Agriculture

కరుగుతున్న మంచు కొండలు

Greenland Ice Melting At Record Pace

కరుగుతున్న మంచు కూడా సముద్ర మట్టాలు పెరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనీనదాలు కరుగుతున్నాయి.ఆర్కిటిక్ సముద్ర మంచు 1979కి ఇప్పటికీ చాలా తగ్గిపోయిందని ఉపగ్రహాలు తీసిన ఫొటోలు సూచిస్తున్నాయి. గ్రీన్‌లాండ్‌పై పరుచుకున్న మంచు కూడా కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో కరుగుతోంది.పశ్చిమ అంటార్కిటికాపై ఉన్న మంచు ద్రవ్యరాశి కూడా తగ్గుతోంది. తూర్పు అంటార్కిటికాలోనూ ఈ పరిణామం మొదలవ్వొచ్చని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది.పంటలు, జంతువులపైనా వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తోంది. మొక్కల్లో పూలు పూసే, పండ్లు కాసే సమయాలు ముందుకు జరుగుతున్నాయి. జంతువులు వలస వెళ్తున్నాయి.

భూ ఉపరితల ఉష్ణోగ్రత 1850తో పోల్చితే 21వ శతాబ్దం చివరినాటికి 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరగొచ్చు. చాలా వరకూ అంచనాలు ఇదే సూచిస్తున్నాయి.ప్రస్తుతం ఉన్న గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులే ఇకపైనా కొనసాగితే పెరుగుదల 3 నుంచి 5 డిగ్రీ సెంటీ‌గ్రేడ్‌లు కూడా ఉండొచ్చని డబ్ల్యూఎంఓ అంటోంది.ఉష్ణోగ్రతలో 2 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల పెరుగుదల ప్రమాదకర పరిస్థితులకు దారితీయొచ్చని అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌లకు కట్టడి చేసుకోగలిగితే క్షేమంగానే ఉండొచ్చని ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలు, నాయకులు అంటున్నారు.ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌లకు అదుపు చేయాలంటే సమాజం అన్ని విధాలుగా త్వరితగతిన మారాల్సి ఉంటుందని ఇంటర్‌గవర్న్‌మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) నివేదిక అభిప్రాయపడింది.గ్రీన్ హౌజ్ ఉద్గారాల కట్టడి విషయంలో రాజకీయంగా జరుగుతున్న కృషికి ఐరాస నేతృత్వం వహిస్తోంది.చైనా నుంచే అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు వెలువడుతున్నాయి.ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, యురోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఉన్నాయి. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే, వీటిలో ఉద్గారాలు చాలా ఎక్కువ.ఇప్పటికిప్పుడు గ్రీన్ హౌజ్ వాయువుల ఉద్గారాలు గణనీయంగా తగ్గించుకున్నా, వాతావరణంపై ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు. **ప్రభావం ఎలా ఉంటుంది ….? వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుదన్నదానిపై స్పష్టత లేదు.ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగతాయి. దీంతో మంచినీటి కొరత ఏర్పడొచ్చు. ఆహార ఉత్పత్తిపైనా తీవ్ర ప్రభావం పడొచ్చు. వరదలు, తుఫానులు, వడగాలుల వల్ల మరణాల సంఖ్య పెరగొచ్చు.భూతాపం పెరగడం వల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మంచుపడుతుంది.తీరాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో వేసవుల్లో కరవు ముప్పు ఎక్కువవుతుంది. సముద్ర మట్టాలు పెరుగుతాయి కాబట్టి వరదలు కూడా పెరగొచ్చు.ఈ మార్పులను తట్టుకునే సామర్థ్యం లేని పేద దేశాలపై ప్రభావం విపరీతంగా ఉండొచ్చు.పరిస్థితులకు అంత త్వరగా అలవాటుపడలేవు కాబట్టి కొన్ని రకాల మొక్కలు, జంతువులు తరించిపోవచ్చు.మలేరియా లాంటి వ్యాధులు, పోషకాహార లోపాల బారిన కోట్ల మంది పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేసింది.