Editorials

రెండు జిల్లాలుగా కృష్ణా

Krishna District To Split Into Two

ఇక కృష్ణా జిల్లా రెండుజిల్లాలుగా మారనుంది. రెండు లోక్‌సభ స్థానాలు రెండు జిల్లాలుగాఆవిర్భవించనున్నాయి. ప్రస్తుతం మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లా రెండుముక్కలు కానుంది. విజయవాడ కేంద్రంగా మరో జిల్లా ఆవిర్భావం కానుందని తెలిసింది.జిల్లాల విభజనపై మంత్రివర్గ సమావేశంలో సోమవారం చర్చ జరిగింది. రాష్ట్రంలోప్రస్తుతం ఉన్న జిల్లాలను పరిపాలన సౌలభ్యం కోసం 25 జిల్లాలుగా పునర్విభజనచేయడానికి మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. లోక్‌సభ స్థానం పరిధి ఒక జిల్లాగాచేస్తామని గతంలోనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలోభాగంగా అడుగుముందుకు వేయనున్నారు. దీనిపై సీసీఎల్ఏ నుంచి సమగ్ర వివరాలుతెప్పించుకున్నట్లు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం 10 జిల్లాలను విభజించి చిన్నజిల్లాలుగా ఏర్పాటు చేసింది. పరిపాలన సులభతరంగా ఉంటుందనేది దీని ఉద్దేశం. జిల్లాలోరెండు నియోజకవర్గాల పరిస్థితి ఏమిటనేది తేలాల్సి ఉంది. ఆ రెండు ఏలూరు జిల్లాలోకివెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. **సర్వత్రా ఆసక్తి..! జిల్లాల పునర్విభజనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.విజయవాడ కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే నగరం రెండు జిల్లాల పరిధిలోకి చేరనుంది.మచిలీపట్నం పరిధిలో బందరు, పెడన, అవనిగడ్డ, పామర్రు,గన్నవరం, పెనమలూరు, గుడివాడనియోజకవర్గాలు ఉంటాయి. పెనమలూరు నియోజకవర్గంలో ఉండే కానూరు, యనమలకుదురుగ్రామ పంచాయతీలు విజయవాడ నగరంలో భాగంగానే ఉంటాయి. ఇవి మచిలీపట్నం జిల్లాలోకిచేరనున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం మచిలీపట్నం జిల్లా పరిధిలోకి వెళ్తుంది.గన్నవరం నియోజకవర్గం గన్నవరం, బాపులపాడు, ఉంగటూరుమండలాలతో పాటు విజయవాడ గ్రామీణ మండలం చేరింది. ఎనికేపాడు, గూడవల్లి,ప్రసాదంపాడు, నున్న పంచాయతీలు వాటి పరిధిలో ఉన్నాయి. దీంతో ఇవిమచిలీపట్నం జిల్లాలోకి వెళ్లనున్నాయి. విజయవాడ జిల్లా పరిధిలో తిరువూరు, జగ్గయ్యపేట,నందిగామ, మైలవరం, విజయవాడ నగరం పరిధిలోని తూర్పు, మధ్య,పశ్చిమ నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలిన నూజివీడు, కైకలూరునియోజకవర్గాలు ఏలూరు పార్లమెంట్‌ పరిధిలోకి వెళ్తాయి. దీంతో జిల్లా మూడు ముక్కలుకానుంది. నందిగామ కేంద్రంగా మరో రెవెన్యూ డివజన్‌ ఏర్పాటు ప్రతిపాదన గతకొన్నేల్లుగా దస్త్రాలకే పరిమితమైంది. జిల్లాల పునర్విభజనతో రెవెన్యూ కేంద్రంఏర్పాటు చర్చనీయాంశంగా మారింది. కొన్ని మండలాలను నందిగామ పరిధిలోకి చేర్చనున్నారనిఅంటున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటైతే కొత్త ఉద్యోగాల కల్పన ఉంటుందన్న ఆశలుపెరుగుతున్నాయి.