WorldWonders

మీ కుమ్మక్కుల హక్కులు గురించేనా?

Nirbhaya's Mother Slams Jail Officials And Delhi Govt For Delaying Hanging Culprits

తీహాడ్‌ జైలు అధికారుల నిర్లక్ష్యానికి తాము ఎందుకు బాధపడాలని నిర్భయ తల్లి ఆశాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్భయ దోషులను ఈనెల 22న ఉరితీయలేమని, తేదీ మార్చాల్సిందిగా తీహాడ్‌ జైలు అధికారులు దిల్లీ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయంపై ఆమె స్పందించారు. ‘డెత్‌ వారెంట్‌ తేదీని మార్చకూడదు. దోషులను మరణశిక్ష నుంచి తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. నా ఒక్కగానొక్క కూతురుని  దారుణంగా హత్య చేశారు. తనకు న్యాయం చేయాలని కొన్నేళ్లుగా నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. తీహాడ్‌ జైలు అధికారులు, దిల్లీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి నేనెందుకు బాధ అనుభవించాలి? వాళ్లకు హక్కులు ఉంటే.. మరి ఏడేళ్ల క్రితం హత్యకు గురైన నా కూతురికి న్యాయం చేయమని కోరే హక్కు మాకు ఉంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ దోషి ముకేశ్‌ వేసిన క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున జైలు నిబంధనల ప్రకారం ఉరిశిక్ష అమలు చేయలేమంటూ తీహాడ్‌ జైలు అధికారులు కోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఉరిశిక్ష విధించే తేదీలను మార్చాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆప్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే నిర్భయ దోషులకు ఉరి మరింత ఆలస్యమవుతోందని ఆయన ఆరోపించారు.