Health

గోరు వెచ్చని నీటితో నొప్పులు మాయం

Latest Telugu Health News-Luke Warm Waters Helps From Pain

చాలామందికి కూలింగ్‌ వాటర్‌ తాగటం అలవాటైపోయింది. అయితే ఫ్రిజ్‌ వాటర్‌ కంటే వేడినీటిని తాగడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శొంఠిపొడి కలిపిన వేడినీటిని అప్పుడప్పుడు తాగితే వాత సంబంధిత వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు.అలాగే వేడినీళ్లను సేవించే వారిలో అజీర్ణ సమస్యలుండవని, తలనొప్పి ఉండదని నిపుణులు చెబుతున్నారు. వేడినీరు రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. ఉదర సంబంధిత వ్యాధు లను నయం చేస్తుంది. ఇంకా విందుల్లో ఫుల్‌గా లాగించారా.. అయితే గ్లాసు వేడినీరు తాగేస్తే చాలు.. అజీర్ణ సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మృదువైన చర్మం కోసం.. బార్లీ పౌడర్‌ టేబుల్‌స్పూన్‌ వేసి, కాచిన నీటిని అప్పుడప్పుడూ తాగడం మంచిది. కాళ్లు, కీళ్ల నొప్పులకు చెక్‌ పెట్టాలంటే వేడినీటిలో తగినంత ఉప్పు వేసి.. ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే కాళ్ల నొప్పులుండవు. పాదాల నొప్పులు, పగుళ్లకు ఈ నీటిలో పావుగంటసేపు పాదాలను ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.దాహం వేస్తే చల్లటి నీరు తాగడం కంటే వేడినీటిని తాగితే శరీరంలోని మలినాలన్నీ తొలగిపోతాయి. భోజనానికి అరగంట ముందు గ్లాసు వేడినీరు తాగితే శరీర బరువు తగ్గుతుంది. దీంతో ఊబకాయానికి చెక్‌ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.