Politics

వైకాపా మూడు రాజధానులపై కేంద్రం జోక్యం చేసుకుంటుంది

Sujana Chowdary Comments On YSRCP Three Capital Strategy

వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులపై ముందుకెళ్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని భాజపా ఎంపీ సుజనాచౌదరి స్పష్టం చేశారు. శనివారం దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎవరూ ఊరుకోరని అన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిపద్ధతి కాదన్నారు. అధికారంలో ఎవరు ఉంటే వారికి అనుగుణంగా అధికారులు పనిచేయడం సరికాదన్నారు. ఎయిమ్స్‌, నిఫ్ట్‌ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయని తెలిపారు. హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్‌ వంటివి ఒకే చోట ఉండాలని విభజన చట్టం సెక్షన్‌-6లో స్పష్టంగా ఉందన్నారు. ఇకనైనా వైకాపా ప్రభుత్వం పరిపాలనపై దృష్టిపెట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజధాని మారిస్తే చూస్తూ ఊరుకోమని, రాష్ట్ర ప్రజల తరఫున పోరాడతామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని సుజనాచౌదరి తెలిపారు.