DailyDose

రేపు కృష్ణా గుంటూరు జిల్లాల బంద్-తాజావార్తలు

Krishna Guntu Districts Bandh-Telugu Breaking News

* రాజధాని అమరావతి మద్దతుగా రేపు కృష్ణా, గుంటూరు జిల్లా బంద్ కు జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.రాజధాని అమరావతే అంటూ అన్ని కార్యలయలు స్వచ్చందంగా మూసి అమరావతి కొనసాగాలని కోరుతూ బంద్ లో పాల్గొవాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా మన రాష్ట్రము మన అమరావతి అంటూ విద్యాసంస్థలు ముందుకు రావాలని కోరారు.
* ఆంధ్రప్ర్రదేశ్ గణతంత్ర వేడుకల వేదిక మారింది. తొలుత విశాఖలో వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్ సర్కారు నేడు అనూహ్యంగా తన అనిర్నయాన్ని మార్చుకుంది. విజయవాడలోనే ఈ వేడుకలు జరుగుతాయని అందుకు ఏర్పాట్లు చేయాలనీ కోడిసేపతి క్రితం మున్సిపల్ అధికారులకు ఆదేశాలు అందాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించాలని ఆదేశాలు అందడంతో అధికారులు హుటాహుటీన స్టేడియంకు చేరుకున్నారు. విశాఖలో ఇప్పటికే రిపబ్లిక్ వేడుకల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేసారు. స్థానిక పాటశాలల విద్యార్ధుల రీహర్సాల్స్ కూడా జరిగిన తరువాత వేదికను మార్చడం గమనార్హం.
* మండలం, మకరవిళక్కు సీజన్ పూర్తైన నేపథ్యంలో.. శబరిమల అయ్యప్ప ఆలయద్వారాలు మూతపడ్డాయి. ప్రధాన పూజారి నేతృత్వంలో మహాగణపతి హోమం, అభిషేకం, ఉషా నైవేద్యం తదితర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం.. ఆలయద్వారాలు మూసివేశారు.మండలం సీజన్‌ సందర్భంగా 2 నెలలపాటు అయ్యప్ప భక్తులకు దర్శనమిచ్చారు. మకరవిళక్కు జనవరి 15 తేదీనే పూర్తైనప్పటికీ.. భక్తుల దర్శనార్థం సోమవారం వరకు ఆలయ ద్వారాలు తెరిచేఉంచారు. ఆఖరిరోజున అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తారు.మాసపూజల కోసం ఫిబ్రవరి 13న ఆలయద్వారాలు తెరవనున్నారు. ఐదురోజుల పాటు అయ్యప్ప.. భక్తులకు దర్శనమివ్వనున్నారు.
*ట్వ్ ల్లో శాసన మండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేతఆఫ్ శాసన మండలి లో సీన్ రివర్స్, బిల్లు ప్రవేశానికి ఒప్పుకోని చైర్మన్
చైర్మన్ సీటు చుట్టుముట్టిన 14 మంది మంత్రులుశాసన మండలి రెండో సారి వాయిదా.కాసేపటిలో మండలికి హాజరు కానున్న సీఎం వైఎస్ జగన్.
*దిల్లీలో తెలుగు రాష్ట్రాల జలవనరులశాఖ అధికారులు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశమయ్యారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి, నిధుల విడుదలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
గోదావరి నుంచి కృష్ణానదికి మళ్లించే నీటిలో తెలంగాణ వాటాతో పాటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం తరలింపుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
* పార్టీ ఫిరాయింపులపై పార్లమెంటుకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. అనర్హత పిటిషన్లపై స్పీకర్‌కు ప్రస్తుతమున్న నిర్ణయాధికారంపై పార్లమెంట్‌ పునరాలోచించాలని పేర్కొంది. స్పీకర్‌ కూడా ఒక పార్టీకి చెందిన వ్యక్తే కాబట్టి.. తమ సూచనను పార్లమెంట్ పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల పరిష్కారానికి స్వతంత్ర వ్యవస్థను రూపొందించాలని కూడా సూచించింది.
* జమ్మూకశ్మీర్‌లోని అవంతిపురా రీజియన్‌లో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
* భారత్-నేపాల్ దేశాల మధ్య రెండో ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్ అందుబాటులోకి వచ్చింది. జోగ్బానీ బిరాట్‌నగర్‌ చెక్‌పోస్ట్‌ను భారత్‌, నేపాల్ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, కేపీ శర్మఓలీ దృశ్య మాద్యమం ద్వారా సంయుక్తంగా ప్రారంభించారు.
