DailyDose

గల్లాకు బెయిల్-నేరవార్తలు

Galla Jayadev Gets Bail-Telugu Crime News

*గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్అసెంబ్లీ ముట్టడి సందర్భంగా పోలీసులు దుర్మార్గం గా వ్యవహరించారుపోలీసులే రాళ్ళు రువ్వి లాఠీ చార్జి చేశారు పోలీసుల వైఖరి సరైంది కాదని ప్రశ్నించినందుకు నన్ను అరెస్టు చేశారుపోలీసులు దారుణంగా గోళ్ళుతో రక్కారునా చేతులను పోలీసులు వెనక్కి విరిచారుపోలీసులు దాడిలో గాయపడిన నాకు కనీసం వైద్య సహాయం కూడా అందించలేదునా పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారు
నన్ను అదుపులోకి తీసుకున్న 15గంటల పాటు వ్యాన్ లో జిల్లా మొత్తం తిప్పారుశాంతియుతమైన ప్రదర్శన చేస్తే ఇలా వేదిస్తారా..పార్లమెంటు సభ్యుడిని నన్ను వేదిస్తే సామాన్య ప్రజల రైతులు పరిస్థితి ఏంటిపోలీసులు తెలివిగా సి అర్ పి యఫ్ బలగాలు తో లాఠీ చార్జీ చేయించారుకేంద్ర బలగాలు మీద చర్యలు ఉండవని ఈ విధంగా వ్యవహరించారు
* పత్రిక విలేకరులపై పాలకుల పక్షపాతం ఈనాటిది కాదు. ప్రభుత్వాల్ని ప్రశ్నించినందుకు ఎన్నో నిషేధాల్ని ఎదుర్కొన్నారు. ఎన్నో భౌతిక దాడుల్ని గురయ్యారు. అంతే కాదు ఎంతో మంది జర్నలిస్టులు తమ ప్రాణాల్ని సైతం పోగొట్టుకున్నారు. మీడియా రంగం పెరిగింది, సాంకేతికత పెరిగింది. సామాజిక మీడియా విస్తృతిలోకి వచ్చింది. అయినప్పటికీ జర్నలిస్టులపై దాడులు తగ్గడం లేదు. యునెస్కో విడుదల చేసిన వివరాల ప్రకారం 2019 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 56 మంది హత్యకు గురయ్యారు. అంతకు ముందు యేడాదితో పోల్చుకుంటే కాస్త తగ్గినప్పటికీ మీడియాపై జరుగుతున్న దాడులు అదే స్థాయిలో కొనసాగుతుండడం శోచనీయం.ప్రపంచ వ్యప్తంగా చూసుకుంటే లాటిన్ అమెరికా, కరేబియన్ లాంటి ప్రాంతాల్లో జర్నలిస్టులకు అనేక ఆంక్షలు ఉన్నాయి. ఇక చైనా, ఉత్తర కొరియా, రష్యా లాంటి దేశాల్లో ప్రభుత్వాల కనుసన్నలకు అనుగుణంగానే మీడియా సంస్థలు పని చేస్తున్నాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంత తీవ్ర స్థాయిలో కాకపోయినా ప్రపంచ వ్యాప్తంగా జర్నలిస్టులపై, మీడియా సంస్థలపై ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు దిగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలపై విమర్శలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలే కాకుండా ఇతరులు కూడా జర్నలిస్టులపై దాడులకు, హత్యలకు పాల్పడుతున్న సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి.
*టెక్కలి మండలంచల్లపేటలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. సెల్ఫీలు దిగుతూ ఆత్మహత్య చేసుకుంది. 
* అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. రేగొండ మండలం గోరి కొత్తపల్లి గ్రామానికి చెందిన గోగులోతు రాజు, పెరుమండ్ల సతీష్ అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో.. జిల్లా అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు AP36 X3088 ఆటోను అదుపులోకి తీసుకొని, అందులోని 48 ఎనిమిది బస్తాల్లో ఉన్న 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఆటోను సీజ్ చేశారు. బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసిన సిసిఎస్ టాస్క్ ఫోర్స్ సీఐ జి.మోహన్, ఎస్సై రూపారెడ్డి, సిబ్బంది గోపాల్ రెడ్డి, సత్యనారాయణ.. నిందితులను, బియ్యాన్ని రేగొండ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
* సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 40 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి.
* 2 కోట్ల రూపాయల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. పెద్ద అంబర్‌పేట వద్ద వరిపొట్టు లోడుతో వస్తున్న లారీనీ.. విశ్వనీయ సమాచారం మేరకు డీఆర్‌ఐ(డైరెక్టర్‌ ఆఫ్‌ ఇంటలిజెన్స్‌) అధికారులు తనిఖీ చేశారు.
* పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర రాజధాని కలకత్తాలో డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టయింది. విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని పైక్‌పరా నుంచి గుట్టుగా మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న ఓ గృహంలో ఎస్‌టీఎఫ్‌(స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌) అధికారులు సోదాలు నిర్వహించారు.
* నేపాల్‌లోని దామన్‌లో కేరళకు చెందిన 8 మంది పర్యాటకులు మృతి చెందారు. ఓ హోటల్‌ గదిలో వారు మృతి చెందినట్లు మక్వాన్‌పూర్‌ ఎస్పీ సుశీల్‌ సింగ్‌ రాథోడ్‌ స్పష్టం చేశారు.
* ఎన్నో ఆశలు, కలలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టాలని భావించిన ఓ జంటకు ‘తల్లిదండ్రుల’ నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. వరుడి తండ్రితో కలిసి వధువు తల్లి పారిపోవడంతో వారి పెళ్లి ఆగిపోయింది. మానవ సంబంధాలను మంటగలిపిన ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాలు… కటార్‌గ్రాంకి చెందిన ఓ వ్యక్తి(48), నవ్సారీకి చెందిన వివాహిత(46) గతంలో ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉండేవారు. ఈ క్రమంలో వారి కుటుంబాల మధ్య మంచి స్నేహం ఏర్పడింది.
* అందొల్ మండలం రాంసానిపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ (21). బీటెక్ చదువుతున్న విద్యార్థి, అన్నాసాగర్ చెరువు వద్ద బైక్ చెప్పులు విడిచి, చెరువులో దూకి పడట్టు అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు.
అన్నాసాగర్ చెరువులో రామకృష్ణ కోసం గాలిస్తున్నా గజ ఈతగాళ్ళు…
*పాకిస్తాన్‌కు భార‌త ఆర్మీ‌కి చెందిన కీల‌క స‌మాచారాన్ని చేర‌వేస్తు‌న్న ఐఎస్ఐ ( ఇంట‌ర్ స‌ర్వీ‌సెస్ ఇంట‌లిజెన్స్ ) ఏజెంట్‌ను యూపీ ఉగ్ర నిరోధక ద‌ళం అదుపులోకి తీసుకుంది. సైనిక స్థా‌వ‌రాల‌తో సాటు సీఆర్పీఎఫ్ స్థా‌వ‌రాలు, ఫోటోలు, వీడియోల‌ను పాక్‌కు పంపిన‌ట్లు అధికారులు గుర్తించారు. అరెస్ట్ చేసిన వ్య‌క్తిని ర‌షీద్ అహ్మ‌ద్‌గా గుర్తించారు. అయితే అత‌ని పూర్తి వివ‌రాలను అధికారులు సేక‌రించే ప‌నిలో ప‌డ్డా‌రు…
*గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలోని రఘువీర్ టెక్స్‌టైల్ మార్కెట్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
*మతి స్థిమితం లేని వ్యక్తి చేసిన పని పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. ఆ వ్యక్తి ఏకంగా పెట్రోలింగ్‌ వాహనాన్నే ఎత్తుకెళ్లి ప్రమాదానికి గురిచేశాడు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమ వాహనాన్ని తీసుకెళ్లే ధైర్యం ఎవరికి ఉంటుందనే దీమాతో తాళాలు వాహనానికే వదిలేసిన పోలీసులు.. చివరకు కంగారుతో పరుగులు తీయాల్సి వచ్చింది.
