Health

శృంగారంపై శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది ఏటంటే…

Scientific Research On Sex Reveals These Fascination Facts

శృంగారం విషయంలో శాస్త్రవేత్తలు సరికొత్త పరిశోధన చేశారు. ఇందులో కొన్ని నిజాలు ప్రతీ ఒక్కరినీ విస్మయానికి గురిచేశాయి. ముఖ్యంగా ఆడవారు రతి గురించి ఏమనుకుంటారు.. వారు ఆ విషయంలో ఏమేం కోరుకుంటారు. శృంగారం అనేది మిగతా అన్నీ ప్రక్రియల్లానే. అయితే, దీని గురించి మిగతా విషయాలు మాట్లాడినట్లుగా ఎవరూ బహిరంగంగా మాట్లాడరు. కారణం తమని ఎవరూ తప్పుగా అనుకుంటారోననే బిడియం. దీంతో చాలా మంది ఎవరూ దాని గురించి అంతగా మాట్లాడేందుకు ఇష్టపడరు. ముఖ్యంగా స్త్రీలు.. వారు ఈ విషయంలో అనేక రకాలుగా ఆలోచిస్తారట. ఇదే విషయంపై కొంతమంది పరిశోధకులు అనేక పరిశోధనలు చేసి కొన్ని విషయాలు చెప్పారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

*** ​శృంగారం కూడా ముఖ్యమే..
మనిషి జీవితంలో ఎన్నో ముఖ్య పనులు ఉన్నాయి. వాటినే చేస్తూ జీవనం కొనసాగిస్తాడు. ఈ నేపథ్యంలోనే శృంగారం కూడా. ఇది కూడా జీవన ప్రయాణంలో ముఖ్య పనే. కోరికలు అనేవి ప్రతీ ఒక్కరి జీవితంలో సర్వ సాధారణం. వీటి వల్ల ఎన్నో జరుగుతుంటాయి జీవితంలో.. మనిషి ప్రత్యుత్పత్తి మానవ జీవన ప్రయాణానికి శృంగారం అనేది చాలా ముఖ్య అంశం. అయితే, వీటి గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఎవరూ ఎక్కువగా ఇష్టపడరు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా సిగ్గుపడుతుంటారు. అయితే వారి మనసులో స్త్రీలు శృంగారం గురించి కొన్ని కోరుకుంటారు. వాటిపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు సరికొత్త విషయాలు చెబుతున్నారు.

*** ​ప్రేమతో చేస్తేనే ఓకే…
మగవారు సెక్స్ చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే స్రీలకి కూడా కోరికలు ఉంటాయి. అయితే, అది మిగతావారికి చెప్పేందుకు ఎక్కువగా ఇష్టపడరు. బయటపడాలనుకోరు. వారు ఆ విషయాన్ని కోరుకున్నా.. బయటపడేందుకు అంతగా ఇష్టపడరు. అయితే మగవారు కోరికతో మాత్రమే సెక్స్ చేయాలనుకుంటారు. చాలా వరకూ వారి కోరికలు తీర్చుకునేందుకు సెక్స్ చేయాలనుకుంటారు. కానీ, ఆడవారు అలా కాదు.. ప్రేమతో సెక్స్ చేయాలనుకుంటారు. ఇష్టంతో, ప్రేమతోనే తమని మగవారు దగ్గర తీసుకోవాలని కోరుకుంటారని సర్వేలో తేలినట్లుగా అమెరికా పరిశోధకులు బృందం తెలిపింది.

*** ​ఒత్తిడిని తగ్గించుకునేందుకు..
మరికొంతమంది స్త్రీలు ఆకర్షణతో చేయగా.. ఇంకొతమంది తాము కోపం, తాపాలను తగ్గించుకునేందుకు సెక్స్‌లో పాల్గొంటారని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అవును.. రోజులో కొన్ని విషయాల్లో స్త్రీలు విసిగిపోయి ఉంటారని.. వీటి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది స్త్రీలు సెక్స్‌లో పాల్గొంటారని చెబుతున్నారు నిపుణులు.

*** ​పిల్లల కోసం..
ఇక చాలా మంది స్త్రీలు పిల్లల కోసం రతిలో పాల్గొంటారని చెబుతున్నారు నిపుణులు. పిల్లలు కావాలనుకునేవారు వారు కలిగేవరకు సంభోగంలో ఇష్టంగా పాల్గొంటారని చెబుతున్నారు నిపుణులు. అనంతరం, ఆ కార్యంపై అంతగా ఆసక్తి చూపరని చెబుతున్నారు.

*** ​భర్తల కోసం..
ఇక భర్తలను సుఖపెట్టేందుకు కూడా కొంతమంది స్త్రీలు సెక్స్‌లో పాల్గొంటున్నట్లు సర్వేలో తెలిసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు నిపుణులు. వారు ఈ విషయంలో ఎలాంటి ప్రత్యేక అభిప్రాయాలను, కోరికలను కలిగి ఉండరని కేవలం భర్తల కోసమే సెక్స్‌లో పాల్గొంటారని చెబుతున్నారు నిపుణులు. దీని ద్వారా వారి బంధం కలకాలం నిలుస్తుందని చెబుతున్నారు. ఇలాంటి వారు ఎక్కువగా వారి బంధం పట్ల భయంతో ఉంటారని.. అభద్రతా భావంతో ఉంటారని చెబుతున్నారు నిపుణులు.

*** ​ఇదే నిజం..
ఈ సర్వేలో తేలిన నిజమేంటంటే అతి తక్కువ మంది స్త్రీలు మాత్రమే సెక్స్‌ని చేస్తున్నారని.. అందులో పాల్గొంటే శారీరక ఉత్తేజం కలిగి.. అనేక ప్రయోజనాలు ఉంటాయని వారికి మాత్రమే తెలిసి ఆ కార్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారని చెబుతున్నారు నిపుణులు. దీనిపై నిపుణులు కచ్చితంగా ప్రతీ ఒక్కరికీ సెక్స్ విషయంలో అవగాహన ఉండడం అవసరం అని చెబుతున్నారు. సెక్స్ అంటే ఏమిటి? సెక్స్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి. ఇలాంటవన్నీ తెలుసుకోవాలని చెబుతున్నారు.