ScienceAndTech

రష్యా సాయంపై శివన్ ప్రకటన

ISRO Receives Huge Support From Russia Round The Clock

ఇస్రో చైర్మన్ కె.శివన్ చంద్రయాన్-3పై తాజా వివరాలు వెల్లడించారు.

చంద్రయాన్-3 కార్యక్రమం షురూ అయిందని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

ఈ బృహత్తర కార్యక్రమం కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేశామని, ఈ నెలాఖర్లో వారు రష్యాలో శిక్షణ పొందుతారని వివరించారు.

1984లో సోవియట్ వ్యోమనౌక ద్వారా రాకేశ్ శర్మ అంతరిక్ష యానం చేశాడని, ఇప్పుడు భారత వ్యోమనౌక ద్వారా భారతీయులు రోదసి యాత్రలో పాల్గొంటున్నారని చెప్పారు.

రోదసిలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా రాకేశ్ శర్మ చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు.

రాకేశ్ శర్మ 1984 ఏప్రిల్ 2న నాటి సోవియట్ యూనియన్ కు చెందిన సోయుజ్ టి-11 వ్యోమనౌకలో ప్రయాణించి అంతరిక్షంలో కాలుమోపాడు.