Food

ఆస్ప్రిన్ తీసుకుంటే క్యాన్సర్ నుండి రక్షణ

Aspirin Prevents Not Only Your Heart But From Cancer As Well

ఆస్పిరిన్, చాలా కాలంగా గుండె జబ్బులు ఉండే వారు వేసుకుంటారు. కానీ, ఈ ట్యాబ్లెట్‌లో కోలోరెక్టల్ అంటే పెద్దపేగు కాన్సర్ కణితిలను తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం పరిశోధనలు జరుపుకుంటున్న ఈ స్టడీ సక్సెస్ అయితే చాలారకాల కాన్సర్లకు చెక్ పెట్టొచ్చు.ఆస్పిరిన్, ఈ ట్యాబ్లెట్ గురించి చాలా మందికి తెలుసు. దీనిని ఎక్కువగా గుండెకు సంబంధించిన వ్యాధుల ట్రీట్‌మెంట్ కోసం వాడతారు. కాకపోతే, దీనిని ఎక్కువగా వాడినప్పుడు కొన్ని కడుపుకు సంబందించిన సమస్యలు తలెత్తుతుంటాయి. అందువల్లే, డాక్టర్లు కూడా ఆస్పిరిన్ ఇచ్చే ముందు ఎన్నో జాగ్రత్తలు చెప్తుంటారు. ఎక్కువగా ఆస్ప్రిన్ వాడడం కూడా మంచిది కాదని సైంటిస్ట్‌ల అభిప్రాయం. నిజానికి ఈ ఆస్పిరిన్, అనేక రకాల కాన్సర్ ట్రీట్‌‌మెంట్‌లలో కూడా వాడుతుంటారు.
**ఆస్పిరిన్ ఉపయోగాలు
కేవలం గుండె ఆరోగ్యానికే కాకుండా, కొలొరెక్టల్ క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగపడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ఆస్పిరిన్ శరీరంలో కాన్సర్ కణితులు పెరగడాన్ని తగ్గిస్తుందని, అంతేకాకుండా, వ్యాధి తిరిగిరాకుండా చూస్తుందని వారు చెప్తున్నారు.కడుపు, మెదడు రక్తస్రావం వంటి ప్రమాదమైన సమస్యలు పెరగకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి తగిన మోతాదులో ఆస్పిరిన్ ఉపయోగించడం మంచిదని పరిశోధన తెలిపింది.
“క్యాన్సర్, అల్జీమర్స్, పార్కిన్సన్, ఆర్థరైటిస్ వంటి మంటతో కూడిన దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించే లక్షణాలు ఉన్న కారణంగా ఆస్పిరిన్ సూచించదగిన డ్రగ్ గా ఉంటుందని సిటీ ఆఫ్ హోప్ క్లినిక్, యుఎస్., రీసెర్చర్, భారత సంతతికి చెందిన అజయ్ గోయెల్ చెప్పారు.ఈ ఆస్పిరిన్ ఎక్కువగా వాడడం మూలంగా, కడుపులోని శ్లేష్మ పొర సమస్యకు గురికావడం, ఇన్ఫ్లమేటరీ సమస్య తలెత్తడమేకాక, కొన్ని జీర్ణ సంబంధ సమస్యలు కలుగుతాయి. అందువలన, ఇది మంచి డ్రగ్ అయినప్పటికీ డాక్టర్లు ఆస్పిరిన్ విషయంలో ఒకడుగు వెనక్కి వేస్తున్నారు.”ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొలొరెక్టల్ క్యాన్సర్‌కు ట్రీట్మెంట్ చేయడానికి, తగ్గించడానికి “రోజువారీ అవసరమైన ఆస్పిరిన్ సరైన మొత్తాలని” కనుక్కోడానికి మేము స్టడీ చేస్తున్నాము” అని గోయెల్ అంటున్నారు..