Business

తేజస్ రైలు ప్రారంభం

Indian Railway Launches Tejas Express Train

తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభమైంది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్‌గోయల్‌ రైలును అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని, రాష్ట్ర మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పీయుష్‌గోయల్‌ మాట్లాడుతూ… రైలు నడిచే టైంటేబుల్‌ను ప్రకటించామని, జనవరి 19వ తేదీ నుంచి రెగ్యులర్‌గా వారానికి 6 రోజలు రైలు నడుస్తుందని తెలిపారు.పూర్తి ఏసీతో కూడిన ఈ రైలు 736 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటుంది.ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌ ముబైల్‌ యాప్‌లో టికెట్‌ రిజర్వేషన్‌ తీసుకోవచ్చు.తత్కాల్‌ కోటా, ప్రీమియం తత్కాల్‌ కోటా ఇందులో లేవు. జనరల్‌ కోటా, విదేశీ టూరిస్ట్‌ కోటా మాత్రమే ఉన్నాయి.ప్రయాణికులందరికీ ఐఆర్‌సీటీసీ ద్వారా రూ.25 లక్షల ఉచిత భీమా కల్పిస్తున్నాం. రైలు ఆలస్యం అయితే గంట ఆలస్యానికి రూ.100, రెండు గంటల ఆలస్యానికి రూ.250లను ఐఆర్‌సీటీసీ పరిహారంగా చెల్లిస్తుంది.ప్రతీ ప్రయాణికుడికి ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ బాటిల్ కు అదనంగా ప్రతి కోచ్‌లో ఆర్‌వో వాటర్‌ ఫిల్టర్‌ను ఏర్పాటు చేస్తున్నాం.రైలులో ప్రయాణించాలనుకునే వారు 60 రోజుల ముందు నుంచి రిజర్వేషన్‌ చేసుకోవచ్చని వెల్లడించారు.రైలు అహ్మదాబాద్‌ నుంచి ఉదయం 6:40 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 13:10 గంటలకు ముంబై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది.తిరిగి ముంబై సెంట్రల్‌ నుంచి 15:40 గంటలకు బయలుదేరి 21:55 గంటలకు అహ్మదాబాద్‌ చేరుకుంటుంది.నదియాడ్‌, వడోదర, భారుచ్‌, సూరత్‌, వాపీ, బొరివలి స్టేషన్‌లలో రైలు ఆగుతుంది.

Image result for tejas train

Image result for tejas train