర మన సొంతమవుతుంది. ఆలోచించండి.