NRI-NRT

హాంగ్‌కాంగ్ ప్రవాసుల సంక్రాంతి సందడి

Hong Kong Telugus Celebrate Sankranthi 2020

హాంగ్ కాంగ్ లో తెలుగువారు సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. తెలుగు సాంస్కృతికోత్సవంలో పిల్లల నృత్య-నాటికలు భాగంగా కూచిపూడి, భరతనాట్యం, కథక్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలుగు సామెతలు, శ్లోకాలు, పద్యాలు, లవకుశ నాటిక, చిన్నారుల డాన్స్ అలరించాయి. భోగి సందర్భంగా లాంటౌ ఐలాండ్ లోని టుంగ చుంగ్ లో ఉన్న చిన్నారులకు భోగిపండ్లు పోశారు. జయ పీసపాటి మాట్లాడుతూ ఫిబ్రవరిలో సాముహిక సత్యనారయణ వ్రతం, UNESCO వారి 8అవ peacemakers cultural performanceలో తాము ఐదవ సారి తెలుగు సమాఖ్య బూత్ నిర్వహిస్తున్నట్టు మరియు ఇండో – చైనీస్ ఫ్యూషన్ డాన్స్ , కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇండో చైనీస్ 70 సంవత్సరాల రాజకీయ సంబంధాల వార్షికోత్సవ వేడుకలకు అనుబంధంగా కన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా మరియు హాంగ్ కాంగ్ టూరిజం బోర్డ్ వారి సహకారంతో పాల్గొంటున్నామని తెలిపారు. ప్రియాంక చౌహాన్ సహకారంతో స్థానిక రేడియో టెలివిషన్ హాంగ్ కాంగ్ లో “యాత్ర – ఇన్క్రెడిబుల్ ఇండియా” అనే రేడియో కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టుగా పేర్కొన్నారు. మార్చిలో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.