*మా కంపెనీ ద్వారా విక్రయిస్తున్న అత్తరు అమ్మకాలతో రూ.కోట్లలో లాభాలొస్తున్నాయి.. స్టాక్ మార్కెట్లోనూ షేర్ విలువ పెరుగుతోంది.. ఇందులో పెట్టుబడులు పెట్టండి’’ అంటూ మోసం చేసిన ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
*కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో సోమవారం బాంబు కనిపించడం కలకలం సృష్టించింది. టికెట్ కౌంటర్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి విడిచి వెళ్లిన ఓ ల్యాప్టాప్ బ్యాగులో కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) సిబ్బంది దాన్ని గుర్తించారు
*నిర్భయ దోషి పవన్ గుప్తా వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భానుమతితో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ ప్రారంభించింది. నిర్భయ కేసు సమయంలో దోషి పవన్ గుప్తా వయసు 17 సంవత్సరాల ఒక నెల 20 రోజులని అతడి తరఫు న్యాయవాది ఏపీ సింగ్ న్యాయస్థానానికి వెల్లడించారు
*జమ్మూకశ్మీర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల్ని హతమయ్యారు. షోపియాన్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాబలగాలు వారిని మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు.
*సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ప్రవాస భారతీయ వ్యాపారవేత్త సి.సి.థంపీని ఈడీ అరెస్టు చేసింది. విదేశాల్లోని అక్రమ ఆస్తుల కొనుగోళ్ల వ్యవహారంలో ఈ చర్య చేపట్టింది.
*కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్లో భూ సంస్కరణల విభాగ అథారిటీ అధికారిగా పనిచేస్తున్న దాసరి ప్రశాంతి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డారు
*రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత కేసులో ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 27న తుది తీర్పు వెలువరించనుంది. నవంబరు 24న కుమురంభీం జిల్లా లింగాపూర్ సమీపంలో సమతపై షేక్బాబు, షేక్ షాబోద్దీన్, షేక్ మఖ్ధుం హత్యాచారం చేశారు. కేసు విచారణ కోసం డిసెంబరు 11న ఆదిలాబాద్లో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. పోలీసులు నిందితులపై ఇదే నెల 14న అభియోగపత్రం దాఖలు చేశారు. 44 మంది సాక్షులను పేర్కొన్నప్పటికీ న్యాయస్థానంలో డిసెంబరు 23 నుంచి 31 వరకు 25 మందిని విచారించారు. ఈ నెల 7, 8 తేదీల్లో ప్రాసిక్యూషన్ వాదనలు కొనసాగాయి. డిఫెన్స్ న్యాయవాది జనవరి 10న వాదనలు ప్రారంభించారు. సోమవారం వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 27న తుది తీర్పు వెలువరించటానికి నిర్ణయించింది
*గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలోని రఘువీర్ టెక్స్టైల్ మార్కెట్లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
*కర్నూలు జిల్లా ఆదోనిలో క్రికెట్ బంతి బలంగా తగలడంతో మైనుద్దీన్(12) అనే బాలుడు శుక్రవారం మృతిచెందాడు.
*పెరోల్పై ఉండి కనిపించకుండా పోయిన ముంబయి పేలుళ్ల సూత్రధారి జలీస్ అన్సారీని ఉత్తర్ప్రదేశ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కాన్పూర్లోని ఓ మసీదు నుంచి బయటకు వస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.
*యాదాద్రి జిల్లా హాజీపూర్ గ్రామంలో చోటుచేసుకున్న వరుస హత్య కేసుల్లో ఈ నెల 27న తీర్పును వెలువరించనున్నట్లు పోక్సో కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. ముగ్గురు బాలికలను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ రెడ్డిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నెల 8వ తేదీ నాటికి ఒక హత్య కేసుకు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. మరో రెండు హత్యల కేసుల్లో వాదనలు వినకుండానే ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్నట్లు పోక్సో కోర్టు న్యాయమూర్తి తెలిపారు.
*మొక్కలకు నీళ్లు పడుతున్నట్టు నటిస్తూ సిబ్బంది కళ్లుగప్పి రిమాండ్ ఖైదీ కల్వకుర్తి ఉపకారాగారం నుంచి శుక్రవారం పరారయ్యాడు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం జీడిపల్లికి చెందిన బాషమోని సైదులు కల్వకుర్తి పట్టణంలో అద్దె ఇంట్లో ఉంటూ చాలాకాలంగా నేరాలకు పాల్పడుతున్నాడు.