కార్సినోజెనిసిస్ జర్నల్‌లో వచ్చిన ఒక స్టడీ ప్రకారం, “యుఎస్, ఐరోపాలలో జరిగిన క్లినికల్ ట్రయల్స్‌లో ఆస్పిరిన్ వాడకం మీద, మౌస్ మోడల్ అంటే ఎలుకల మీద ప్రయోగాలు చేసి, మ్యాథమేటికల్ మోడలింగ్‌ ఉపయోగించి కనుక్కున్న వివరాలను ప్రచురించింది.మైక్రోసాటిలైట్ అస్థిరత ఉన్న కణితులు, PIK3CA జన్యువులో కనపడ్డ కొన్ని అసాధారణ మార్పులను దృష్టిలో ఉంచుకుని, నాలుగు కొలొరెక్టల్ క్యాన్సర్ సెల్స్ మీద మూడు వేరువేరు మోతాదులను ఉపయోగించి, ఆస్పిరిన్ పరీక్ష చేయడం జరిగింది. ఈ ప్రయోగాలు ఎండోమెట్రియల్, పెద్దప్రేగు, రొమ్ము క్యాన్సర్ల ప్రమాదాలతో ముడిపడి ఉందని తేల్చింది.
**432 ఎలుకలపై ప్రయోగం..
లో డోస్ ఆస్పిరిన్ అంటే 15mg / kg, మీడియం డోస్ ఆస్పిరిన్ అంటే 50mg / kg, హై డోస్ ఆస్పిరిన్ అంటే 100mg / kg – డోసేజ్లను ఎలుకల మీద ప్రయోగించడం జరిగింది. ఎలుకలు మనుషులతో సమానమైన జీవ క్రియలను, పోలిన శరీర అవయవాలను కలిగి ఉంటాయని అందరికీ తెలిసిందే. ఇందులో మూడు ఎలుకలలోని కణితులకు మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు రోజుల పరీక్ష చేశారు.ఈ రీసెర్చర్స్ “సెల్యులార్ అపోప్టోసిస్” ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ కూడా పరిశీలించారు. ఇందులో సెల్ లైన్లలో కణితులలో చనిపోవడానికి సిద్దంగా ఉన్న కణాల శాతం పెరిగినట్లు కనుగొన్నారు.ఏదేమైనప్పటికీ, వినియోగించబడిన ఆస్పిరిన్ పరిమాణం మీదనే కొలొరెక్టల్ సెల్ లైన్లలోని కణాల మరణం ఆధారపడి ఉంటుందని తేల్చారు. అంతేకాక, ఈ కణాల డొమినో ప్రభావం కూడా పెరుగుతుందని చెప్పారు.ఆస్పిరిన్ డోస్ పెరిగేకొద్దీ, కణాల మరణం కూడా పెరుగుతూ ఉందని పరిశోధనలో తేలింది. అంటే, కణితి కణాలు చనిపోయే అవకాశం ఉంటుంది, అంతేకాక, ఈ కణితి విస్తరించే అవకాశం కూడా ఉండదు.ముఖ్యంగా, PIK3CA జన్యువులను కలిగి ఉన్న జంతువుల నమూనాలలో కణితుల పెరుగుదల తగ్గించేందుకు తక్కువ మోతాదులో ఆస్పిరిన్ ఇవ్వడం ప్రభావవంతంగా ఉంటుందని సైంటిస్ట్స్ గమనించారు.”డేటాను వివరించడానికి, మేథమేటికల్ మోడలింగ్ను ఉపయోగించేందుకు, హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్న, కొంతమంది వ్యక్తులతో కలిసి పని చేస్తున్నాము. ఈ విధానం, ఎలుకల మీద జరిపిన పరీక్షలకు దగ్గర పోలికలను ఇవ్వడం కారణంగా, మాకు రిసల్ట్ మీద నమ్మకం పెరిగింది. అంతేకాకుండా, భవిష్యత్తులో హ్యూమన్ ట్రయల్ డిజైన్లకు దారి సులభం చేస్తుంది” అని గోయెల్ అంటున్నారు.ఈ పరీక్షలు సక్సెస్ అయితే, అనేక కాన్సర్ వ్యాధులకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని డాకర్లు, సైంటిస్టుల ఆలోచన. అంతేకాక, కాన్సర్ చికిత్స కూడా సులభం అవుతుంది. ఆస్పిరిన్, మందులు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరంగా ఉంటాయి. ముఖ్యంగా లైఫ్ స్టైల్ మార్పులు అవసరం. ఆహారం, వ్యాయామం వంటివి డాక్టర్లు చెప్పినట్లు నడుచుకోవాలి. అప్పుడే, ఆస్పిరిన్ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తుంది. డాక్టర్లు టెస్ట్స్ ఆధారంగానే ఆస్పిరిన్ డోసేజ్ సజెస్ట్ చేస్తారు. కాబట్టి, వారి అనుమతి లేకుండా ఆస్పిరిన్ వాడడం మంచిది కాదు. కొందరు, ఎటువంటి మందుల చీటీ లేకుండానే ఆస్పిరిన్ తెచ్చుకుని వాడేస్తుంటారు. ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఏ మందులైనా డాక్టర్ల సూచన ప్రకారమే వాడాలని గుర్తుంచుకోండి.
2. చర్మం నవయవ్వనంగా…
వంటింట్లో లభించే తేనె, పాలు, యోగర్ట్లో చర్మ సౌందర్యాన్ని పెంచే గుణాలు బోలెడు. వీటితో ఇంటివద్దనే చర్మాన్ని అందంగా మార్చుకోవడం ఎలాగో చూద్దాం.
*తేనె:
ఇది శక్తిమంతమైన సహజ మాయిశ్చరైజర్ . తేమను అందించి చర్మాన్ని పొడిబారనీయదు. పొడిచర్మం గలవారు తేనె రాసుకుని 20 నిమిషాలయ్యాక నీళ్లతో శుభ్రం చేసుకుంటే చర్మం పొడిబారదు. సగం టీస్పూన్ తేనెలో, టీస్పూన్ రోజ్వాటర్, టీస్పూన్ పాలపొడి వేసి పేస్ట్లా చేసుకొని ముఖానికి రుద్దుకున్నా కూడా చర్మం తాజాగా కనిపిస్తుంది. జిడ్డు చర్మం ఉంటే 100 ఎం.ఎల్ రోజ్వాటర్, టీస్పూన్ నిమ్మరసం, సగం టీస్పూన్ తేనె వేసి కలిపి ఫ్రిజ్లో కొద్దిసేపు ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతిమంతంగా మారుతుంది.
*పాలు:
దీనిలోని ప్రొటీన్లు, కొవ్వులు, లవణాలు చలికాలంలో చర్మానికి సోయగాన్నిస్తాయి. గాజు సీసాలో సగం కప్పు చల్లని పాలు, అయిదు చుక్కల ఆలివ్, నువ్వుల లేదా పొద్దుతిరుగుడు నూనె వేసి మిక్స్ చేసి ఫ్రిజ్లో పెట్టాలి. దీనిలో ముంచిన కాటన్బాల్తో ముఖం మీద నెమ్మదిగా రుద్దుకోవాలి. ఇలాచేస్తే ముఖం మీది మలినాలు, నల్లమచ్చలు మాయం అవుతాయి.
*యోగర్ట్:
దీనిలోని లాక్టిక్ఆమ్లం చర్మం పీహెచ్ను ఒకేస్థాయిలో ఉంచుతుంది. రెండు టీస్పూన్ల యోగర్ట్లో చిటికెడు పసుపు వేసి ముఖానికి రాసుకోవాలి. పసుపులోని యాంటీసెప్టిక్ గుణాలు ఇన్ఫెక్షన్లను నివారించి చర్మానికి
మెరుపునిస్తాయి.