Business

అమెజాన్ ఇండియా భారీ పెట్టుబడులు

Amazoin Pouring Money Into Its Indian Business

భారత్‌లో జోరుగా కార్యకలాపాలు విస్తరిస్తున్న అమెరికన్‌ ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. చెల్లింపులు, హోల్‌సేల్‌ వ్యాపార విభాగాల్లోకి రూ. 1,700 కోట్ల పైగా ఇన్వెస్ట్‌ చేసింది. అమెజాన్‌ పే ఇండియా విభాగానికి అమెజాన్‌ కార్పొరేట్‌ హోల్డింగ్స్, అమెజాన్‌డాట్‌కామ్‌డాట్‌ఐఎన్‌సీఎస్‌ నుంచి రూ. 1,355 కోట్లు వచ్చాయి. ఇందుకు ప్రతిగా ఆయా సంస్థలకు అమెజాన్‌ పే ఇండియా షేర్లు కేటాయించింది. ఆ రెండు సంస్థల నుంచి రూ. 360 కోట్లు అందుకున్న అమెజాన్‌ హోల్‌సేల్‌ (ఇండియా) కూడా షేర్లు కేటాయించింది. కార్పొరేట్‌ వ్యవహారాల శాఖకు సమర్పించిన పత్రాల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. గతేడాది అక్టోబర్‌లోనే వివిధ విభాగాలపై అమెజాన్‌ రూ. 4,400 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది.