DailyDose

నిర్భయ దోషుల క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరణ-నేరవార్తలు

Indian President Rejects Nirbhaya Mukhesh Petition

* నిర్భయ కేసులో దోషి ముఖేష్‌సింగ్‌ క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. ముఖేశ్‌ సింగ్‌ క్షమాభిక్ష అర్జీని నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ హోంశాఖకు పంపిచారు. హోంశాఖ వెంటనే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపింది. తాజాగా రాష్ట్రపతి ముఖేష్‌సింగ్‌ దరఖాస్తును తిరస్కరించారు. ముఖేష్ సింగ్ క్షమాభిక్ష దరఖాస్తును ఒక వేళ రాష్ట్రపతి తిరస్కరించినా దోషులకు కనీసం 14 రోజులు గడువు ఇవ్వాలన్న నిబంధన ఉండటంతో ఈ నెల 22న ఉరి శిక్ష అమలు సాధ్యం కాదని ఢిల్లీ ప్రభుత్వం, తీహార్‌ జైలు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో నిందితులు కావాలనే తమ ఉరిని వాయిదా వేసేందుకు క్షమాభిక్ష, క్యురేటివ్‌ పిటిషన్ల పేరుతో నాటకాలాడుతున్నారని నిర్భయ తల్లిదండ్రులు, పలువురు అధికారులు, సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముఖేశ్‌ క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కేంద్రానికి సిఫారసు చేశారు.

* నందిగామ వద్ద జొన్నలగడ్డ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

* కాకినాడలో నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్ల అఘాయిత్యం. టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి తల్లి. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను కాకినాడ జీజీహెచ్ కు తరలించిన పోలీసులు. పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు. పోలీసుల అదుపులో నిందితులు.

* 1993 ముంబై వరుస పేలుళ్ల దోషి జలీస్‌ అన్సారీ కనిపించకుండా పోయాడు.68 ఏళ్ల జలీస్‌ అన్సారీ ముంబై వరుస పేలుళ్ల కేసులో రాజస్థాన్‌లోని అజ్మీర్‌ కేంద్రకారాగారంలో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.ఇటీవలే అతడు 21 రోజుల పేరోల్‌పై బయటకు వచ్చాడు.అయితే పెరోల్‌పై ఉన్న సమయంలో ప్రతీ రోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జలీస్‌ అన్సారీ అగ్రిపడా (ముంబై) పోలీస్‌స్టేషన్‌లో హాజరవ్వాల్సి ఉంటుంది.అయితే గురువారం రోజు జలీస్‌ అన్సారీ పీఎస్‌కు రాలేదు.దీంతో అతడి కొడుకు జైద్‌ అన్సారీ తన తండ్రి జలీస్‌ అన్సారీ కనిపించకుండా పోయాడని పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు జలీస్‌ అన్సారీ కోసం ఆపరేషన్‌ ప్రారంభించారు. పెరోల్‌పై ఉండి కనిపించకుండా పోయిన ముంబయి పేలుళ్ల సూత్రధారి జలీస్‌ అన్సారీని ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. కాన్పూర్‌లోని ఓ మసీదు నుంచి బయటకు వస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు యూపీ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెల్లడించారు. అన్సారీని లఖ్‌నవూ తరలించినట్లు తెలిపారు. ‘డాక్టర్‌ బాంబ్‌’గా పేరున్న వైద్యుడు అన్సారీ ముంబయి నగరంలోని మొమిన్‌పురా ప్రాంతంలోని తన నివాసం నుంచి గురువారం కనపడకుండా పోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ముంబయిలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.