Devotional

వారణాసిలో ISI ఏజెంట్ అరెస్ట్

ISI Agent Arrested In Varanasi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసీలో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంటును సోమవారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్), మిలటరీ ఇంటలిజెన్స్ విభాగం అధికారులు కలిసి వారణాసి నగరంలో పాక్ ఐఎస్ఐ ఏజెంటును అరెస్టు చేశారు. చిట్టూపూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల రషీద్ అహ్మద్ ఐఎస్ఐ ఏజెంటుగా పనిచేస్తూ దేశంలోని ఆర్మీ బేస్ లకు చెందిన ఫోటోలు, వీడియోలను తన మొబైల్ ఫోన్ ద్వార పాక్ ఐఎస్ఐకు పంపించారని ఉత్తరప్రదేశ్ పోలీసులు చెప్పారు. రషీద్ అహ్మద్ గతంలో రెండు సార్లు పాకిస్థాన్ దేశంలో పర్యటించి ఐఎస్ఐ ఏజెంట్లను కలిసి వచ్చారని యూపీ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఐపీసీ సెక్షన్ 123 ప్రకారం పాక్ ఐఎస్ఐ ఏజెంటు అయిన రషీద్ అహ్మద్ ను అరెస్టు చేసి ఇంటరాగేట్ చేస్తున్నామని ఏటీఎస్ అధికారులు చెప్పారు.