* వెంకటాచలంలో ఉన్న అక్షర విద్యాలయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ సందర్శించారు.
* ప్రతి ఏటా లాగే ఈ ఏడాది కూడా పిడుగురాళ్ల పట్నంలోని తహసీల్దార్ మరియు ఎంపీడీవో కార్యాలయాల వద్ద గల ప్రసన్నాంజనేయ స్వామివారి రథోత్సవం కార్యక్రమాలు ఈనెల 26 నుంచి జరగనున్నట్లు దేవస్థాన కమిటీ తెలిపారు
* విమానాశ్రయంలో కలకలం రేపిన బాంబు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో సరికొత్త నిజాలు వెలుగు చూశాయి. ఐఈడీ ఉన్న బ్యాగు కాకుండా అనుమానితుడి వద్ద మరో బ్యాగు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
* మంగళగిరి జనసేన కార్యాలయంలో రాజధాని రైతులతో సమావేశం సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు.
* అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ క్యూరేటివ్ పిటిషన్ దాఖలైంది. ఈ తీర్పు ‘‘వాస్తవాల’’ ఆధారంగా కాకుండా ‘‘విశ్వాసాల’’ ఆధారంగా వెలువరించారంటూ యూపీకి చెందిన పీస్ పార్టీ ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
* మెరుగైన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి చదువేనని.. అందుకే విద్యారంగంలో గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
* అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ క్యూరేటివ్ పిటిషన్ దాఖలైంది. ఈ తీర్పు ‘‘వాస్తవాల’’ ఆధారంగా కాకుండా ‘‘విశ్వాసాల’’ ఆధారంగా వెలువరించారంటూ యూపీకి చెందిన పీస్ పార్టీ ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
* సోమవారం మధ్యాహ్నం అరెస్ట్‌ అయి, మంగళవారం తెల్లవారుజామున గుంటూరు సబ్‌ జైలుకు తరలించబడిన తెలుగుదేశం పార్టీ లోక్‌ సభ సభ్యుడు గల్లా జయదేవ్‌ కు బెయిల్‌ మంజూరు అయింది. ఎపి రాజధానిని మూడు ప్రాంతాలకు మార్చడంపై గల్లా జయదేవ్‌ నిన్న నిరసనలకు దిగగా, ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ కేసును పోలీసులు నమోదు చేశారు. మంగళగిరి మేజిస్ట్రేట్‌ కోర్టులో జయదేవ్‌ తరపు న్యాయవాది బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేయగా, ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ ను మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.
* ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు ఉంటాయంటూ ఎపి ప్రభుత్వం స్పష్టం చేయడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న అమరావతి రైతులు తమ బాధలను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు చెప్పుకోవడానికి మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయానికి మంగళవారం చేరుకున్నారు.ప్రభుత్వ వైఖరి, పోలీసుల లాఠీచార్జి చేసిన తీరుతో పాటు పలు విషయాలపై రైతులు పవన్‌ కల్యాణ్‌కు తెలిపి, తమ తరఫున పోరాడాలని కోరనున్నారు. కాసేపట్లో రైతులతో పవన్‌ చర్చించి, ఆ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. బిజెపి తో కలిసి పోరాడతామని ఇప్పటికే జనసేన పార్టీ స్పష్టం చేసింది. వైసిపి తీసుకున్న రాజధాని నిర్ణయం వైసిపి వినాశనానికి నాంది అని పవన్‌ నిన్న మండిపడ్డారు…
* రాజధాని అమరావతి విడిపోయిందనే బాధతో ఎమ్మెల్సీ పదవికి తెదేపా నేత డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ప్రకటించారు. చంద్రబాబు, లోకేశ్‌ తనపై చూపిన ఆదరణ మరువలేనిదన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న మాణిక్యవరప్రసాద్‌.. ఈరోజు మండలి సమావేశాలకు కూడా హాజరుకాలేదు
* రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో బంద్‌ కొనసాగుతోంది. రైతులు, మహిళలపై నిన్న అసెంబ్లీ ముట్టడి సందర్భంగా పోలీసుల లాఠీ ఛార్జికి నిరసనగా అమరావతి పరిరక్షణ సమితి రాజధాని గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చింది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు. మంచినీరు సహా ఏ పదార్థాలు పోలీసులకు విక్రయించరాదని నిర్ణయించుకున్నట్లు వ్యాపారులు తెలిపారు. పోలీసులు అడ్డుకుంటే జాతీయ జెండాలతో నిరసనలు తెలపాలని రాజధాని రైతులు నిర్ణయించారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజా సంఘాలు, రాజకీయపక్షాలు ఆందోళనలు చేపట్టాయి.
