Health

ధ్యానం చేస్తే బరువు తగ్గుతారా?

Telugu health news-Will meditating helps reduce weight

ఆరోగ్యకరమైన జీవన శైలి, శరీర బరువును నిర్వహించడం దృష్ట్యా కేవలం వ్యాయామం, ఆహార ప్రణాళికలే కాకుండా, మానసిక ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టడం మంచిదని, దానికి ధ్యానం అద్భుతంగా సహాయం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

నిద్ర లేచాక మొదటి గంట అత్యంత కీలకంగా ఉంటుంది. అది మీ రోజును ఎలా కొనసాగాలో నిర్ణయిస్తుంది. నిద్రలేయగానే అనేకమందికి ఉండే అలవాటు, పక్కన ఉన్న ఫోన్ తీసి నోటిఫికేషన్లు చూడడం. కొందరైతే ఇంకాస్త ముందుకు వెళ్లి, నిద్ర లేయడమే గేమ్స్, వీడియోలు అంటూ స్టార్ట్ చేసేస్తారు. కానీ ఈ అలవాట్లు అనారోగ్యకరమైనవి. రోజులో మొదటిగంట అత్యంత కీలకంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు చేసే మానసిక, శారీరికపరమైన పనులే మీరోజును సవ్యంగా సాగేలా చేయగలదు అని డాక్టర్లు, వెల్నెస్ నిపుణులు, ఫిట్నెస్ కోచ్లు అంటున్నారు.

సాధారణంగా నిద్ర లేచాక కనీసం 30 నుండి 40 నిమిషాలపాటు సాధారణ వ్యాయామం, జిమ్, సైక్లింగ్, రన్నింగ్, జాగింగ్, వాకింగ్, ఏరోబిక్స్, స్కిప్పింగ్, వామప్, క్రాస్ ఫిట్, యోగా వంటి వాటికి సమయం కేటాయించడం ద్వారా రోజంతా యాక్టివ్ గా ఉండడమే కాకుండా, మీ శారీరిక, మానసిక ఆరోగ్య స్థాయిలు కూడా పెరుగుతాయని మీకిదివరకే అవగాహన ఉంది. రోజులో మీ మొదటి గంట మీ రోజును నిర్ణయిస్తుంది. మీకు ఇవన్నీ చేయడం కొంచం కష్టంగా ఉంటే వేరే చాయిస్ తీసుకోండి. ఉదాహరణకు డాన్స్. డాన్స్ కూడా మీ రోజు ప్రారంభానికి, గొప్ప చాయిస్ అవుతుంది. ఈ డాన్స్, మీ హార్ట్ రేట్ నిర్వహించడమే కాకుండా, కాలరీలను కూడా కరిగిస్తుంది. ఎరోబిక్స్ కూడా మీకు గుడ్ చాయిస్ అవుతుంది. ఈ డాన్స్ ప్రధానంగా మానసిక ఆరోగ్యం మీద దృష్టి సారిస్తుంది. మానసిక ఆరోగ్యం బాగున్న వారికి శారీరిక ఆరోగ్యం కూడా తోడవుతుంది. కేవలం కండలు తిరిగిన శరీరం ఉంటేనే ఆరోగ్యం అని కాదు. కండలు తిరిగిన శరీరం ఉన్నా, సరైన రోగ నిరోధక శక్తి లేకుంటే, రోగాల పాలు కాక తప్పదని గ్రహించండి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి శారీరిక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్య సంరక్షణ కూడా ముఖ్యమైనదే.

మనం చేసే పని, ఎప్పుడూ ఫలితాల మీద ద్యాసతో చేసే కన్నా, ఇష్టంగా చేస్తే, ఫలితాలు వాటికవే వస్తాయని గుర్తుంచుకోండి. ఇష్టంతో చేసే పని, పనిలో మెళకువలు నేర్పుతుంది, మీరు స్టడీ చేయడానికి ఆసక్తిని పెంచుతుంది. క్రమంగా ఫలితాల సాధనకు సహాయపడుతుంది.

నిజానికి మన దేశంలో అనేకమంది శారీరిక సమస్యల దృష్ట్యానే కాకుండా, మానసిక సమస్యల కారణంగా కూడా హాస్పిటళ్ళ మెట్లు ఎక్కుతున్నారు. ఇది నిజంగా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే, మానసిక ఆరోగ్యం పరంగా సమయాన్ని కేటాయించలేకపోతున్నారు, సమయం ఉన్నా గాడ్జెట్లలో నిమగ్నమవుతున్నారు. శరీరం కనిపిస్తుంది, మనసు కనపడదు కాబట్టి. అంతేకాకుండా, అనేకమంది చుట్టూ ఉన్న మనుషుల గురించి, వారి సంతోషం గురించిన ఆలోచన కాకుండా, స్వార్ధంగా ప్రవర్తించేలా మానసిక స్థాయిలు పెరుగుతున్నాయి. ఇది వారి ఆలోచనలను తీవ్రతరం చేయడమే కాకుండా, మానసిక సమస్యలకు కూడా కారణంగా మారుతుంది.

కానీ పైన చెప్పినట్లు ఎంత దేహధారుడ్యం గల వ్యక్తి అయినా, సరైన మానసిక ఆరోగ్యం తోడవకుంటే అనేక సమస్యలను ఎదుర్కోక తప్పదు. అందుచేతనే ఈమధ్య ఎక్కువగా ప్రజలు కూడా డాక్టర్లు, శ్రేయోభిలాషులు, నిపుణుల సిఫార్సు మేరకు ద్యానాన్ని అభ్యసించడం ప్రారంభించారు.

ఈ ధ్యానం గురించి మీకు సరైన అవగాహన లేకుంటే, మీకు నేర్పించడానికి ప్లే స్టోర్, యాప్ స్టోర్లలో అనేక అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని వీడియోలను కూడా కలిగున్నాయి. అంతేకాక, మీరు సమయం కేటాయించగలిగితే మీ టైం ప్రకారం నిపుణులను సంప్రదించవచ్చు. రోజులో కొన్ని నిమిషాలపాటు ఇంట్లోనే ధ్యానాన్ని అభ్యసించవచ్చు. మీరు ప్రశాంతంగా కూర్చునేలా మీ ఇంటిలోనే ఒక మూలను లేదా, మీ పడక గదినే ఎంచుకోండి. మొదటి రోజు 5 నిమిషాలు చేయండి, తర్వాత కాలంలో నిడివి పెంచుకుంటూ వెళ్ళండి. చివరిగా కనీసం 20 నుండి 30 నిమిషాలపాటు ధ్యానం చేసేలా చూసుకోండి. ఈ అలవాటు మీలో ప్రశాంతమైన అనుభూతిని పెంచుతుంది. అంతేకాకుండా, మీకు నచ్చిన మెలోడీ సాంగ్స్ ప్లే చేస్తూ, లేదా ఆధ్యాత్మిక భోధనలు, మంత్రాలు ఉచ్చరిస్తూ కూడా ధ్యానం చేయవచ్చు. క్రమంగా మీ మానసిక శాంతికి నష్టం కలిగించే సమస్యల నుండి బయటపడవచ్చునని నిపుణులు చెప్తున్నారు.

కొన్ని అధ్యయనాల ప్రకారం, ధ్యానం అభ్యాసం చేస్తున్న వారిలో అనూహ్యంగా శారీరిక సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాయని, మందులు కూడా బాగా పనిచేశాయని తేల్చారు. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, మానసిక స్థైర్యం తోడు లేకపోతే, ఆ వ్యాధి తీవ్రత నెమ్మదిగా పెరుగుతుంటుంది. ఈ విషయం మనకు కూడా తెలుసు. పెద్దలు చెప్పినట్లు, సమస్య కన్నా, భయం ప్రమాదకరంగా ఉంటుంది. ఆ భయాన్ని, పిరికితనాన్ని తరమడానికి మీకు ధ్యానం ఖచ్చితంగా సహాయపడుతుంది.

అంతేకాకుండా, కేవలం సమూహంలో చేసే ధ్యానమే గొప్పదన్నట్లు చిత్రీకరించి, అందులో కొత్త విధానాలు పరిచయం చేస్తామని కొందరు ఈ ధ్యానాన్ని కూడా మార్కెట్ చేస్తున్నారు. అటువంటివి నమ్మకండి. కుటుంబంలోని వ్యక్తుల మద్య లేని సంతోషం తెలియని వాళ్ళ దగ్గర ఉంటుంది అనుకోవడం హాస్యాస్పదమే అవుతుంది. మీరు మీ ఇంట్లోనే యదేచ్చగా ఒక ప్రదేశం ఎంచుకుని, మీకు ఇష్టం ఉన్న రీతిలో మానసిక ప్రశాంతత ఉండేలా పాటలు వింటూ ధ్యానాన్ని అభ్యాసం చేయొచ్చు. మీరు అప్లికేషన్ల ద్వారానే కాకుండా, కొన్ని యూట్యూబ్ వీడియోల ద్వారా కూడా దీని గురించి తెలుసుకోవచ్చు. మీరు మీలా బ్రతకడానికి ప్రయత్నించడమే గొప్ప ధ్యానం. ఇతరుల గురించిన ఆలోచనలు, గతంలో గడిచిన చేదు జ్ఞాపకాలను పక్కన పెట్టండి. ప్రస్తుతం, వర్తమానం గురించిన ఆలోచన చేయండి. మీరు ఈరోజు ఉన్న విధానమే, భవిష్యత్తులో కొన్ని మార్పులను తీసుకువస్తుందని మరువకండి. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు, ఆర్ధిక, సామాజిక సమస్యలతో ఉన్నవారే కాకుండా సాధారణ ప్రజలు కూడా ధ్యానాన్ని అభ్యసించడం ద్వారా, ఆరోగ్యకరమైన జీవన విధానానికి మార్గం చూడగలుగుతారు. మీరు బరువు తగ్గాలన్నా, లేదా మీ బరువును నిర్వహించాలని భావిస్తున్నా, మీకు ధ్యానం ఖచ్చితంగా సహాయం చేయగలదు. మీరు ఎన్ని ప్రణాళికలు చేసినా, మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు, కొన్ని సాధించలేరు. కాబట్టి, ముందుగా మానసిక ఆరోగ్యాన్ని పెంచేందుకు ప్రయత్నించాల్సిందిగా డాక్టర్లు, వెల్నెస్ నిపుణులు చెప్తున్నారు.