*పార్కులో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ప్రహరీపై పడిపోవడంతో బాలుడి చేతిలోకి ఇనుప చువ్వ చొచ్చుకుపోయి గంటపాటు నరకయాతన అనుభవించాడు. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
*బీహార్ రాష్ట్రంలోని ముంగేర్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణహత్యకు గురయ్యారు. తల్లి, భార్యతో సహా ముగ్గురు పిల్లలను చంపిన ఉన్మాది…ఆపై భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడటంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
*సంక్రాంతి పండగ రోజు దావత్ చేసుకుందామని నమ్మించి స్నేహితుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్యచేసిన సంఘటన సంచలనం రేకిత్తించింది. శరీరం నిండా రక్తం మరకలు, కత్తితో నిందితుడు హల్చల్ చేసిన ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో చోటుచేసుకుంది.
*మధ్యప్రదేశ్లోని బింద్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. కాల్ సెంటర్లో పనిచేసే ఓ వ్యక్తికి ఆదాయ పన్ను శాఖ నుంచి రూ.3.49కోట్ల పన్ను జరిమానా నోటీసు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది.
*పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందేల సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చింతలపూడి మండలంలోని చింతంపల్లి గ్రామంలో కోడిపందేలు నిర్వహిస్తుండగా రెండు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారితీసింది. స్థానికంగా మామిడితోటలో పందేలు నిర్వహిస్తున్న సమయంలో ఈ గొడవ జరిగింది.
*బిహార్, ఒడిశాల్లో గురువారం జరిగిన రెండు వేర్వేరు రైలు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా, మరో 29 మంది గాయాలపాలయ్యారు.
*నిషేధిత చైనా మాంజా అమ్మకాలకు సంక్రాంతి పండగ సమయంలో అడ్డుకట్ట పడటం లేదు. అటవీశాఖ ఆరు మొబైల్స్క్వాడ్లను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 250 దుకాణాలు, మాంజా అమ్మకందారులను తనిఖీ చేసి 118 కిలోల నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి చైనా మాంజా ప్రభావం భారీగా తగ్గిందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్.శోభ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. గాలి పటాలను ఎగరేసేందుకు కొన్నేళ్లుగా చైనా మాంజా (గ్లాస్ కోటెడ్ సింథటిక్)ను వాడుతున్నారు. దీనికి చిక్కుకుని పక్షులు గాయపడుతుండడంతోపాటు చనిపోతున్నాయి.
*అనంతపురం జిల్లా పెనుకొండలో యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో గురువారం తెల్లవారుజామున దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. పెనుకొండ వజ్రాలపేట ప్రధాన రహదారి పక్కన ఉన్న ఏటీఎం వద్దకు కారులో ముసుగులు ధరించిన దొంగలు వచ్చారు.
* మద్యం తాగించి.. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసు కుంది. మృతుడి ఒంటిపై పదికి పైగా కత్తిపోట్లు ఉండటంతో నిందితుడు ఓ పథకం ప్రకారం బయటకు తీసుకువెళ్లి కసితీరా పొడిచి చంపినట్లు భావిస్తున్నారు.
*భారీ ఉగ్ర కుట్రను శ్రీనగర్ పోలీసులు భగ్నం చేశారు. జనవరి 26న దాడికి జైషే మహమ్మద్ ఉగ్రవాదులు శ్రీనగర్లో భారీ పేలుళ్లలో కుట్ర పన్నారు. కుట్రలో భాగస్వాములైన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
*రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నందిగామ వద్ద చోటుచేసుకుంది. నందిగామ గ్రామానికి చెందిన తండ్రి, కొడుకు బైక్పై రోడ్డు దాటుతుండగా డీసీఎం వ్యాను ఢీకొట్టింది. దీంతో కొడుకు తలకు తీవ్రగాయమై సంఘటనా స్థలంలోనే మృతిచెందగా తండ్రికి కాలు విరిగింది.