* ఎంసెట్ కొత్త కన్వీనర్గా ఆచార్య ఎ.గోవర్ధన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన జేఎన్టీయూహెచ్ రెక్టార్గా, ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి సోమవారం మొత్తం 8 ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమించారు.
* పోలీసుల నిఘా, నిషేధాజ్ఞలను దాటుకుని గుంటూరు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ సోమవారం అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వ్యూహాత్మకంగా చేరుకున్నారు. అంగరక్షకులు వెంట ఉంటే తన కదలికలను పోలీసులు తెలుసుకుంటారని భావించి వారిని వెనక్కు పంపించి అసెంబ్లీ పరిసరాలకు చేరుకోవడం వారిని విస్మయపరచింది.
* ప్రవేశ పరీక్షలను ఒక విద్యార్థికి బదులు మరొకరు రాయకుండా సులభంగా నిరోధించేందుకు ముఖ గుర్తింపు హాజరు(ఫేసియల్ రికగ్నైజేషన్) విధానం ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ప్రస్తుతం ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి. దాని స్థానంలో ముఖాన్ని గుర్తించి అనుమతించే విధానంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు
* మరో అంతర్జాతీయ సదస్సుకు ఐఐటీ హైదరాబాద్ వేదిక కానుంది. డిసెంబరు 14 నుంచి 16 వరకు ‘కండిషన్ అసెస్మెంట్, రిహాబిలిటేషన్ అండ్ రెట్రోఫిట్టింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ (సీఏఆర్ఆర్ఎస్)-2020’ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఐఐటీ అధికారులు వెల్లడించారు. నిర్మాణ రంగానికి సంబంధించి భారతదేశంలో జరిగే మొదటి సదస్సు ఇదని తెలిపారు. ప్రతిపాదిత పత్రాల సమర్పణకు చివరి తేదీ జనవరి 31 కాగా.. తుది పత్రాల సమర్పణకు గడువు మే 31.
* మాల్దీవుల ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనంగా మారింది. ఆగ్నేయ భారతం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నాయి. రాత్రిపూట ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి చలి తగ్గుతోంది. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్లో 20.2, నల్గొండలో 19.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణంకన్నా 4.2 డిగ్రీలు అధికం అని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 14 నుంచి 15 డిగ్రీల వరకు ఉండటంతో చలి ఉంది. మిగతా ప్రాంతాల్లో 20 డిగ్రీల వరకు రాత్రిపూట నమోదవుతోంది. సోమవారం పగలు హైదరాబాద్లో గరిష్ఠంగా 30.6, రామగుండంలో 28.4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. రాత్రి రామగుండంలో 18.6 డిగ్రీలు నమోదైంది
* ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో సేవలందించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన 36 స్పెషలిస్టు వైద్యుల పోస్టులను త్వరలోనే భర్తీ చేయడానికి వైద్యఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. వైద్యఆరోగ్యశాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి తెలంగాణ సర్కారు 2018 సెప్టెంబరులో ప్రత్యేకంగా వైద్య నియామక మండలిని ఏర్పాటు చేసింది. ఏడాదిన్నర కాలంగా నియామక ప్రక్రియ విధి విధానాలపై మండలి కసరత్తు చేసింది.
* ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయుల ఓపీ సేవల కేంద్రాల్లో(వెల్నెస్ సెంటర్లు) ఇక నుంచి ఔషధాల సరఫరాకు సంబంధించి పక్కా జాబితాను రూపొందించనున్నారు. నిమ్స్, తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ)లతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల నుంచి మాత్రమే ఔషధాలను కొనుగోలు చేయనున్నారు.
* దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెట్రోలియం ఉత్పత్తులను పొదుపుగా వినియోగించాలని సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు. పెట్రోలియం పరిరక్షణ పరిశోధన సంఘం (పీసీఆర్ఏ), అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ (ఏఎస్ఆర్టీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో ‘సక్షం-2020’ కార్యక్రమం జరిగింది.
* విశ్వవిద్యాలయం పరిధిలో కళాశాలలు, కోర్సుల మూసివేతకు నిరభ్యంతర ధ్రువపత్రం కోసం యాజమాన్యాలు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జేఎన్టీయూహెచ్ గడువు విధించింది. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి కళాశాలల అనుమతికి త్వరలో నిబంధనావళి విడుదల కానుంది.
* తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ మండలి సభ్యులకు జోన్ల వారీగా హైదరాబాద్లో శిక్షణ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. ఒక్కో జోన్ పరిధిలోని సభ్యులకు ఒక రోజు పాటు శిక్షణ ఇస్తారు. ఈ నెల 21 నుంచి సంబంధిత ప్రక్రియ ప్రారంభం కానుంది.
* రాష్ట్ర పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణ ప్రక్రియ శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. మొత్తం 16,295 మంది కానిస్టేబుళ్ల ఎంపిక కోసం కొద్దిరోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో 9,200 మంది సివిల్/ఏఆర్/టెక్నికల్ స్టైఫండరీ, 3,800 మంది టీఎస్ఎస్పీ, 690 మంది ఎస్పీఎఫ్, జైళ్లు, అగ్నిమాపకశాఖలకు చెందిన పోస్టులకు అర్హత సాధించారు. అర్హులు లేకపోవడంతో మిగిలిన పోస్టులు భర్తీ కాలేదు.
* రాష్ట్రంలో జీవ ఇంధన కొనుగోలు ధరలను నిర్ణయించాలని విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి చక్కెర మిల్లుల యాజమాన్యాలు విన్నవించాయి. సంబంధిత మిల్లులు ఉత్పత్తి చేసిన ఇంధనానికి సంబంధించి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కొనుగోలు చేసే ధరలను ఈఆర్సీ నిర్ణయిస్తుంది. గతంలో ఖరారు చేసిన కొనుగోలు ధరల గడువు ముగిసినందున మళ్లీ కొత్తగా నిర్ణయించాలని కోరాయి.
* అద్దెగర్భం (సరోగసీ) సవరణ బిల్లు 2019పై ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించడానికి ఈ నెల 23న రాజ్యసభ సెలెక్ట్ కమిటీ రాష్ట్రంలో పర్యటించనుంది. అద్దెగర్భ స్వీకర్తలు, దాతలు, నిపుణులు, అధికారుల నుంచి అభిప్రాయ సేకరణ కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సెలెక్ట్ కమిటీ పర్యటిస్తోంది. 22న గుజరాత్లో వడోదర, ఆనంద్ నగరాల్లో పర్యటనలు ముగించుకొని, అదే రోజు సాయంత్రం 6 గంటలకు సెలెక్ట్ కమిటీ బృందం హైదరాబాద్కు చేరుకుంటుంది. 23న ఉదయం ఎంపిక చేసిన సరోగసీ కేంద్రాలను సందర్శించి.. అక్కడ అద్దెగర్భం ద్వారా సంతానాన్ని పొందుతున్న స్వీకర్తలు, అద్దెగర్భాన్నిస్తున్న దాతలతో చర్చిస్తుంది. అనంతరం వైద్యులతో, ప్రభుత్వ ఉన్నతాధికారులతో భేటీ అవుతుంది. సరోగసీలో అడ్డగోలు విధానాలను నియంత్రించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను కమిటీకి వివరించడానికి శనివారం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించనుంది.
* కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) జాయింట్ డైరెక్టర్గా 1994 గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్ నియమితులయ్యారు. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
* ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాసు(ఐఐటీఎం)కు పూర్వ విద్యార్థి ఒకరు రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఐఐటీఎంలో కావేరి వసతిగృహం నిర్మాణం 1961లో జరిగింది. ఆ వసతి గృహాన్ని అధునాతన సదుపాయాలతో తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఐఐటీఎం పూర్వ విద్యార్థి, ఇండో యూఎస్ ఎంఐఎం టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ చివుకుల రూ.5 కోట్ల విరాళం అందించేందుకు ముందుకొచ్చారు
* ఆధునిక సదుపాయాలు గల రెండో తేజస్ రైలును గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ శుక్రవారం ఉదయం 10.45కు అహ్మదాబాద్లో ప్రారంభించారు. నిర్దేశిత సమయం కంటే దాదాపు అరగంట ముందే ఈ రైలు సాయంత్రం 4.45కి ముంబయి చేరింది. అహ్మదాబాద్-ముంబయి (500కి.మీ) మధ్య నడిచే ఈ రైలును రైల్వే శాఖకు అనుబంధంగా ఉండే ఐఆర్సీటీసీ నడుపుతుంది.
* ఇరాన్ దాడిలో తమ సైనికులెవరూ గాయపడలేదని చెబుతూ వచ్చిన అమెరికా శుక్రవారం అసలు విషయాన్ని వెల్లడించింది. ఇరాక్లోని అల్ అసద్ వైమానిక స్థావరంపై ఈ నెల 8న ఇరాన్ జరిపిన దాడిలో… అక్కడే ఉన్న తమ సైన్యంలో కనీసం 11 మంది గాయపడినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ బిల్ అర్బన్ ఓ ప్రకటనలో తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం వీరిలో కొంతమందిని జర్మనీ, కువైట్, అఫ్గానిస్థాన్లోని వైద్య కేంద్రాలకు తరలించినట్టు చెప్పారు.
* పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండు విడుతలుగా సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 31న ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఆ రోజు నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడుత సమావేశాలు జరుగుతాయి. తర్వాత మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు మలి విడుత సమావేశాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడతారు.
* సంక్రాంతి పర్వదినానికి సొంతూళ్లకు వెళ్లిన ప్రజల తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. శుక్రవారం విద్యాసంస్థలు, ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకుంటుండటంతో పల్లెలకు వెళ్లిన ప్రయాణికులు హైదరాబాద్ బాట పట్టారు.
* అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా రాష్ట్రంలో నేరాలను నియంత్రించడంతోపాటు ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు
* దివంగత తమిళనాడు మాజీ సీఎం కరుణానిధిపై తెలుగులో రాసిన ‘కలైంజ్ఞర్ కరుణానిధి’ పుస్తకాన్ని గురువారం చెన్నైలో ఆయన కుమార్తె, ఆ పార్టీ ఎంపీ కనిమొళికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, కార్యదర్శి కోయ చంద్రమోహన్లు అందజేశారు.
* ఆన్లైన్ విధానం ద్వారా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అనుమతులు, రెన్యువల్, ఇతర సేవలను పొందేందుకు ఏడాదికి రూ.2వేల చొప్పున వినియోగ రుసుంను (యూజర్ ఛార్జీలు) వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ కమిషనర్కు అనుమతి ఇచ్చింది.
* ఆంధ్రప్రదేశ్తో గల విభజన సమస్యలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం సమీక్ష నిర్వహించారు. బీఆర్కే భవన్లో జరిగిన ఈ సమావేశంలో ఏపీ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ విభాగం ముఖ్యకార్యదర్శి ప్రేమ్చంద్రారెడ్డి, తెలంగాణ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావులు పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ ప్రగతిభవన్లో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డిల మధ్య జరిగిన చర్చల సందర్భంగా విభజన సమస్యల సత్వర పరిష్కారానికి నిర్ణయం తీసుకున్నారు.
* పురపాలక ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు తోడ్పాటును అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్వాచ్ బాధ్యులు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డికి తెలిపారు. గురువారం ఎలక్షన్వాచ్ బాధ్యులు పద్మనాభరెడ్డి, రావు చెలికాని, రామ్మోహన్రావు సహా పలువురు సభ్యులు ఎన్నికల కమిషనర్ను కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు.
* నీటిపారుదల శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు జరుగుతున్న కసరత్తులో భాగంగా కీలకమైన సమావేశాన్ని ఈ నెల 23న నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. గత నెల 21న నీటిపారుదలశాఖ ఇంజినీర్లతో ఒక కార్యశాలను నిర్వహించింది. ఈఈలు, ఎస్ఈలు, సీఈలు, ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)లతో చర్చించి వారి అభిప్రాయాలను నమోదు చేసింది. చిన్న, మధ్య, భారీ నీటి పారుదల, ఐడీసీ, హైడ్రాలజీ తదితర విభాగాలన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి సమగ్రమైన నీటిపారుదల విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించింది. వ్యవస్థీకరణపై అవసరమైతే ఇంజినీర్లతో సమావేశం అవుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో ప్రకటించారు.
* సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తుది ఘట్టమైన ముఖాముఖి (పర్సనాలిటీ టెస్టు)కి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 75 మంది వరకు ఎంపికైనట్లు అంచనా. దేశవ్యాప్తంగా గత సెప్టెంబరు 20 నుంచి 29 వరకు ప్రధాన పరీక్షలు(మెయిన్స్) నిర్వహించగా 11,845 మందికిగాను దాదాపు 11 వేల మంది హాజరయ్యారు. వాటి ఫలితాలను యూపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. మొత్తం 896 ఖాళీలకు 2,304 మందిని ఫిబ్రవరిలో మొదలయ్యే ముఖాముఖికి ఎంపిక చేసింది. వీరిలో ఏపీ, తెలంగాణ నుంచి 75 మంది వరకు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.